Adilabad
-
అదృశ్యమైన మహిళ హత్య
మోర్తాడ్: నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాము బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌కు చెందిన కొండ లక్ష్మి(45) గ్రామంలో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమార్తె అనూష ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన కొంచపు వెంకటేశ్ లక్ష్మిని నమ్మించి తనవద్దకు పిలిపించుకొని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నెల రోజుల క్రితమే ఆమెను పొన్కల్ అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు. పోలీసుల అదుపులో గంజాయి నిందితులు ? మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని తిలక్‌నగర్‌లో మూడురోజుల క్రితం 25 కిలోల గంజాయితోపాటు సుమారు 9 మంది నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కొందరిని తప్పించేందుకు రాజకీయ నాయకుల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిందితులను కేసు నుంచి తప్పించేందుకు తల్లిదండ్రులు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఓ నాయకుడితో బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావును వివరణ కోరగా గంజాయి నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పటుకున్నది వాస్తవమేనని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
గల్ఫ్‌లో జిల్లావాసి బలవన్మరణం
● మృతదేహం తెప్పించాలని కుటుంబీకుల వినతి ● ప్రవాసీమిత్ర సంఘం అధ్యక్షుడిని కలిసి వేడుకోలునిర్మల్ఖిల్లా: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన కార్మికుడు అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన షేక్ ఆన్సర్ (34) ఉపాధి నిమిత్తం ఆరేళ్ల క్రితం సౌదీ ఆ తర్వాత దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం దుబాయ్‌లోని పూజైరాదిబ్బ మున్సిపాలిటీలో కార్మికుడిగా పనిచేసేవాడు. గతేడాది సెలవుపై స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. ఈనెల 16న దుబాయ్‌లో నివాసముంటున్న ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడి కంపెనీ ఈ విషయాన్ని తాజాగా కుటుంబీకులకు సమాచారం అందించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బుధవారం మృతుడి కుటుంబ సభ్యులతోపాటు కాంగ్రెస్ నాయకులు ఏనుగు ముత్యంరెడ్డి, కొర్వ నవీన్, సతీశ్ తదితరులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రవా సీమిత్ర కార్మిక సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్లను కలిశారు. మృతదేహాన్ని స్వస్థలానికి తెప్పించాలని విన్నవించారు. గల్ఫ్‌కార్మిక సంఘానికి చెందిన అక్కడి ప్రతినిధులతో మాట్లాడి దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా ఆన్సర్ వివరాలను పంపించారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడుతోపాటు తల్లిదండ్రులు ఉన్నారు. -
వుషూ క్రీడాభివృద్ధికి కృషి
ఆదిలాబాద్: రాష్ట్రంలో వుషూ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి వుషూ మహిళల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వుషూ క్రీడకు రోజురోజుకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రతీ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రభుత్వాలు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను కేటాయించాయన్నారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం వుషూ విభాగంలో స్పోర్ట్స్‌కోటా కింద పోస్టల్ శాఖలో ఉద్యోగం రాగా, ప్రస్తుతం ఎస్ఎస్బీలో ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న జిల్లాకు చెందిన రాథోడ్ స్వాతిని సత్కరించారు. కార్యక్రమంలో ఉషూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఉమర్, పెటా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పార్థసారథి, సాయి, వుషూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గణేశ్, వేముల సతీశ్, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అన్నారపు వీరేశ్, జిల్లాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్ ఉత్సాహంగా రాష్ట్రస్థాయి వుషూ క్రీడాపోటీలు -
‘ఇంటిగ్రేటెడ్’ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి కృష్ణ ఆదిత్య ● నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమావేశంకైలాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు గురువారంలోపు స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకాధికారి, ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో నాలుగు జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా రానున్న రెండేళ్లలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించి నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో వాటి ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేయాలన్నారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణ శివారు నిషాన్‌ఘాట్‌లో గల సర్వేనంబర్ 38లో 20 ఎకరాల స్థలాన్ని కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. అన్ని హంగులతో పాఠశాల, వసతి గృహ సముదాయం నిర్మించనున్నట్లు తెలిపారు. గడువులోపు పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ఆయనకు ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కు మురంభీం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలపై సమీక్ష ముందుగా ఇంటర్మీడియెట్ విద్యాశాఖపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చాంబర్లో కృష్ణ ఆదిత్య సమీక్ష నిర్వహించారు. ప్రాక్టికల్, వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో రవీందర్‌కుమార్‌ను ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలో హాజరు శాతం, స్లిప్ టెస్టులు, విద్యార్థుల ప్రవేశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలి వేసవిలో మారుమూల ప్రాంతాలు, మున్సిపాలిటీలో తాగునీరు, విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని కృష్ణఆదిత్య అన్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇందుకోసం అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బోరుబావుల ఫ్లషింగ్, నీటి వనరుల మరమ్మతు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. -
సరిహద్దుల్లో నిఘా
● ప్రత్యేక చెక్‌పోస్టులు..తనిఖీలు ● అమల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ● రూ.50 వేలకు మించితే ఆధారాలు తప్పనిసరి నిర్మల్‌ఖిల్లా: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్–నిజామాబాద్–కరీంనగర్–మెదక్ జిల్లాల పరిధిలో ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈనెల 27న జరిగే పోలింగ్‌కు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నగదు వ్యవహారాలు, తాయిలాలపై ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. నిర్మల్ జిల్లాకు ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దు ఉండడంతో ఆయా ప్రాంతాల్లో నిఘాతోపాటు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే తగిన ఆధారాలు, రశీదులు చూపాలని లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగదుతోపాటు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే రశీదులు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వివాహ వేడుకల సీజన్లో వధూవరుల కుటుంబీకులు వస్త్రాలు, బంగారం, తదితర వస్తువులు కొనేందుకు నగదుతో వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక చెక్‌పోస్టులు నిర్మల్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు సారంగాపూర్, తానూరు, కుభీర్ తది తర మండలాలతో అనుసంధానంగా ఉన్నా యి. ఆయా ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ము మ్మరం చేశారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలు, బైక్‌లు వివిధ అవసరాల రీత్యా రాకపోకలు సాగిస్తుంటాయి. బాసర మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో బాసర–ధర్మాబాద్ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో వారం క్రితం వాహనాల తనిఖీ చేపట్టారు. ధర్మాబాద్ నుంచి బిద్రెల్లి వైపు వస్తున్న కుంటాల మండలానికి చెందిన వ్యక్తి కారులో రూ. 2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో కేసు నమోదు చేశారు. పది రోజుల క్రితం మహారాష్ట్రలోని బోకర్ నుంచి నిర్మల్‌కు వస్తున్న ఓ వాహనాన్ని తానూరు మండలం బెల్‌తరోడా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. అందులో రూ.3 లక్షలకు పైగా నగదును గుర్తించారు. సరైన పత్రాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. -
‘గురువుల’ప్రాధాన్యత ఎవరో!
● బరిలో మొత్తం 15మంది అభ్యర్థులు ● ఉపాధ్యాయ సమస్యలే ప్రచార అస్త్రాలు ● ఆసక్తికరంగా టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా సాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ స్థానానికి 15మంది బరిలో ఉన్నారు. 27,088మంది ఓటర్లు ఉన్నారు. ముగ్గురు రాజకీయ పార్టీల నుంచి పోటీలో ఉండగా, మరో 12మంది ఆయా సంఘాల మద్దతుతో బరిలోకి దిగారు. ఎగువ సభకు ఎన్నికల్లో మేధావి వర్గంగా చెప్పుకునే విద్యావంతులైన టీచర్ల ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుందంటారు. అభ్యర్థి, పార్టీ, సంఘం ఏదైనా తమ విచక్షణతోనే ఓటు వేస్తూ వైవిధ్యతను చూపిస్తుంటారు. గతంలో పలుమార్లు అంచనాలకు అందకుండా తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలో టీచర్లు వేసే మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్ల క్రమంలో ఎటువైపు మొగ్గు ఉన్నా ఫలితాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరి గెలుపు ఉంటుందనేది సర్వత్రా చర్చ సాగుతోంది. సమస్యలే ప్రచారాస్త్రాలు ఉపాధ్యాయులను ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న సమస్యలు అనేకంగా ఉన్నాయి. ప్రతీసారి ఆయా సమస్యలే ఎన్నికల్లో ఎజెండాగా మారుతున్నాయి. తాజా ఎన్నికల్లోనూ అవే ప్రచారాస్త్రాలుగా మారాయి. ప్రధానంగా సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం), ఏకీకృత సర్వీస్ రూల్, 317జీవో, 2002 ఉపాధ్యాయుల సమస్యలు, డీఏల పెండింగ్, టీచర్ల పదోన్నతులు తదితరవన్నీ పేరుకుపోయాయి. ఎమ్మెల్సీగా గెలిచాక సమస్యలు మర్చిపోతున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీల నుంచి పరిశీలిస్తే ఈసారి బీజేపీ నుంచి వ్యాపారవేత్త మల్క కొమురయ్య పోటీలో ఉన్నారు. ఆయన గెలుపు కోసం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆ బాధ్యతను తమ భుజాలకెత్తుకున్నారు. బీజేపీ ప్రభుత్వం టీచర్లను ఇబ్బంది పెడుతున్న సీపీఎస్‌ను తీసుకొచ్చిందనే కారణంతో పార్టీ అభ్యర్థికి ఏ మేరకు ఓట్లు పడుతాయనేది తేలాల్సి ఉంది. ఆయన యజమానిగా ఉన్న మంచిర్యాలలోని శాలివాహన ప్లాంటు మూసివేత, కార్మికుల సమ్మె ప్రభావం ఉండనుంది. టీఎస్సీపీఎస్ఈయూ నుంచి ఇన్నారెడ్డి సీపీఎస్ రద్దు ఏకై క లక్ష్యంగా సాగుతున్న టీఎస్‌సీపీఎస్‌ఈ యూనియన్ బలపర్చిన అభ్యర్థిగా తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి బరిలో ఉన్నారు. గతంలో పీఆర్టీయూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే తన బలంగా చెబుతుంటారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్ల స్థానానికి అధికారికంగా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదు. తెరవెనక మాత్రం ఓ అభ్యర్థికి మద్దతు ఉందని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇక తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న, దళిత బహుజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మీతోపాటు అశోక్‌కుమార్, వై.కంటె సాయన్న, చలిక చంద్రశేఖర్, జగ్గు మల్లారెడ్డి, మామిడి సుధాకర్‌రెడ్డి, ముత్తరాం నర్సింహాస్వామి, విక్రమ్‌రెడ్డి, శ్రీకాంత్, సుహాసిని మొత్తం 15మంది ఉన్నారు. ఇంటింటికి అభ్యర్థి ప్రచారం ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో ప్రచారం చేసే అవకాశం లేకపోవడంతో నేరుగా టీచర్ల ఇంటికే వెళ్తున్నారు. మార్నింగ్ వాకింగ్, సంఘ కార్యాలయాలు, సెలవు దినాలు, నిర్ణీత వేళల్లోనే టీచర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సోషల్‌మీడియా, ఫోన్ కాల్స్‌తోనూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
గొర్రెలు ఎత్తుకెళ్లిన నలుగురి అరెస్టు
భీమిని: కన్నెపల్లి మండలం జన్కాపూర్ శివా రులో గొర్రెలను ఎత్తుకెళ్లిన నలుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం తెలిపారు. పోలీసుస్టేషన్లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలం గొటూరుకు చెందిన పొర్ల నరేశ్..160 గొర్రెలను మేపడానికి ఇటీవల జన్కాపూర్‌కు వచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు 33 గొర్రెలను ఎత్తుకెళ్లారని ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం కన్నెపల్లి సబ్‌స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా బొలెరోలో గొర్రెలను తరలిస్తుండగా డ్రైవర్‌ను అదుపులో తీసుకుని విచారించారు. జన్కాపూర్‌కు చెందిన ప్రశాంత్, సంతోష్, అభిలాష్, సత్తన్న కలిసి గొర్రెలు విక్రయించారని తెలిపాడు. వాహనాన్ని సీజ్ చేసి, నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఆకాశవాణి కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రాన్ని ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇంజనీరింగ్) బానోత్ హరిసింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రోతలకు నాణ్యమైన ప్రసారాలను అందించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ ఆకాశవాణి ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం పేరును గొప్పగా నిలపాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ కేంద్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును కొనసాగించాలని సూచించారు. ఈ కేంద్రం అభివృద్ధికి తనవంతుగా తోడ్పాటును అందిస్తానన్నారు. అనంతరం జైనథ్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆయ న వెంట ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ శ్రీనివాస్, కేంద్రం ముఖ్య కార్యక్రమ అధికారి రామేశ్వర్ కేంద్రే, వెంకటేశులు, పోతురాజు, శశికాంత్, గిరీశ్‌కుమార్, వెంకటయ్య, విజయ కుమారి తదితరులు ఉన్నారు. -
‘రియల్’ స్కెచ్!
● అనధికార లేఅవుట్ల క్లియరెన్స్‌కు ప్లాన్ ● ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం ● పెద్ద ఆఫీసర్‌తో రియల్టర్ల ఒప్పందం? ● త్వరలో ప్రణాళిక అమలులోకి.. సాక్షి,ఆదిలాబాద్: మావలలోని సర్వే నం.181లో గల ఓ లేఅవుట్‌కు డీటీసీపీ అనుమతి లేదు. దీంతో ఇందులోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొంత కాలంగా నిలి చిపోయాయి. దళారులు మాత్రం ప్లాట్లను ఒకరి నుంచి మరొకరికి విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్ర క్రియ ముందుకు సాగని పరిస్థితి. ఈ క్రమంలో క్ర య విక్రయదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. మ రోవైపు మార్కెట్లో రియల్ వ్యాపారం మందగించింది. ఈ పరిస్థితుల్లో సదరు రియల్టర్ ఓఎత్తుగడ వేశా డు. సంబంధిత అధికారులతో మంతనాలు జరి పాడు. ఆ ప్లాట్లను క్లియర్ చేసేందుకు వారికి పెద్ద ఆఫర్ ఎర వేశాడు. అది ఫలించింది. బేరసారాలు కొలిక్కి వచ్చాయి. ఇక అమలుపర్చడమే తరువా యి. ఇది కేవలం మావలలోని ఈ ఒక్క సర్వే నంబ ర్కే పరిమితం కాదు. ఆదిలాబాద్ చుట్టుపక్కల మా వల, బట్టిసావర్గాం, ఖానాపూర్, చాందలోని వందలాది అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. త్వరలో ఈ ప్లాన్‌ను అమలు చేసేందుకు రియల్టర్లు, పెద్దసారు కలిసి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ప్రణాళిక ఇలా.. ప్రస్తుతం రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతు న్న వారు కొద్దిరోజుల పాటు సెలవులో వెళ్తారు. ఇప్పటికే ఒక సబ్‌రిజిస్ట్రార్ సెలవులో ఉండగా.. మరో సబ్ రిజిస్ట్రార్ కూడా లీవ్‌లో వెళ్తాడు. ఆ తర్వాత ఒక దిగువశ్రేణి ఉద్యోగిని తీసుకొచ్చి కొద్దిరోజుల పాటు ఇన్చార్జిగా కూర్చోబెడుతారు. ఆయన ఆధ్వర్యంలో అనధికారిక లేఅవుట్లలోనిప్లాట్ల రిజిస్ట్రేషన్లు చకచకా సాగేలా ప్లాన్ వేశారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో.. ప్రభుత్వం గతంలో జీవో నం.257 జారీ చేసింది. ఆ ప్రకారం అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయరాదు. డీటీసీపీ, ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ల కు మాత్రమే ఏడాదిగా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని ఎస్ఆర్వో కార్యాలయానికి వెళ్లినప్పుడు సబ్‌రిజి స్ట్రార్లు పేర్కొంటున్నారు. లేనిపక్షంలో ఆ ప్లాట్ రిజి స్ట్రేషన్ అయి ఉండి లింక్ డాక్యుమెంట్ కలిగి ఉంటే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే లింక్ డాక్యుమెంట్ లేకపోవడం, ఇటు లేఅవుట్లకు డీటీసీపీ అనుమతి రాకపోవడం, ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ లేకపోవడంతో ఆదిలాబాద్ చుట్టుపక్కల్లోని అనేక వెంచర్లలో ఇలాంటి వందలాది ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా నిలిచిపోయాయి. దీంతో సహజంగానే రియల్ వ్యాపారం ఆదిలా బాద్‌లో స్తబ్ధుగా మారింది. కోట్ల రూపాయల డీల్..? ఈ పరిస్థితిలో రియల్టర్లు ఆ పెండింగ్ ప్లాట్లను క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తుగడ వేశారు. అందులో భాగంగా రిజిస్ట్రేషన్‌శాఖ అధికారుల్లో ఓ పెద్ద సారుతో బేరసారాలు నడిపారని ఆదిలాబాద్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ ప్లాట్లన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసిన పక్షంలో ఆయనకు రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకు ఇచ్చేలా డీల్ కుదిరిందని చెప్పుకుంటున్నారు. దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటా.. ఆదిలాబాద్ ఎస్ఆర్వో పరిధిలో అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు ఒక్కటి జరిగినా నా దృష్టికి తీసుకురండి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటా. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ విజయ్‌కాంత్ రావు సెలవులో వెళ్లారు. దీంతో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్నారు. రియల్టర్లతో ప్లాన్ విషయం నా నోటీసుకు రాలేదు. – రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, ఆదిలాబాద్ -
8న జాతీయ లోక్‌అదాలత్
కై లాస్‌నగర్: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం మార్చి 8న జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు అన్నారు. జిల్లా కోర్టులోని తన చాంబర్లో బుధవారం ని ర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. సివిల్, బ్యాంకు, ఇన్సూరెన్స్ కేసులతో పాటు రాజీపడదగిన ఇతరత్రా అన్ని కేసులను ఇందులో పరి ష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా కో ర్టుల చుట్టూ తిరిగే అవకాశముండదని, అ లాగే సమయం వృథా కాదన్నారు. ఉద యం 10 నుంచి సాయంత్రం 5గంటల వర కు ఆయా కోర్టుల్లో నిర్వహించే లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకో వా లని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసు లు పరిష్కారం అయ్యేలా పోలీసు అధికారులు,న్యాయవాదులు శ్రద్ధవహించాలన్నారు. ఇందులో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య తదితరులున్నారు. -
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిపోతిరెడ్డి శివారెడ్డి ఖోఖో ప్ర పంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించడం గర్వకారణ మని పలువురు పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో గెలుపొందిన అనంతరం ఆయన బుధవా రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేర కు పట్టణంలోని వినాయక చౌక్‌లో పోస్టల్ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. అక్క డి నుంచి జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ కా ర్యాలయం వరకు స్వాగతించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ సిద్ధార్థ ఆయనను సత్కరించి మెడల్ అందించారు. ఈసందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ తాను వరల్డ్ కప్‌లో రాణించేందుకు శాఖ అధికారుల సహకారం ఎంతో ఉందన్నారు. ఇందులో పోస్ట్‌మాస్టర్ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం కనిపిస్తుంది. డ్రాపౌట్స్ ఎక్కువే.. విద్యారంగంలో ఇప్పటికీ చాలామందికి విద్య అందని ద్రాక్షగానే మారుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సరైన సౌకర్యాలు లేక నమోదు క్రమంగా పడిపోతోంది. అంతేగాక డ్రాపౌట్స్ ఇంకా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉండగా, మంచిర్యాలలో తక్కువగా ఉంది. విద్యార్థులకు టీచర్ల నిష్పత్తి తక్కువగా ఉంది. నిబంధనల ప్రకారం 1నుంచి 5వరకు ప్రతీ 30మంది విద్యార్థులకు ఒక టీచరు, 6నుంచి 8వరకు 35మందికి ఒక టీచరు ఉండాలి. కానీ అంతకంటే తక్కువగా ఉన్న విద్యార్థుల కంటే టీచర్ల సంఖ్య అధికంగా ఉంది. ● ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయ సంఘాలు, సభ్యుల సంఖ్య పెరుగుతోంది. రుణ పరిమితి పెరుగుతూ క్రమంగా వృద్ధి కనిపిస్తోంది. ● వాహన రిజిస్ట్రేషన్లు పెరగడంతోపాటు ఇటీవల విద్యుత్ వాహనాలకొనుగోళ్లు పెరుగుతున్నాయి. ● మాతాశిశు సంరక్షణలో ఇంకా పోషకాహార లోపంతో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇప్పటికీ ఆయా కేంద్రాల్లో నమోదైన వారికి పూర్తి స్థాయిలో పోషకాహరం అందడం లేదు. అంగన్వాడీ కేంద్రాలు, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నా ఇంకా వంద శాతం పోషకాహార రహితంగా మార్చేందుకు ఇంకెంత కా లం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ● ఉమ్మడి జిల్లాలో క్రమంగా జాతీయ రహదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికే ఎన్‌హెచ్–44, 64, 363తోపాటు కొత్తగా పలు రోడ్లు అప్‌గ్రేడ్ కావడంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతోంది. డ్రాపౌట్ రేట్(శాతం) జిల్లా ప్రైమరీ అప్పర్ హైస్కూల్ ప్రైమరీఆదిలాబాద్ 1.29 4.97 16.54 ఆసిఫాబాద్ 1.80 7.39 16.39 మంచిర్యాల –0.14 2.60 20.39 నిర్మల్ 2.69 2.59 17.72విద్యార్థులు, టీచర్ల నిష్పత్తిజిల్లా ప్రైమరీ అప్పర్ హైస్కూల్ హయ్యర్ ప్రైమరీ సెకండరీ స్కూల్ఆదిలాబాద్ 18 16 21 17 ఆసిఫాబాద్ 17 17 22 17 మంచిర్యాల 16 13 18 17 నిర్మల్ 18 15 18 17 -
అప్పుడే.. నీళ్ల గోస
బిందెడు నీళ్ల కోసం.. బిందెడు నీళ్ల కోసం బోరింగ్ వద్ద గంటల కొద్ది పడిగాపులు తప్పడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు పదినిమిషాల కన్న ఎక్కువ వస్తలేవు. బోరింగ్‌లో నుంచి కూడా గంటకు పది బిందెల నీళ్లు రావట్లేదు. దీంతో పనులు విడిచి పెట్టుకొని నీళ్ల కోసం ఇంటికాడనే ఉండాల్సి వస్తుంది. – కొడప రుక్మాబాయి, మాన్కపూర్ ఎలాంటి సమస్య లేదు జిల్లాకు నిత్యం 84 ఎంఎల్డీ నీరు అవసరం ఉండగా ప్రస్తతం పూర్తిస్థాయిలో సరఫరా అవుతోంది. ఇప్పటికై తే ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోలేదు. పైపులైన్లు పగిలిపోవడం, లీకేజీల కారణంగా ఎక్కడైనా సమస్య తలెత్తితే చక్కదిద్దాల్సిన బాధ్యత పంచాయతీలకు అప్పగించాం. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. – గోపిచంద్, వాటర్‌గ్రిడ్ , ఈఈ ఊరు చివరన ఉన్న బోరుబావి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్తులు జిల్లాలో వేసవి ఆరంభానికి ముందే ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇంకా అనేక గ్రామాలకు పైపులైన్లు లేకపోవడం, చా లా చోట్ల లికేజీలు, విద్యుత్ మోటార్లు కాలిపోవడంతో పాటు భూగర్భజల మట్టం పడిపోవడం వంటి కారణాలతో భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పలు మండలాల్లోని శివారు గ్రామాల్లోనూ నీటి ఇక్కట్లు షురూ అయ్యాయి. వారికి ఊరికి దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావులు, చేదబావులే దిక్కవుతున్నాయి. చాలాచోట్ల ఎడ్లబండ్లపై డ్రమ్ములతో నీటిని తెచ్చుకుంటున్నారు. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లా కేంద్రంలోని కాలనీలకు ప్రస్తుతం రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నా, ఎండల తీవ్రత పెరిగితే సమస్య తలెత్తే అవకాశముందని తెలుస్తోంది. -
24న సేవాలాల్ జయంతి వేడుకలు
కై లాస్‌నగర్: బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను ఈ నెల 24న పట్టణంలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికా రులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నిబంధనలు అనుసరించి వేడుకలు నిర్వహించాలన్నారు. హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని, విద్యుత్ శాఖ ద్వారా నిరంతర కరెంట్ సరఫరా చేయాలన్నారు. అలాగే మున్సిపల్ ద్వారా రెండు రోజుల ముందు నుంచే శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ శాఖ ద్వారా ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సౌకర్యం, వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంప్, పోలీస్ శాఖ ద్వారా బారికేడ్లు, బందో బస్తు, పార్కింగ్ ప్రాంతాలు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, ఆర్డీవో వినోద్‌కుమార్, బంజారా ఉత్సవ కమిటీ చైర్మన్ భీమ్రావ్, ఐటీడీఏ డీడీ వసంత్‌రావు, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు క్షయ రోగులకు పోషకాహార కిట్లు అందించేందుకు గ్లాండ్ పార్మా అనే కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతో కలిసి డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డా.స్నేహ శుక్లా మంగళవారం కలెక్టర్ రాజర్షి షాను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల చేపట్టిన వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,332 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరికీ ఆరు నెలల పాటు పోషకాహార కిట్లను ఆ కంపెనీ ద్వారా అందించనున్నట్లుగా కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా క్షయ నియంత్రణాధికారి సుమలత తదితరులున్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
పంటల లెక్క.. ఇక పక్కా
● పకడ్బందీగా డిజిటల్ క్రాప్ సర్వే ● క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్న ఏఈవోలు ● నివేదిక ఆధారంగా పంట దిగుబడి కొనుగోళ్లు బోథ్: పంటల లెక్క పక్కాగా తేల్చేందుకే ప్రభుత్వం ఈ నెల 3న డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జిల్లాలోని 101 క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల చేలల్లోకి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా పంటల సాగు వివరాలు పక్కాగా తేలనున్నాయి. వీటి ఆధారంగానే రైతుల పంట దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశశం ఉంటుంది. ఏఈవోలు తమ క్లస్టర్ పరిధి లో 18వందల నుంచి 2వేల ఎకరాల వరకు సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సర్వే ఇలా.. ఈ సర్వే నిర్వహణకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది. ఇందులో భా గంగా ఏఈవోలు రైతుల చేల వద్దకు వెళ్తున్నారు. పంటల సాగు విస్తీర్ణం వివరాలను అందులో నమోదు చేస్తున్నారు. సర్వేనంబర్ ఎంట్రీ చేయగానే ఆ పరిధిలో ఉన్న రైతుల వివరాలు కనిపిస్తాయి. కావాల్సిన రైతు పేరు ఎంచుకోగానే వారి పేరిట ఉన్న భూమి వివరాలు దర్శనమిస్తాయి. అందులో రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో నమోదు చేయాలి. అలాగే సాగు ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ సాగులో లేని భూమి ఉంటే వాటిని నాన్క్రాప్ కింద నమోదు చేస్తున్నారు. పంటల నమోదు ఆధారంగానే కొనుగోళ్లు.. ఈ సర్వేతో రైతులు సాగు చేసే పంటల వివరాలు పక్కాగా తేలనున్నాయి. తదనుగుణంగా వచ్చే దిగుబడిని మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థకు మద్దతు ధరతో విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. పలు చోట్ల ఇబ్బందులు.. సర్వేలో భాగంగా ఏఈవోలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవటంతో యాప్ ఓపెన్ కావడం లేదు. అలాగే పలు చోట్ల సర్వర్ నెమ్మదించటం, మరికొన్ని చోట్ల రైతుల చేలల్లో లొకేషన్ తప్పుగా చూపించడం, సర్వే నంబర్లు కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఏఈవోలు చెబుతున్నారు. సర్వేతో పక్కాగా సాగు లెక్క జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఏఈవోలు రైతుల చేలల్లోకి వెళ్లి పంటల సాగు వివరాలు అక్కడే నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా వ్యాప్తంగా రైతులు ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో లెక్కలు పక్కాగా రానున్నాయి. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాఽయాధికారి -
ముస్లింలను బీసీల్లో చేరిస్తే స్పందించరా?
● కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? ● కేంద్ర మంత్రి బండి సంజయ్ ● మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సాక్షిప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: ‘బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగిన ట్లు కాదా.. కాంగ్రెస్ నేతలు స్పందించరా..? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘రంజాన్‌కు ముస్లిం ఉద్యోగులందరికీ సాయంత్రం 4గంటలలోపే విధులు ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారని.. కాంగ్రెస్‌లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే సమాధానం చెప్పాలి..’అంటూ డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. అంతకు ముందు పట్టణంలో కార్యకర్తలు, నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షు డు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు కే.వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజ య్ మాట్లాడుతూ.. మూడుస్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఏ సర్వే చూసినా స్పష్టం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం రూ.12.75లక్షల ట్యాక్స్ మినహా యింపు, పదేళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులను తెలంగాణకు ఇచ్చిందన్నారు. కేంద్రం నిధులివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బహిరంగ చర్చకు సిద్ధమా..? ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేదన్నారు. సొంత కాలేజీ స్టాఫ్‌ను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. మంచిర్యాలలో దాదాగిరి మంచిర్యాలలో కొందరు దాదాగిరి చేస్తున్నారని, ఆరు నెలల కంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదని కేంద్రమంత్రి సంజయ్ అన్నారు. ప్రభుత్వంలో టాప్ 5లో ఉన్న వాళ్ల దోపిడీ, అవి నీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని, కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. అవినీ తి జరుగుతుందడానికి సీఎం వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. 15శాతం కమీషన్లు ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు అప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ బీసీ కాదని ఆయన కులం గురించి అవాకులు పేలుతున్నారని, రాహు ల్ ఖాన్ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్‌ఖాన్ గాంధీ...అసలు గాంధీ అని పేరు యాడ్ చేసుకుని గాంధీ పరువు తీస్తున్నారని విమర్శించారు. మహా త్మాగాంధీ ఆత్మ బాధపడుతోందని, ఫిరోజ్‌ఖాన్ గాంధీ కొడుకు, మనవడు ఏమైతరు? హిందువులై తే కానే కాదన్నారు. మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాడింది తామే అని, నిరుద్యోగులకు మోచేతికి బెల్లం రాసి నాకిచ్చి నంత పనిచేశారని అన్నారు. 2లక్షలకుపైగా ఖాళీలు ఉన్నాయని, ఓట్లకోసం వచ్చే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని అన్నారు. కోడ్ లేని జిల్లాల్లో వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు దండుకోవడంలో కాంగ్రెసోళ్లు కేసీఆర్‌ను మించి పో యిర్రని తెలిపారు. ఇవన్నీ ప్రశ్నిస్తే హిందూ ముద్రవేస్తున్నారన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసు, ఫార్ములా ఈ రేస్ స్కాం కేసులో ఇదిగో అరెస్ట్...అదిగో అరెస్ట్ అంటూ మీడియాలో వార్తలు రాయించుకుంటూ కాలయాపన చేయడం తప్ప కాంగ్రెస్ సాధించిందేమిటి అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కాంలు ఢిల్లీలో ని కాంగ్రెస్ నేతలకు ఏటీఎంలాగా మారాయని, ఒక్కో స్కాం ఢిల్లీ పెద్దలకు రూ.వెయ్యి కోట్లకుపైగా పైసలు దండుకుంటున్నారని అన్నారు. -
● ఎస్‌హెచ్‌జీలకు విరివిగా సీ్త్రనిధి రుణాలు ● ‘బ్యాంకు లింకేజీ’ కూడా 98 శాతం పూర్తి ● అతివలకు అండగా నిలుస్తున్న మెప్మా ● మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
స్వయం సహాయక సంఘ సభ్యులతో సమావేశం (ఫైల్) పట్టణంలోని సంఘాలు, రుణాల ప్రగతి వివరాలు మొత్తం వార్డులు: 49 జనాభా : 155747 స్వయం సహాయక సంఘాలు: 2,536 అందులోని సభ్యులు: 25,722 మొత్తం రుణలక్ష్యం : రూ.26.36 కోట్లు ఇప్పటి వరకు అందించిన రుణాలు 26.37కోట్లు పకడ్బందీ ప్రణాళికతోనే లక్ష్యసాధన ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే రుణ లక్ష్యాలను సాధించే దిశగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. పట్టణంలోని ప్రతీ వార్డులో ఎస్ఎల్ఎఫ్లతో సమావేశాలు నిర్వహించి బ్యాంకు లింకేజీకి అర్హులైన ఎస్‌హెచ్‌జీల సమాచారం సేకరించాం. ఏదైనా యూనిట్ ఏర్పాటు చేయాలనుకునే వారికి అత్యవసరమైన రుణాలను సీసీఎల్ కింద అందజేశాం. టీజీబీ, యూబీఐ బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రతి నెలలో లాగిన్ డే నిర్వహించి బ్యాంకులిచ్చిన సమాచారం ప్రకారం ఎన్ని ఎస్‌హెచ్‌జీలు రికవరీకి ఉన్నాయి.. రుణాల చెల్లింపు ఎంత పూర్తయిందనే వివరాలు తెలుసుకుని లింకేజీ రుణాలు ఇప్పించాం. వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టాం. ఫలింగానే వందశాతం రుణా లక్ష్యాలను సాధించాం. – శ్రీనివాస్, డీఎంసీ, మెప్మా కై లాస్‌నగర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రధానంగా బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు సీ్త్ర నిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన రుణ లక్ష్యాలను వందశాతం సాధించే దిశగా మెప్మా ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను చైతన్యపరుస్తూ ఇప్పటికే సీ్త్ర నిధి రుణాలను లక్ష్యానికి మించి అందజేశారు. అలాగే బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని 98శాతం సాధించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 40 రోజుల గడువు ఉండటంతో దానిని కూడా త్వరలోనే అధిగమించేలా కృషి చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలిలా.. బ్యాంకు లింకేజీ ద్వారా పట్టణంలోని 330 సంఘాలకు రూ.19కోట్ల 91లక్షల 15వేల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 177 సంఘాలకు గాను రూ.19కోట్ల 67లక్షల 14వేల రుణాలు అందజేశారు.98.79శాతం లక్ష్యాన్ని సాధించగా ఇంకా సమయం ఉన్నందున వీటి ప్రగతి కూడా వందశాతానికి మించి నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే స్వయం ఉపాధి కార్యక్రమం (సెప్–1) కింద రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు సభ్యులకు ఆర్థిక చేయూతనందించాలని నిర్ణయించారు. దీని కింద 24 యూనిట్లను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 25 యూనిట్లకు రుణాలు అందజేసి అందులోని వందశాతం మించి ప్రగతిని సాధించారు. మహిళాశక్తిలో తడబాటు... బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధికి సంబంధించి వందశా తం రుణాలు అందజేస్తూ ఆదర్శంగా నిలిచిన మెప్మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మాత్రం తడబాటుకు గురవుతోంది. ఈ పథకం కింద వ్యక్తిగత రుణాలు 144మందికి అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 96 మందికి మాత్రమే అందజేశారు. మరో 48 యూనిట్లను సాధించాల్సి ఉంది. అలాగే గ్రూపులకు 25 యూనిట్లకు రుణాలు అందించాల్సి ఉండగా 18 యూనిట్లకు అందజేసి వివిధ వ్యాపారాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. మరో ఏడు యూనిట్లను సాధించాల్సి ఉంది. అయితే ఇంకా సమయం ఉన్నందున వీటిని కూడా వందశాతం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆసక్తిగల మహిళలను ఎంపిక చేసి వారికి రుణాలందించేలా శ్రద్ధ వహిస్తున్నారు. తద్వారా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ తో పాటు టైలరింగ్, సెంట్రింగ్ వంటి తదితర వ్యా పారాలు ప్రారంభించేలా చొరవ చూపుతున్నారు. సీ్త్రనిధి రుణాలు.. 103 శాతం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అండగా నిలుస్తోంది. బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేస్తూ వారు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను సీ్త్ర నిధి రుణ లక్ష్యం రూ.6 కోట్ల 28 లక్షల 64వేలు ఉండగా ఇప్పటి వరకు రూ. 6 కోట్ల 52లక్షల 23వేలను అందించారు. లక్ష్యానికి మించి 103 శాతం రుణాలు అందజేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 150 శాతం వరకు చేరుకుంటామని మెప్మా అధికారులు చెబుతున్నారు. -
ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
తాంసి: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని అదనపు ఎస్పీ సురేందర్‌రావు అన్నారు. జాతీయ సైన్స్‌డే పురస్కరించుకుని మండలంలోని కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం సైన్స్‌ఫేర్ ఏర్పా టు చేశారు. ఈసందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎగ్జిబిట్లను సందర్శించి విద్యార్థుల ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రాధిక, ప్రధానోపాధ్యాయుడు ఆనంద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన డీసీసీబీ చైర్మన్
కైలాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మంగళవా రం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. టెస్కాబ్ చైర్మన్‌తో పాటు రా ష్ట్రంలోని ఆయా సహకార బ్యాంకుల చైర్మన్లతో కలిసి హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాయంలో సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. తమ పదవీ కాలం మరో ఆరునెలల పాటు పొడిగింపుపై హ ర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలి పారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కాని రైతుల రుణాలు మాఫీ చేసేలా చూడాలని విన్నవించగా, సీఎం సానుకూల త వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
test article123
test article123test article123test article123 test article123 test article123 -
test Article 1
test Article 1test Article 1test Article 1test Article 1test Article 1test Article 1 -
4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
test 123