Chittoor
-
● ప్రశ్నించిన మహిళకు నరకం చూపెట్టిన క్లీనర్, డ్రైవర్ ● చిత్తూరులో దిగాల్సి ఉండగా బెంగళూరులో దించిన వైనం
చికెన్షాపు నిర్వాహకుడిపై దాడి పుంగనూరు : పట్టణంలో చికెన్షాపు నిర్వహిస్తున్న అహ్మద్‌బాషా(45)పై మంగళవారం రాత్రి దాడి చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని చింతలవీధిలో నివాసం ఉన్న అహ్మద్‌బాషా మసీదు వద్ద చికెన్షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతడిపై భార్యకు పలు అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అహ్మద్‌బాషా చికెన్‌షాపులో ఉండగా భార్య తస్లిమా, కుమారుడు మహమ్మద్ ఫయాజ్, మరికొంత మంది వచ్చి దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌బాషాను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతారామాపురంలో చైన్ స్నాచింగ్ వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం సీతారామాపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే బరితెగించిన చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో ఉన్న బంగారం గొలుసును తెంపుకుని పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. పుత్తూరుకు వెళ్లడానికి ఓ మహిళ ఆటో కోసం సీతారామాపురం ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఓ బంక్ వద్ద వేచి ఉండగా ఇంతలో ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి బంక్‌కు కొద్ది దూరంలో నిలుపగా అందులో నుంచి ఓ వ్యక్తి దిగి బంక్ వద్దకు వచ్చి కూల్ డ్రింక్ కావాలని అడిగాడు. ఇంతలో అంగడి యజమాని కూల్ డ్రింక్ కోసం ప్రిజ్ వద్దకు వెళ్లగానే అక్కడ ఆటో కోసం వేచి ఉన్న మహిళ మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పరారరైనట్లు ఎస్ఐ ధర్మారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బస్సులో అయిదు సవర్ల బంగారం చోరీ చిత్తూరు అర్బన్ : బ్యాగులు బస్సులో ఉంచి ప్రయాణిస్తుండగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై క్లీనర్, డ్రైవర్‌ను నిలదీయడంతో చిత్తూరులో దిగాల్సిన మహిళా ప్రయాణికురాలిని, బస్సుల్లో ఎక్కించుకొని బెంగళూరులో దించారు. చిత్తూరులో జరిగిన ఈ ఘటనపై తాలూక పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మల్లికార్జున కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన రమాదేవికి ఇద్దరు పిల్లలు. రెండో కుమార్తె విజయవాడలోని పెనగలూరులో నివాసం ఉంటోంది. ఈనెల 1వ తేదీన కుమార్తె వద్దకు వెళ్లిన రమాదేవి, 10వ తేదీన విజయవాడ నుంచి ఓ ప్రైవేటు బస్సులో చిత్తూరుకు టికెట్ బుక్ చేసుకున్నారు. తన బ్యాగులో అయిదు సవర్ల బంగారు నగలను ఉంచి, బస్సు డిక్కీలో ఉంచగా.. క్లీనర్ తాళాలు వేశాడు. బస్సు చిత్తూరుకు రాగా, బ్యాగుల కోసం చూడగా.. ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. దీనిపై క్లీనర్, డ్రైవర్లను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బాధితురాలు గట్టిగా అడిగేసరికి, బస్సు ఎక్కమని చెప్పి, ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లి దించేసి.. నీ వల్ల అయ్యింది చేసుకో అంటూ డ్రైవర్లు వెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్సు డ్రైవర్లు కరీముల్లా, రాజేష్‌తో పాటు క్లీనర్ శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ద్రవిడ వర్సిటీ.. ఇన్చార్జి పాలన
● పెండింగ్‌లో వీసీ నియామకం ● ముందుకుసాగని అభివృద్ధి పనులు కుప్పం : కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో 9 నెలలుగా ఇన్చార్జి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లతో పాలనను కొనసాగిస్తున్నారు. దీంతో వర్సిటీలో అభివృద్ధి ముందుకు సాగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. కూటమి అధికారంలోకి రాగానే ద్రవిడ వర్సిటీ వీసీగా ఉన్న ఆచార్య కొలకలూరి మధుజ్యోతి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే వర్శిటీ ఇన్చార్జి వీసీగా ద్రవిడ వర్సిటీ లైబ్రరియన్ ఆచార్య దొరస్వామిని, కంప్యూటర్ సైన్స్ విభాగంలోని ఆచార్య కిరణ్ కుమార్‌ను ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమించారు. అప్పటి నుంచి ఒక్క ఎగ్జిక్యూటివ్ సమావేశం జరగకపోవడంతో వర్సిటీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దీంతో వర్శిటీలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకున్న న్యాక్ గ్రేడింగ్ సైతం ‘బి’ గ్రేడ్‌కే పరిమితం కావడంపై వర్సిటీలో తీవ్ర స్థాయిలో విమర్శలు నెలకొన్నాయి. ఏడాదిగా జీతాలు అందక .. న్యాక్ పీర్ టీమ్ సైతం వర్సిటీలో పాలనను మెరుగు పరుచుకోవాలని, ఇక్కడి పాలనపై అసహనం వ్యక్తం చేశారు. అదే రెగ్యులర్ వీసీ నియామకం జరిగి ఉంటే న్యాక్ గ్రేడింగ్ మరోలా ఉండి ఉంటుందని వర్సిటీలో కొంత మంది ఆచార్యులు చెబుతున్నారు. దీంతో పాటు వర్శిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరానికి పైగా జీతాలు అందక అవస్థలు పడుతున్నారు. కేవలం 6 నెలల జీతాలను మొదట్లో అందించి చేతులు దులుపుకున్నారు. వీరికి సైతం జీతాలు అందించేందుకు అధికారులు సతమతమవుతున్నారు. పెండింగ్‌లోనే నియామకం రాష్ట్రంలో 9కి పైగా వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించారు. అయితే కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయ వీసీ నియామకం ప్రకటించలేదు. దీంతో వర్సిటీ వీసీ నియామకాన్ని పెండింగ్‌లో పెట్టడంతో వర్సిటీలో అసంతృప్తి నెలకొంది. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ఇన్చార్జి పాలనతో బోధనా సిబ్బంది పదోన్నతులు , ఉన్నత విద్యకు సంబంధించిన పలు కార్యక్రమాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. -
పది, ఇంటర్ పరీక్షల్లో పొరపాట్లకు తావివ్వొద్దు
– సమీక్షలో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి , ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 30,652 మంది పరీక్షకు హాజరు కానున్నట్లు ఇందులో మొదటి సంవత్సరం 15,482 మంది (జనరల్– ఒకేషనల్), ద్వితీయ సంవత్సరం 15,170 మంది (జనరల్– ఒకేషనల్) విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా 118 కేంద్రాల్లో రెగ్యులర్ 20,954 మంది, ప్రైవేట్ 294 మంది మొత్తం 21,248 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు చీటింగ్‌కు పాల్పడిన ఎక్జామినేషన్ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్.... జిల్లాలో ఇంటర్ , పదో తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ను అమలు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మోహన్‌కుమార్, ఇంటర్మీడియట్ డీవీఈఓ సయ్యద్ మౌలా, డీఈఓ వరలక్ష్మి, తదితర అధికారులు పాల్గొన్నారు. -
మేయర్ దంపతుల హత్య కేసు నిందితుడు చింటూ విడుదల
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ బుధవారం చిత్తూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. 2015లో జరిగిన జంట హత్యల కేసులో చింటూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తొమ్మిదేళ్లకు పైగా ఈ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న చింటూకు ఇటీవల బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చింటూపై ఉన్న ఓ పెండింగ్ కేసులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోకపోవడంతో విడుదల ఆలస్యమయ్యింది. తాజాగా ఆ కేసులో బెయిల్ రావడంతో.. చింటూ జైలు నుంచి విడుదలయ్యాడు. నిందితుడు తిరుపతిలో ఉండాలని, జంట హత్యల కేసు విచారణ సమయంలో మాత్రమే చిత్తూరుకు రావాలనే షరతు ఉండటంతో.. జైలు నుంచి విడుదలయ్యాక తిరుపతికి వెళ్లిపోయాడు. -
బైక్ అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి మృతి
పుంగనూరు : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం పుంగనూరు– ముళబాగిల్ రహదారిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు .. మండలంలోని వనమలదిన్నె పంచాయతీ బసివినాయునిపల్లెకు చెందిన ఆదినారాయణ కుమారుడు సంతోష్ (17) పుంగనూరు బసవరాజ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితుడితో కలసి ద్విచక్ర వాహనంపై పుంగనూరు –ముళబాగిల్ రహదారిలో ఉన్న కత్తార్లపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడటంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఫుట్‌బాల్ సమాఖ్యకు పీడీ ఎంపిక పలమనేరు : పట్టణానికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీగా పనిచేస్తున్న విక్రమ్రాజ్ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ సమాఖ్యకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపికల్లో జిల్లా నుంచి ఈయన మాత్రమే ఎంపిక అయ్యారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
తిరుపతి సిటీ : మహిళా సాధికారతే లక్ష్యంగా ప ద్మావతి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని వైస్ చాన్సలర్ వి.ఉమ తెలిపారు. బుధవారం ఈ మేరకు వీసీగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిష్టాత్మక విద్యాలయంలో నిపుణులు, సమర్థులైన అధ్యాపకులు ఉన్నారని వెల్లడించారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో వర్సి టీని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు యత్నిస్తామని వివరించారు. అలాగే విద్యార్థినులను నూ తన పరిశోధనల దిశగా ప్రోత్సాహం అందిస్తామని, ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నాణ్యమై న విద్యను అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే అ న్ని విభాగాల్లో అడ్మిషన్లు పెంచేందుకు చర్యలు చే పడతామని వెల్లడించారు. విద్యార్థినులకు వర్సిటీ లో అధునాతన మౌలిక వసతులు, భద్రతకు ప్రా ధాన్యతనిస్తామని వివరించారు. రేపటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు 21న భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ఆంకురార్పణ జరగనుంది. 22న స్వామివారి ధ్వజారోహణం, 26న మహాశివరాత్రి, రాత్రి నందిసేవ, 27న ఉదయం రథోత్సవం, రాత్రి నారద పుష్కరణితో తెప్పోత్సవం, 28న కల్యాణం, మార్చి 2న గిరిప్రదక్షిణ, 4న పల్లకీసేవ, 5న ఏకాంతసేవ, 6న శాంతి అభిషేకాలతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణం కానున్నాయి. -
బోయకొండలో లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో ఏటా మాఘ మాసంలో వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన కార్యక్రమం బుధవారం ప్రారంభమయింది. బోయకొండ ఆలయంలో 16 ఏళ్లుగా హిందూ సంప్రదాయ రీతిలో లక్ష కుంకుమార్చనను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య అమ్మవారి ఉత్సవమూర్తికి ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగే కుంకుమార్చనలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీహోమం, మహా మంగళ హారతి చేశారు. 142 మంది దంపతులు కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. భక్తులతో ఆలయం రద్దీగా మారింది. అనంతరం ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఉభయదారులకు అమ్మవారి వెండి కాయిన్‌తో పాటు శేషవస్త్రం, తీర్థప్రసాదాలను దంపతులకు అందజేశారు. -
ఫస్ట్‌ఎయిడ్ నిర్లక్ష్యం
పొరపాట్లకు తావివ్వొద్దు.. పది, ఇంటర్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ● ఆర్టీసీ బస్సుల్లో ఖాళీ పెట్టెలు ● అలంకారప్రాయంగా ప్రథమ చికిత్స బాక్సులు ● ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స.. గోవిందా.. ● మోటారు వాహన చట్టానికి ఆర్టీసీ అధికారుల తూట్లు ● పట్టించుకోని రవాణా అధికారులు పార్టీకో నిబంధన పార్టీలను అనుసరించి రెవెన్యూ అధికారులు నిబంధనలు మారుస్తుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025చిత్తూరు రూరల్(కాణిపాకం) : ఆర్టీసీలో సురక్షిత ప్రయాణమే లక్ష్యం అనే నినాదం బాగున్నా.. కనీసం పాటించాల్సిన ప్రథమ చికిత్స బాక్స్‌లు ఔషధాలు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సుల నిర్వహణలో లోపాలు తేటతెల్లమవుతున్నాయి. ప్రధానంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఆర్టీసీలో అలంకారప్రాయంగా మారాయి. దీంతో ప్రమాద సమయంలో ప్రథమ చికిత్స దిక్కే లేకుండా పోయింది. మోటారు వాహన చట్టానికి ఆర్టీసీ అధికారులు తూట్లు పొడుస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిధులు లేక.. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స ఎంతో అవసరం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొదటి 15 నిమిషాలు ఎంతో విలువైనది. క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలంటే ఆ సమయంలో చేసే చికిత్స ఎంతో కీలకం. దీని కోసమే అన్ని వాహనాల్లోనూ ప్రథమ చికిత్స బాక్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం వీటి నిర్వహణ అధ్వానంగా మారింది. పలు బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ప్రథమ చికిత్స బాక్సుల్లో అవసరమైన మందులు మచ్చుకై నా కనిపించడం లేదు. కొన్ని బస్సుల్లో గడువు తీరిన మందులు, మరికొన్ని బస్సుల్లో ఖాళీ బాక్సులు, ఇంకొన్ని బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో ఇతర వస్తువులు కనిపిస్తున్నాయి. ప్రథమ చికిత్స బాక్సులో ఉండాల్సినవి.. ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సిన సామగ్రి 17 రకాల దాకా ఉన్నాయి. ఎలాస్టిక్ బ్యాండేజ్ రోలర్స్ 5, బెటాడిన్ అయింట్మెంట్, డెటాల్ లేదా ఐయోడిన్, స్టెరిలైజ్డ్ కాటన్ బండిల్స్, నియోసిన్ పౌడర్ డబ్బా, సర్జికల్ బ్లేడ్, బర్నాల్ ఆయింట్ మెంట్, వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్, బ్యాండ్ ఎయిడ్ ప్లాస్టర్లు, నైట్రోజన్, పెరాక్సైడ్, దూది, స్పిరిట్, పెయిన్ కిల్లర్ మాత్రలు, కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలకు మాత్రలు తదితరాలు అందులో ఉండాలి. అలసత్వంలో అధికారులు ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో మందులు ఏర్పాటు చేయకపోతే బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీఓ స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ నిర్వహణలో ఉన్న వాటిని ప్రభుత్వ బస్సులేనన్న భావనతో రవాణా అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. అనుమతుల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు మాత్రమే అలంకారప్రాయంగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. ఆ తర్వాత మళ్లీ కనిపించవు. ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిస్పెన్సరీ ఉంది. అవి లేని చోట జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. ప్రథమ చికిత్స బాక్సుల్లో మందులు పెట్టాల్సి వస్తే ఆస్పత్రులకు ఇండెంట్ పెట్టి తీసుకోవచ్చు. అయినప్పటికీ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ బస్సుల వివరాలు.. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేం.. అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందుకు తగ్గ ఏర్పాట్లు ఆర్టీసీ అధికారులు చేసుండాలి. అర్ధరాత్రి సమయాల్లో ప్రమాదం జరిగితే ఆర్టీసీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్‌లో కనీసం దూది కూడా ఉండడం లేదు. రోజు లక్షల సంఖ్యలో ప్రయాణిస్తున్న బస్సుల్లో ఇంత నిర్లక్ష్యం కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారింది. వీటిని ప్రతినెలా పర్యవేక్షించాల్సిన రవాణా అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి మమ అనిపిస్తుండడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిపోల సంఖ్య 5 మొత్తం బస్సుల సంఖ్య 400 పల్లెవెలుగు 233 ఎక్స్‌ప్రెస్ 100 సప్తగిరి ఎక్స్‌ప్రెస్ 33 సూపర్‌లగ్జరీలు 30 ఇంద్ర 04 రోజువారి తిరిగే కి.మీ 1.50 లక్షలు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 1.11 లక్షలు మొక్కుబడిగా పెట్టి.. వదిలేయడం కేంద్ర మోటారు వాహన చట్టం 1939 ప్రకారం ప్రయాణికుల వాహనాల్లో విధిగా ప్రథమ చికిత్స బాక్సులు ఏర్పాటు చేయాలి. ఈ చట్టాన్ని మరింత పటిష్ఠం చేస్తూ 1988లో మరిన్ని సవరణలు చేశారు. నిబంధనల ప్రకారం ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఇతర వస్తువులను బాక్సుల్లో ఉంచాలి. లైసెన్సు పొందే ముందు బస్సు డ్రైవర్, కండక్టర్ తప్పనిసరిగా వారం రోజుల పాటు ప్రథమ చికిత్స చేయడంపై శిక్షణ పొందాలని, ప్రతి మూడేళ్లకోసారి లైసెన్సును పునరుద్ధరించుకోవాలని చట్టం నిర్దేశిస్తుంది. ప్రయాణికులు గాయపడితే వారికి ప్రథమ చికిత్స చేసే సామర్థ్యం బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఉంటుంది. రవాణా శాఖ అధికారుల నుంచి బస్సులకు ఫిటెనెస్ సర్టిఫికెట్ పొందే సమయంలో మాత్రమే మొక్కుబడిగా ప్రథమ చికిత్స కిట్లను చూపుతున్నారు. ఆ తర్వాత వాటి నిర్వహణను గాలికొదిలేస్తున్నారు. బస్సులు నడిపేటపుడు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ఒక్కోసారి కొందరు ప్రయాణికులు గాయపడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. అలాంటప్పుడు ప్రథమ చికిత్స కిట్టు ఉంటే కొంతమేర ఉపశమనం ఉంటుంది. ప్రైవేటు అంబులెన్స్‌ల కోసం .. ఆర్టీసీ బస్సుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేటు అంబులెన్సులు, ఆటోలు,108 వాహనాల కోసం ఎదురుచూడడం తప్ప మరో దారి లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో ఔషధాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగితే అంతేసంగతి..ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెల్లో ఔషధాలు ఉండడంలేదు. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న బస్సుల్లోనే నిబంధనలు పాటించకపోతే ప్రైవేటు బస్సుల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందనేది వాస్తవం. ప్రయాణికుల భద్రతకు నిజంగా విలువనిస్తే ఆర్టీసీ అధికారులు వెంటనే ప్రథమ చికిత్స పెట్టెల్లో అవసరమైన మందులు ఉంచడంతో పాటు, నిర్వహణ సక్రమంగా ఉండేలా పర్యవేక్షించాలి. – బాలాజీ, చిత్తూరు డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల్లో అవసరమైన మందులు ఉండేలా డ్రైవర్లు, కండక్టర్లకు సూచించాం. వాటికి తాళాలు వేసి అత్యవసర సమయాల్లో తెరిచి ప్రథమ చికిత్స చేయాలి. ప్రతి నెలా ఫస్ట్ ఎయిడ్ బాక్సులను తనిఖీ చేసుకొని వాటిలో మందులు గడువు తీరితే వెంటనే వాటి స్థానంలో కొత్తవి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సులను ప్రయాణికులకు ఉపయోగపడేలా నిర్వహిస్తాం. ఈ విషయంలో డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి. – జగదీష్, డీపీటీఓ, చిత్తూరు -
ఎన్నికల గౌరవ వేతనం రూ.1.44 కోట్ల విడుదల
చిత్తూరు కలెక్టరేట్ : గత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది గౌరవ వేతనం రూ.1.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి కలెక్టరేట్ ఎన్నికల విభాగం త్వరలో జమ చేయనుంది. సులభ పద్ధతుల్లో బోధన కార్వేటినగరం : ఉపాధ్యాయులు తమ తరగతి బోధనాంశ ప్రక్రియలో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రణాళిక వేసుకుని, అమలు చేసి వివరాలను రికార్డు చేయడమే యాక్షన్ రీసెర్స్ అని జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపల్ డాక్టర్ శేఖర్ పేర్కొన్నారు. బుధవారం డైట్ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యే విధంగా బోధన చేపట్టడానికి ఈ శిక్షణ దోహద పడుతుందన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు డైట్లో నిర్వహించే యాక్షన్ రీసెర్చ్‌కు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఆ అంశాలను విద్యార్థులకు బోఽధించాలని చెప్పారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు ప్రభాకర్, చెంగల్రాజు, సునీత, నిర్మల, దేవప్రసాద్, రఫీ, అనిత, నాగరాజునాయక్, పలువురు ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మోడల్ ఫౌండేషన్ పాఠశాలలు సందర్శించండి చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఉన్న మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించాలంటూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి అందాయి. ఆ మేరకు జిల్లాలోని మోడల్ ఫౌండేషన్ పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ఈసీసీఈ, ఎఫ్ఎల్ఎన్ కార్యకలాపాల ప్రదర్శన తరగతులను పర్యవేక్షించాలన్నారు. పర్యవేక్షించేందుకు జిల్లాలోని డైట్ అధ్యాపకులను నియమించారు. రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి తవణంపల్లె : రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. బుధవారం సాయంత్రం చెర్లోపల్లెలో రీసర్వేను పర్యవేక్షించారు. సర్వే ఎలా చేస్తున్నారు? ఎప్పటికి పూర్తి చేస్తారని ఆరా తీశారు. పారదర్శకంగా రీసర్వే చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల గురించి చర్చించారు. తహసీల్దార్ సుధాకర్ రెవెన్యూ సదస్సులో 174 అర్జీలు వచ్చినట్లు వివరించారు. ఇందులో 86 అర్జీలను పరిష్కరించామని మిగిలిన అర్జీలను త్వరలో పరిష్కరిస్తామని వివరించారు. మండల సర్వేయర్ మురళీమోహన్, ఆర్ఐ జీవన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. విలీనబడి కష్టాలు గంగాధరనెల్లూరు : మా పిల్లలను ఊరిలోని బడికి కాకుండా ప్రభుత్వం మెర్జ్ చేసిన గ్రామానికి దూరంగా ఉన్న మరో పాఠశాలకు పంపలేమని మండల పరిధిలోని కట్టకందపల్లి హరిజనవాడ గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ–1 ఆంజనేయులు శెట్టికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ బాబు మాట్లాడుతూ.. కట్టకందపల్లి హరిజనవాడ నుంచి వేపంజేరి గ్రామానికి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నందున మా పిల్లలను ఆ పాఠశాలకు పంపలేమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని పాఠశాలను వేరే పాఠశాలలో కలపడాన్ని తిరస్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. -
వైద్యులు అలసత్వం వీడాలి
● పీహెచ్‌సీల్లో ఎందుకు అందుబాటులో ఉండటం లేదు? ● రాత్రి వేళల్లో కచ్చితంగా అందుబాటులో ఉండాలని ఆదేశం ● వరుస సమీక్షల్లో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది సమయపాలనలో నిర్లక్ష్యం వీడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో పలు శాఖలతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో 24 గంటల పాటు పనిచేసే పీహెచ్‌సీల్లో రాత్రి వేళల్లో సిబ్బంది ఎందుకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పీహెచ్‌సీల్లో ఓపి ఎంత ? ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ సేవలు అందించే విధానం ను పీహెచ్‌సీల వారీగా మెడికల్ ఆఫీసర్లతో నిత్యం సమీక్షిస్తామన్నారు. ఎన్సీడీ సర్వే కొన్ని పీహెచ్సీలలో వేగంగా జరుగుతోందని, ఇంకొన్ని చోట్ల నామమాత్రంగా చేస్తున్నారని మండిపడ్డారు. పీహెచ్సీలలో పరికరాల సమగ్ర నివేదికను ఈనెల 21 లోపు అందజేయాలన్నారు. సమీక్షలో డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీసీహెచ్ఎస్ ప్రభావతి పాల్గొన్నారు. మార్చి 2 లోపు సర్వే పూర్తి చేయండి జిల్లాలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని మార్చి 2లోపు గుర్తించి ఆర్థిక సాధికారతకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అట్టడగు స్థాయిలో ఉంటూ జీవించడానికి కనీస సౌకర్యాలు లేని వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు పీ4 విధానాన్ని (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్) అవలంబిస్తున్నామన్నారు. దారి ద్య్రరేఖకు దిగువనున్న వారిని గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను అనుసరించి నేటి నుంచి మార్చి 2 వరకు సర్వే చేయాలన్నారు. సమీక్షలో సీపీఓ సాంబశివారెడ్డి, డీఎల్డీఓ రవికుమార్ పాల్గొన్నారు.