
మేయర్ దంపతుల హత్య కేసు నిందితుడు చింటూ విడుదల
చిత్తూరు అర్బన్ : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ బుధవారం చిత్తూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. 2015లో జరిగిన జంట హత్యల కేసులో చింటూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. తొమ్మిదేళ్లకు పైగా ఈ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న చింటూకు ఇటీవల బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చింటూపై ఉన్న ఓ పెండింగ్ కేసులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోకపోవడంతో విడుదల ఆలస్యమయ్యింది. తాజాగా ఆ కేసులో బెయిల్ రావడంతో.. చింటూ జైలు నుంచి విడుదలయ్యాడు. నిందితుడు తిరుపతిలో ఉండాలని, జంట హత్యల కేసు విచారణ సమయంలో మాత్రమే చిత్తూరుకు రావాలనే షరతు ఉండటంతో.. జైలు నుంచి విడుదలయ్యాక తిరుపతికి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment