Alluri Sitarama Raju
-
వైఎస్ జగన్‌తో కురసాల కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్మోహన్రెడ్డి కన్నబాబుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వైఎస్ జగన్ ఆదేశించారు. -
విద్యార్థులను పస్తులుంచిన ఉపాధ్యాయులు
● మధ్యాహ్న భోజనం పెట్టని టీచర్లు ● ఫిర్యాదు చేసిన జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు ● మెమో జారీ చేసిన ఎంఈవో ముంచంగిపుట్టు: మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు పస్తులుండవలసి వచ్చింది. ఈ విషయం గుర్తించిన జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ సోనియా ప్రసన్నకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల ఎదుట మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు ఎదురు చూస్తూ ఉండడంతో గమనించిన ప్రసన్నకుమార్ పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నించగా గ్రామంలో పండగ ఉండడంతో మధ్యాహ్న భోజనం పెట్టలేదని సమాధానం చెప్పారు. దీనిపై ఆయన మండల విద్యాశాఖాధికారి–2 రత్నకుమార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎంఈవో మాకవరం ఎంపీపీ పాఠశాలలో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులకు మెమో జారీ చేశారు.మధ్యాహ్న భోజనం పెట్టకపోవడానికి కారణాలను 48 గంటల్లో తెలియజేయాలని ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల అరెస్టు
అరకులోయటౌన్: అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరకులోయ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు గ్రాముల బంగారం, రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లు, రూ.1,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను పాడేరు డీఎస్పీ ఎస్కే షెహబాజ్ అహ్మద్ బుధవారం అరకు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో వెల్లడించారు. అరకులోయ పోలీస్ సర్కిల్ పరిధిలోని డుంబ్రిగుడ మండలం బోందుగుడలో సూర్యప్రకాశరావు ఇంట్లో ఈనెల 8వ తేదీ రాత్రి ఒడిశా, ఆంధ్రాకు చెందిన ఐదుగురు దొంగలు చొరబడి కర్రలతో కొట్టి, కత్తులతో బెదిరించి రెండు గ్రాముల బంగారు పుస్తెలు, రూ.30వేల నగదు, ఇతర వస్తువులు అపహరించినట్టు చెప్పారు. డుంబ్రిగుడ పోలీసులు అరకు సీఐ ఎల్.హిమగిరి నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టి, చాకచక్యంగా ముఠాలో ఇద్దరు సభ్యులను పట్టుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులైన డుంబ్రిగుడ మండలం బొందుగు డ గ్రామానికి చెందిన పావుకారి సురేష్(24), ఒడిశా రాష్ట్రం శిమిలిగుడ మండలం, దోలింబ పంచాయతీ కుంటగుడ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ బోస్లా(24)లను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరిని గురువారం కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. ఒడిశాకు చెందిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పాడేరు సెంట్రల్ క్రైమ్ టీం హెచ్‌సీలు నాగేశ్వరరావు, సత్యనారాయణ, బెహరాలకు నగదు రివార్డులను డీఎస్పీ అందజేశారు. కేసును ఛేదించిన అరకు సీఐ ఎల్.హిమగిరి, డుంబ్రిగుడ, అరకులోయ ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఎల్. హిమగిరి, డుంబ్రిగుడ ఎస్ఐ కె.పాపినాయుడు పాల్గొన్నారు. -
నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్ చింతూరు: పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న గ్రామాలకు చెందిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. కాలనీల నిర్మాణాల్లో జరిగిన తప్పులను సరిచేసి కొత్తగా పెరిగిన రేట్లకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనేతర నిర్వాసితులకు ఏలూరు జిల్లా తాడ్వాయి, పశ్చిమ గోదావరి జిల్లా యాదవోలు ప్రాంతాల్లో త్వరితగతిన కాలనీల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. కాలనీల నిర్మాణ ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్లు ఉంటే కొంతమేర స్థలాన్ని వదిలేసి మిగతా స్థలంలో నిర్మాణాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఆర్అండ్ఆర్ కాలనీల్లో రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన విలువలో తేడాలు వచ్చాయంటూ చాలామంది దరఖాస్తులు ఇచ్చారని, రీసర్వే నిర్వహించా లని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. చింతూ రు డివిజన్లో అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయిన రహదారులు, వంతెనలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారానికి వినతి కలెక్టర్ దినేష్‌కుమార్ చింతూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా నాలుగు మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు భారీసంఖ్యలో తరలివచ్చి తమ గ్రామాలకు చెందిన ముంపు సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ పొలాలు, గ్రామాలు మునుగుతున్నా ముంపు జాబితాలో చేర్చలేదని పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులు కలెక్టర్ ఎదుట వాపోయారు. ఆర్అండ్ఆర్ సర్వేలో భాగంగా ఇంటి విలువలు సక్రమంగా సర్వే చేయలేదని, రీసర్వే చేసి తమకు న్యాయం చేయాలని పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలవరం అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పనుల పురోగతి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారి అభిషేక్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, పోలవరం స్పెషలాఫీసర్ సరళావందనం పాల్గొన్నారు. -
ఔరా
జీలుగు నీరా..● ఫలించిన కేవీకే శాస్త్రవేత్తల పరిశోధనలు ● జీలుగు నీరాతో సిరప్, బెల్లం, ఇతర ఉత్పత్తుల తయారీ ● ఆధునిక పద్ధతుల్లో సేకరణపై దృష్టి ● గిరిజనులకు ఆదాయవనరుగా మార్చేందుకు చర్యలు ● కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ దిశానిర్దేశం జీలుగు నీరా ిసిరప్జిల్లాలో మారేడుమిల్లి, వై.రామవరం అప్పర్ పార్ట్ మినహా అన్ని చోట్ల తాటి చెట్లు విరివిగా కనిపిస్తాయి. ఒక తాటి చెట్టు నుంచి రోజుకు నాలుగైదు లీటర్ల వరకు మాత్రమే కల్లు సేకరించగలరు. అదే జీలుగు చెట్టు నుంచి రోజుకు 40 నుంచి 60 లీటర్ల వరకు కల్లు ఉత్పత్తి అవుతుంది. తాటి కల్లును సొంతంగా వాడుకోవడంతో పాటు ఎక్కువగా ఉంటే దాని నుంచి చిగురు (కల్లును మరగబెట్టి ఆవిరి నుంచి తయారు చేసే సారా) తయారు చేసుకుంటారు. జీలుగు కల్లును మాత్రం గిరిజనుల నుంచి సేకరించి జిల్లాలో నలుమూలలతో పాటు మైదాన ప్రాంతాలకు వ్యాపారులు రవాణా చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో జీలుగు కల్లు లభించడమే ఇందుకు ప్రధాన కారణం. నీరా సేకరణ, ఉత్పత్తులపై శిక్షణ జీలుగు నీరా, ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.గోవిందరాజులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల కేవీకేను సందర్శించిన కలెక్టర్ దినేష్‌కుమార్‌కు జీలుగు నీరా గురించి వివరించడంతో ఆయన వెంటనే స్పందించి, జిల్లాలో ఎన్ని జీలుగు చెట్లు ఉన్నాయో సమగ్ర సర్వే నిర్వహించాలని దిశ నిర్దేశం చేశారు. నీరా ఉత్పత్తిని జిల్లా అంతా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు ప్రణాళికలు తయారీ చేయాలని ఆదేశించారు. తాటి, జీలుగులను కలిపి ఒక బోర్డు ఏర్పాటు చేస్తే భవిష్యత్‌లో మంచి ఫలితాలు ఉంటాయి. –డాక్టర్ రాజేంద్రప్రసాద్, కేవీకే కోఆర్డినేటర్,సీనియర్ శాస్త్రవేత్త, పందిరిమామిడి లా భా లు లా భా లుతాటికంటే అధికంగా కల్లు ఉత్పత్తి -
తగ్గిన చలి గాలులు
సాక్షి, పాడేరు: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తున్నప్పటికీ చలిగాలుల తీవ్రత తగ్గింది. పాడేరు,అరకులోయ,లంబసింగితో పాటు పలు ప్రాంతాల్లో ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. లైట్లు వేసుకునే వాహనాలను నడపవలసి వచ్చింది. జి.మాడుగులలో 13.9, చింతపల్లిలో 14, జీకే వీధిలో 14.3, పెదబయలులో 15.5, డుంబ్రిగుడలో 15.7, ముంచంగిపుట్టులో 15.9, పాడేరులో 16, అరకులోయలో 16, అనంతగిరిలో 16.2, హుకుంపేటలో 16.8, కొయ్యూరులో 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు బుధవారం నమోదయ్యాయి. -
లైంగిక దాడుల కేసుల్లో నిందితులపై కఠిన చర్యలు
● ప్రతి జిల్లాలో సీఐ, ఎస్ఐలతో ప్రత్యేక సమీక్షలు ఏర్పాటు చేయాలి ● ఆదేశించిన డీఐజీ గోపీనాథ్ జెట్టీ ● విశాఖ రేంజ్ జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్సాక్షి, విశాఖపట్నం: మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాలు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని విశాఖ డీఐజీ గోపీనాథ్ జట్టీ అన్నారు. వీటిపై జిల్లా ఎస్పీలు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, నిందితులపై కేసులు నమోదు చేసి త్వరితగతిన శిక్షలు పడేలా సీఐ, ఎస్ఐలు పనిచేయాలని ఆదేశించారు. అలాగే, నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం కల్పించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం విశాఖ రేంజ్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం జిల్లాల ఎస్పీలు ఇతర జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎన్.బి.డబ్ల్యూ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, పొక్సో కేసులు, హేయమైన నేరాలు సంబంధించిన కేసుల పై సమీక్ష నిర్వహించారు. గంజాయి రవాణాకు పాల్పడుతున్న, గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై ప్రత్యేక షీట్స్ తయారు చేయాలన్నారు. గంజాయి నిందితుల ఆస్తుల స్వాధీనానికి, పీడీ యాక్ట్ పెట్టేందుకు, కేసుల పురోగతికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమీక్ష సమావేశంలో రేంజ్ పరిధిలోని 5 జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, వకుల్ జిందాల్, అమిత్ బర్దర్, కేవీ మహేశ్వర్ రెడ్డి, ఎస్.వి.మాధవరెడ్డి, ఇతర విశాఖపట్నం రేంజ్ అధికారులు పాల్గొన్నారు. -
సిరప్, బెల్లం తయారీ
కేవీకే శాస్త్రవేత్తలు జీలుగు నీరాతో సిరప్, బెల్లం తయారు చేశారు. నీరాను మంట మీద సుమారు మూడు గంటల వరకు మరగపెడతారు. దాని నుంచి మంచి ఆరోమా వస్తూ చిక్కపడిన తరువాత పానకం దశలో ఉండగా మంటమీద నుంచి తీసివేస్తే సిరప్గా తయారవుతుంది. పంచదార,చెరకు బెల్లానికి ప్రత్యామ్నాయంగా దీనిని వినియోగించవచ్చు.ఎన్ని రోజులైన నిల్వ ఉంటుంది. జీలుగు నీరాను మూడున్నర గంటల మరగపెడుతూ పానకం దశ దాటిన తరువాత, ఎక్కువ సేపు కలుపుతూ ఉంటే పాకం గట్టిపడి బెల్లంగా మారుతుంది. వీటిని స్వీట్ల తయారీలో ఉపయోగించవచ్చు. బెల్లం -
ఉత్సాహంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్
అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం డిగ్రీ కళాశాలల విద్యార్థుల జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్ ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, 100, 200 మీటర్ల రన్నింగ్ , లాంగ్ జంప్, హైజంప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 200 మంది విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. పీఈటీలు అప్పారావు, శివరామకుమార్, ప్రసాద్, కోచ్‌లు గణపతి, రాజబాబు, శ్రీను, స్వామి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.ఎస్.ఎన్. మూర్తి, అనంతగిరి ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ సన్యాసినాయుడులతో పాటు కళాశాల ఎన్ఎస్ఎస్ పీవోలు వై. విజయలక్ష్మి, ఎం.అనిత కుమారి, పి.నాగబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చింతపల్లి: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యుల నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని, వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. బుధవారం చింతపల్లి వచ్చిన ఆయన జెడ్పీటీసీ బాలయ్య, వైఎస్సార్సీపీ సీనియర్‌నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సీహెచ్‌సీగా ఉన్న చింతపల్లి ఆస్పత్రిని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారని, కొత్త ఆస్పత్రి భవనానికి సుమారు రూ.23కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఈఆస్పత్రిలో గతంలో పనిచేసిన సూపరింటెండెంట్లు అక్రమాలకు పాల్పడి, నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. తమ ఫిర్యాదు మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆబాధ్యతలనుంచి తప్పించారని చెప్పారు. దీంతోనే అధికారులు సరిపెట్టకుండా సమగ్ర విచారణ జరపాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఆస్పత్రి అభివృద్ధి సలహా మండలి నియామకాలు జరుగుతాయన్నారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులకు కృష్ణారావు, గంగన్న పడాల్, ఈశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన ఉత్పత్తుల సేకరణపై ప్రత్యేక దృష్టి
పాడేరు: గిరిజన ఉత్పత్తుల సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో జీసీసీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీసీసీ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీలోగా అంగన్వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న పాఠశాలలకు నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. కాఫీ సేకరణ లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు. గిరిజన రైతులకు జీసీసీ ద్వారా అందిస్తున్న రుణాల రికవరీపై ఆరా తీశారు. జీసీసీ డీఎంలు ప్రతి డీఆర్ డిపోను విధిగా తనిఖీ చేయాలని సూచించారు.జీసీసీ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా నిర్ధేశించిన సమయానికి లబ్ధిదారులకు రేషన్ సరకుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, జీసీసీ డీఎంలు డుప్పా సింహాచలం, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ -
పెదబయలులో ఇద్దరు మృతి
● క్షయతో ఒకరు, రక్తహీనతతో మరొకరు మృతి ● ఆందోళనలో గ్రామస్తులు పెదబయలు: పెదబయలు పీహెచ్సీ పరిధిలోని పెదబయలు గ్రామంలో బుధవారం క్షయ వ్యాధితో ఒకరు, రక్తహీనతతో ఓ మహిళ మృతి చెందారు.పెదబయలు అటవీ శాఖ కార్యాలయం సమీపంలోని వీధిలో నివాసం ఉంటున్న దడియా నాగేశ్వరరావు (30) క్షయ వ్యాధితో బుధవారం మృతి చెందారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన మఠం లక్ష్మీ(31) రక్తహీనతతో బాధపడుతూ పాడేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దడియా నాగేశ్వరరావు అక్క దడియా లలిత (35) గత ఏడాది టీబి వ్యాధితో మృతి చెందింది. గ్రామంలోని టీబీతో ఏడాదిలోనే ఇద్దరు మృతి చెండడంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. మండలంలోని 23 గ్రామ పంచాయతీ పరిధిలో క్షయ రోగులు 36 మంది ఉండగా పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ పరిధిలో పది మంది ఉన్నారు. రోగుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ కొరవడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షయ రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకొని వ్యాధి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ మాట్లాడుతూ దడియా నాగేశ్వరరావు క్షయకు సంబంధించిన మందులు వాడుతున్నారని, తరచూ మద్యం సేవించడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్టు తెలిపారు. -
ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు
● టెన్త్, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటాలి ● ఎస్ఎస్ఏ ఏపీసీ స్వామినాయుడుకొయ్యూరు: ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త(ఏపీసీ) స్వామినాయుడు తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. టెన్త్, ఇంటర్ విద్యార్థినులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. త్వరలో జరిగే పరీక్షల్లో సత్తా చాటాలన్నారు. పరీక్షలు ఎలా రాయాలో అవగాహన కల్పించారు. అనంతరం మెనూపై ఆరా తీశారు. ఎస్వో పరిమళ, ఎంఈవో రాంబాబు పాల్గొన్నారు జ్ఞానజ్యోతి శిక్షణ పరిశీలన పూర్వ ప్రాథమిక విద్య బలోపేతంపై అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వోన్నత పాఠశాలలో ఇస్తున్న జ్ఞానజ్యోతి శిక్షణకు ఆయన పరిశీలించారు.బోధన ఎలా చేయాలో వివరించారు. సీడీపీవో విజయకుమారి పాల్గొన్నారు గంగవరం(అడ్డతీగల): మండలం కొత్తాడ కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని బుధవారం సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థినులకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణపై ఆరా తీశారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని విద్యార్థినులకు సూచించారు.8 వ తరగతి విద్యార్థినులకు పాల్ ల్యాబ్‌లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ఎంఈవో మల్లేశ్వరరావు,ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడీ వర్కర్ల జ్ఞానజ్యోతి శిక్షణ ఏపీసీ స్వామినాయుడు పరిశీలించారు. -
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ
అరకులోయ టౌన్: అల్లూరి జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, సమష్టిగా పనిచేసి ప్రజావ్యతిరేక కూటమి ప్రభుత్యానికి బుద్ధి చెప్పాలని అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. అరకులోయలోని ఎంపీ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకుని అడాగాలని టీడీపీ నాయకుడు నారా లోకేష్ చెప్పారాని.. అయితే కాలర్ పట్టుకుని అడుగుదామంటే టీడీపీ నాయకలు ఎవ్వరూ కనబడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటి కూడా అమలుచేయలేదని, సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను అమలుచేయకుండా గాలికొదిలేశారన్నారు. ఈ తొమ్మిది నెలల్లో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీగా రుజువైందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కాలర్ పట్టుకునే పరిస్థితి త్వరలో వస్తుందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల అభివృద్ధికి అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని అటువంటిది నేడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మన్యంలో ఒక్క అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, జిల్లా యువజన అధ్యక్షుడు ఎల్.బి.కిరణ్, అరకులోయ, డుంబ్రిగుడ వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్‌రావు, రామన్న, ఎంపీటీసీ సభ్యుడు బి.రామరావు, సర్పంచ్‌లు గుమ్మ నాగేశ్వరరావు, వెంకటరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సీహెచ్. మల్లేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీరాములు, నాయకుడు రంజిత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ -
పసర మందులు వాడొద్దు
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా ● సరియాపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం ● 52మందికి వైద్య సేవలు ● నలుగురు చిన్నారులు ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలింపు ముంచంగిపుట్టు: పసర మందులు వాడడం వల్ల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని, వాటికి దూరంగా ఉండాలని వైద్య సిబ్బంది ఇచ్చే మందులు మాత్రమే వాడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా గిరిజనులకు సూచించారు. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సరియాపల్లిలో వాంతులు,విరోచనాలు,పుండ్లతో గిరిజనులు అస్వస్థతకు గురైనట్టు పత్రికల్లో వార్తలు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.బుధవారం కిలగాడ వైద్యాధికారులు రమేష్,శిరీష,వైద్య సిబ్బంది సరియాపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాంతులు,విరోచనాలు,జలుబు,దగ్గు,జ్వరాలు,చర్మ వ్యాధులతో బాధపడుతున్న 52 మందికి వైద్య సేవలు అందించారు.18 మంది జ్వర బాధితులకు రక్తపరీక్షలు చేయగా సాధారణ జ్వరాలుగా తేలింది. సరియాపల్లిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జమాల్ బాషా పర్యటించి, అనారోగ్యాలకు గల కారణాలపై గిరిజనులతో మాట్లాడి ఆరా తీశారు. కొంత మంది గతంలో ఇచ్చిన మందులు వాడలేదని వైద్య సిబ్బంది జమాల్ బాషా దృష్టికి తీసుకువచ్చారు.దీంతో గిరిజనులతో ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఇచ్చే మందులు తప్పనిసరిగా వాడాలని,అప్పుడే వ్యాధులు తగ్గుతాయని,నాటు మందులు,పసర మందులు వాడితే వికటించే ప్రమాదం ఉందని చెప్పారు. గ్రామస్తులు తాగుతున్న నీటి శాంపిల్స్‌ను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సేకరించారు. కోర్రా విక్రత్,కోర్రా వసంత్,కోర్రా హర్షింత్,గోల్లోరి వినయ్ అనే నలుగురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు.మరో రెండు రోజుల పాటు సరియాపల్లిలో వైద్య శిబిరం కొనసాగుతుందని కిలగాడ వైద్యాధికారి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి,మండల వైఎస్సార్సీపీ నేతలు మోహన్,జగన్నాథం,ఆరోగ్య విస్తరణ అధికారి సుబ్రహ్మణ్యం,కిలగాడ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటలాడుతూ క్రీడాకారుడికి గాయాలు
గూడెంకొత్తవీధి(సీలేరు): వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడడంతో గిరిజన యువకుడు గాయపడిన ఘటన మండలంలోని దారకొండ పంచాయతీ చినగంగవరంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చినగంగవరం గ్రామానికి చెందిన కొర్రా ఆనందరావు బుధవారం గ్రామంలో వాలీబాల్ ఆడుతుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతని కుడి చేయి దెబ్బతింది. సహచర క్రీడాకారులు హుటాహుటిన అతన్ని దారకొండ పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి హిమబిందు ప్రాథమిక వైద్యం అందించారు. భుజం వద్ద జాయింట్ బాల్ పక్కకు జరిగినట్టు గుర్తించి అతన్ని మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. -
నిర్వాసితులను కాలనీలకు తరలించాలి
కలెక్టర్ దినేష్ కుమార్ కూనవరం: పోలవరం నిర్వాసితులను ఆగస్టులోపు వారి కోసం నిర్మించిన కాలనీలకు తరలించాలని కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. భైరవపట్నంలో వీఆర్‌పురం మండలం జీడిగుప్ప గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఎన్ని కుటుంబాలకు ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టారు, ఎన్ని ఇళ్లు పూర్తి చేశారు తదితర వివరాలను ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 159 ఇళ్లకు గాను 75 ఇళ్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. పూర్తయిన 75 ఇళ్లలోకి రావడానికి అభ్యంతరాలు ఏమిటని నిర్వాసితులను కలెక్టర్ ప్రశ్నించగా విద్యుత్ సౌకర్యం లేదని, తాగునీటి సమస్య ఉందని, బాత్రూమ్లు, అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, రోడ్లు, డ్రైనేజీలు తదితర సౌకర్యాలు లేవని చెప్పారు. రెండు నెలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్‌లను కలెక్టర్ ఆదేశించారు. జీడిగుప్ప గ్రామానికి చెందిన 17 మంది రైతులకు ట్రైకార్ సంస్థ ద్వారా ఇసునూరులో సాగుభూమి ఇచ్చారు. ఆ భూమి పోలవరం ముంపులో పోతోంది. దానికి భూమికి బదులు భూమి ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. ఈవిషయంపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి ఇచ్చిన భూమికి కూడా నష్ట పరిహారం వస్తుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రంలో సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర రెడ్డి, ఐటీడీఏ ఈఈ మురళి, సెరీకల్చర్ అధికారులు, తహసీల్దార్లు శ్రీనివాసరావు, సరస్వతి, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, ఎఫ్ఆర్వో కరుణాకర్, ఎస్ఐ లతాశ్రీ తదితరులు పాల్గొన్నారు. దసలి పట్టు రైతుల ఆదాయం పెంపుపై దృష్టి కూనవరం: దసలి పట్టు రైతుల ఆదాయం పెంపుపై దృష్టి పెడతామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పైదిగూడెంలో దసలి పట్టు రైతుల సిల్క్‌దారం ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సిల్క్‌దారం తయారీ ద్వారా ఎంత మేర ఆదాయం వస్తుందని సెరీకల్చర్ అధికారులను అడిగారు. ఏడాదికి మూడు పంటలకు అవకాశం ఉందని, తద్వారా పట్టు రైతులకు సుమారు రూ. 35 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుందని సెరీకల్చర్ జిల్లా అధికారి కె.అప్పారావు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడి, వారి సమస్యలు తెలసుకున్నారు. ప్రకృతి అనుకూలిస్తే ఆదాయం బాగుంటుందని, ప్రతికూల పరిస్థితుల్లో పూట గడవడం కష్టంగా ఉంటోందని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఆదాయ మార్గం చూపాలని రైతులు కోరారు. ఈకార్యక్రమంలో సబ్‌కలెక్టర్ కల్పశ్రీ, సెరీకల్చర్ ఏడీ పాల్‌రాజ్, ఏఎస్వో వెంకట హరికృష్ణ, ఐటీడీఏ ఈఈ మురళి, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంఅజనేయ ప్రసాద్, ఏఎస్‌డీఎస్ డైరెక్ట్ వి.గాంధీబాబు, ఎఫ్ఆర్ఓ కరుణాకర్, ఎస్ఐ లతశ్రీ పాల్గొన్నారు. సమస్యలపై కలెక్టర్‌కు వినతి వి.ఆర్.పురం: శ్రీరామగిరి పంచాయతీ పరిధిలోని పోలవరం నిర్వాసిత నాలుగు గ్రామల ప్రజల సమస్యలపై సర్పంచ్ పులి సంతోష్ కుమార్, ఉప సర్పంచ్ గుండెపూడి లక్ష్మణరావు తదితరులు చింతూరు పర్యటనకు వచ్చిన కలెక్టర్ దినేష్‌కుమార్‌ని బుధవారం కలిసి సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ 41.15 కాంటూరు పరిధిలో ముంపునకు గురైయ్యే నాలుగు గ్రామల ప్రజలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, గిరిజనులు సాగుచేస్తున్న డీ–ఫారం పట్టా భూములకు నష్ట పరిహారం, స్థలాలు ఇవ్వాలని కోరారు. మేజర్లకు పునరావాసం కల్పించాలన్నారు.బీసీ కాలనీలో లాడర్ రీసర్వే చేయాలని స్థానికులు కోరారు. కాలనీ అన్ని కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని, గతంలో చేపట్టిన సర్వేలో తప్పులున్నాయని, రీసర్వే చేసి, తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకులంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విష్టుమూర్తి, వెంకన్నబాబు, కృపారావు, నాగేశ్వరరావు, శ్రీనివాసు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
వాహనం బోల్తా– ఒకరికి గాయాలు
పెదబయలు: మండలంలోని సీకరి పంచాయతీ లబ్జిరి గ్రామ సమీపంలో బుధవారం ఐస్‌క్రీం వాహనం బోల్తా పడిన ఘటనలో పెదబయలు గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన వ్యాపారి బి.చంద్రశేఖర్ ఐస్‌క్రీం వాహనంలో లబ్జిరి గ్రామం నుంచి పెదబయలు వస్తుండగా, అదుపు తప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐస్‌క్రీం ఫ్రీజర్ చంద్రశేఖర్‌పై పడడంతో తలకు బలమైన గాయంతో ఎడమచేయి విరిగింది. స్థానికులు స్పందించి ఆయనను హుటాహుటిన ఆటోలో పెదబయులు పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి నిఖిల్ ప్రాథమికి చికిత్స చేశారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రికి 108లో తరలించారు. -
రోడ్డు ప్రమాదంలోయువకుడి మృతి
రోడ్డు ప్రమాదం కాదు హత్యని మృతుడి తండ్రి ఫిర్యాదు హుకుంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–హుకుంపేట ప్రధాన రహదారిలో పాటిమామిడి గ్రామం సమీపంలో ద్విచక్రవాహనంపై పాడేరు నుంచి వస్తు డివైడర్‌ను ఢీకొని పాడి శ్రీకాంత్(28) సంఘటన స్థలంలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో డివైడర్‌ను ఢీకొనగా వాహనం అతనిపై పడినట్టు పేర్కొన్నారు. దీనిపై మృతుడు తండ్రి పాడి చంటిబాబు తన కుమారుడు ప్రమాదంలో మృతి చెంది ఉండరని హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేపట్టి యువకుడి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్టు ఎస్ఐ సురేష్‌కుమార్ తెలిపారు.