Taxonomy term | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

  • VHP Secretary Surendra Jain about Chandrababu Comments on Tirumala Laddu

    అక్కడుంది చంద్రబాబు.. SIT ఏర్పాటుపై వీహెచ్‌పీ సురేంద్ర జైన్‌ ఆగ్రహం

    సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్‌ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్‌ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్‌ చేశారు.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్‌ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్‌పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్‌ హెచ్చరించారు. సిట్‌లో చంద్రబాబు మనిషితిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌ చీఫ్‌గా నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.
  • YSRCP MLA Buchepalli Siva Prasad Reddy House Arrest At Darsi

    టీడీపీ బంటుల్లా పేట్రేగిపోతున్న పోలీసులు

    సాక్షి, ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దర్శిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. దీంతో, దర్శి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి వారి అరెస్ట్‌కు నిరసగా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శిలో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్ట్‌లు చేస్తున్నారు. దర్శి ఎస్‌ఐ మురళీని తక్షణమే తొలగించాలి. దర్శి స్టేషన్‌ని టీడీపీ పీఎస్‌గా ఎస్‌ఐ మురళీ మార్చుకున్నారు. బొట్లపాలెంలో నా వాహనంపై దాడి చేసిన వారిని వదిలేసి.. అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంజిరెడ్డి మీద 307 కేసు పెట్టి అరెస్ట్ చేశారు. స్టేషన్‌లో అంజిరెడ్డిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.దర్శి ఎస్‌ఐని తొలగించాలని డీజీపీని కలుస్తాను. నాకు ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదు. నా హక్కులు కాపాడుకోవడం కోసం స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాను. శాంతియుతంగా నిరసన చేయాలనుకుంటే పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.అయితే, కొద్దిరోజులుగా దర్శి నియోజకవర్గంలో పచ్చ బ్యాచ్ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ వాహనంపై టీడీపీ కార్యకర్త దాడి చేశాడు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంజిరెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన వారిపై కాకుండా అడ్డుకోబోయిన అంజిరెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వారిని అరెస్ట్‌ చేశారు.దీంతో, పోలీసు వైఖరికి నిరసనగా బూచేపల్లి ధర్నాకు పిలుపునిచ్చారు. అనంతరం, దర్శి వీధుల్లో వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ధర్నాకు అనుమతి లేదంటూ శివప్రసాద్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తర్వాత వారిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇది కూడా చదవండి: వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది?: బొత్స
Advertisement