
అదృశ్యమైన మహిళ హత్య
మోర్తాడ్: నెల రోజుల క్రితం అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాము బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం నాగేంద్రనగర్‌కు చెందిన కొండ లక్ష్మి(45) గ్రామంలో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. ఈ ఏడాది జనవరి 21న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుమార్తె అనూష ఏర్గట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన కొంచపు వెంకటేశ్ లక్ష్మిని నమ్మించి తనవద్దకు పిలిపించుకొని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నెల రోజుల క్రితమే ఆమెను పొన్కల్ అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు ?
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని తిలక్‌నగర్‌లో మూడురోజుల క్రితం 25 కిలోల గంజాయితోపాటు సుమారు 9 మంది నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కొందరిని తప్పించేందుకు రాజకీయ నాయకుల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిందితులను కేసు నుంచి తప్పించేందుకు తల్లిదండ్రులు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఓ నాయకుడితో బేరసారాలు ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఐ ప్రమోద్‌రావును వివరణ కోరగా గంజాయి నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పటుకున్నది వాస్తవమేనని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment