Jangaon
-
ఇంటర్నల్ మార్కుల వెరిఫికేషన్
జనగామ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులకు సంబంధించి వెరిఫికేషన్ చేసేందుకు నాలుగు రోజులుగా విద్యాశాఖ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ నెల 17న ప్రారంభమైన వెరిఫికేషన్ 20వ తేదీతో ముగియనుంది. జిల్లాలో ప్రభు త్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 183 ఉండగా, 6,234 మంది పదో తరుగతి విద్యార్థులు ఉన్నారు. వార్షిక పరీక్షల్లో 80 మార్కుల ఆప్షన్ ఉండగా.. స్కూల్ పరిధిలో ఇంటర్నల్‌గా 20 మార్కులు వేస్తా రు. ఇందులో పుస్తక సమీక్ష–5, రాత అంశాలు(నోట్స్)–5, ప్రాజెక్టు వర్కు–5, స్లిప్ టెస్ట్‌కు 5 మార్కులు ఉంటాయి. ఈ మార్కులు కరెక్టేనా.. లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఒక హెచ్ఎం, ఇద్దరు సబ్జెక్టు టీచర్లతో 21 టీంలను ఏర్పాటు చేశారు. ఈ బృందం సభ్యులు ఇంటర్నల్ మార్కుల కు సంబంధించి ఆన్సర్ షీట్లు, ప్రాజెక్టు రిపోర్టులను పరిశీలించాకే ఓకే చెబుతారు. 22 నుంచి ఆన్లైన్ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేయగా, 20 ఇంటర్నల్ మార్కుల ను పాఠశాలలు, విద్యార్థుల వారీగా ఈనెల 22 నుంచి ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. వార్షిక పరీక్షలు ముగిసి ఫలితాల సమయంలో వీటిని అనుసంధానం చేసి తుది మార్కులు విడుదల చేస్తారు. నేటితో ముగియనున్న ప్రత్యేక టీంల తనిఖీలు 22వ తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ -
మహనీయుడు సేవాలాల్
స్టేషన్‌ఘన్‌పూర్: అందరి జీవితాలను, భవిష్యత్‌ను తీర్చిదిద్దిన మహనీయుడు సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శివునిపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం నిర్వహించిన సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఉత్సవ సమితి బాధ్యుడు బానోతు రాజేష్‌నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీహరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని, నియోజకవర్గ కేంద్రంలో రూ.2కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్న ట్లు పేర్కొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రజ లకు ఏ సమస్య వచ్చినా కడియం కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. సంత్‌సేవాలాల్ చూపిన మార్గంలో నడుస్తూ గిరిజనులు అభివృద్ధి చెందాల ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గోర్ బంజారా గురువు మహేష్మహరాజ్, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ లావణ్యశిరీష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుడోజు రాంబాబు, బూర్ల శంకర్, గిరిజన నాయకులు భూక్య స్వామినాయక్, రమేష్ నాయక్, లకావత్ చిరంజీవినాయక్, కొర్ర వెంకటేష్ నాయక్, దశరథ్‌నాయక్, హుస్సేన్‌నాయక్, భిక్షపతి నాయక్, లక్ష్మణ్, లచ్చిరాం పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
వైద్యులు అందుబాటులో ఉండాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు బచ్చన్నపేట : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్‌రావు అన్నారు. బుధవారం స్థానిక ఆస్పత్రిని సందర్శించి రోగుల గదులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందడానికి ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. వేసవి సమీపిస్తున్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు, ఈజీఎస్ పనుల వద్ద కూలీలకు అందజేయాలని తెలిపారు. ఎండలో బయటకు వెళ్లకూడదని, తప్పనిసరి అయి తే తలకు పాగా, టోపీ ధరించాలని సూచించారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తితే అందుబాటులోని ఆస్రత్రిలో చూపించుకోవాలని సూచించారు. మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు శ్రీనివాస్, అరుణ, దీప్తి, పీహెచ్ఎన్ అన్నాంబిక, సీహెచ్ఓ జంగమ్మ, హెడ్ నర్సు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లపై పార్కింగ్, ఫుట్‌పాత్ వ్యాపారం ఉండకూడదు
జనగామ పట్టణాన్ని ప్రమాద రహితంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నం. రోడ్లపై ఫుట్‌పాత్ వ్యాపారంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూం వద్ద జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. ఫుట్‌పాత్ వ్యాపారం చేసేవారితో పాటు, కస్టమర్లు సగం రోడ్డుపైనే ఉండాల్సి వస్తోంది. దీంతో అదుపు తప్పి వచ్చే వాహనాలతో ఇబ్బంది కరంగా మారుతోంది. అడ్డగోలు పార్కింగ్, ఫుట్‌పాత్ వ్యాపారాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నాం. – దామోదర్‌రెడ్డి, సీఐ, జనగామ● -
ఆర్థిక ఒడిదుడుకులు
జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనకబాటుసాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగ ల్), మహబూబాబాద్ 23వ స్థానంలో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ’తెలంగాణ రాష్ట్ర గణాంకా ల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ.. లేస్తూ 14, 15 స్థానాల్లోనే.. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిగాను ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబా బాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైంది. కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆరిక వృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. తలసరి ఆదాయంలో భూపాలపల్లి బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655లతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 సంవత్సరం ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477లు తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317లతో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086 లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్భన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.. ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో ఉన్న 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 (89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 7.74.549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..9,92,33338,20,36928,28,036గ్రామీణ జనాభాపట్టణ/నగరజనాభామొత్తం జనాభాజిల్లా మొత్తం గ్రామీణ పట్టణ/నగరం జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి... ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే.. ‘రాష్ట్ర గణాంకాల నివేదిక అట్లాస్–2024’లో వెల్లడి -
రోడ్డుపైనే పార్కింగ్..
వ్యాపార, వాణిజ్య సంస్థలకు అడ్డగోలు అనుమతులు● రహదారిపైనే వ్యాపారాలు ● అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్ ● తరుచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు..జిల్లా కేంద్రానికి కనెక్టివిటీగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, నల్లగొండ, సిద్ధిపేట జిల్లా సరిహద్దులు ఉంటా యి. వాణిజ్యం, వ్యాపార పరంగా ఆరు జిల్లాల నుంచి వ్యాపారులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి నిత్యం వస్తుంటారు. అలాగే కలెక్టరేట్, జిల్లా పరిషత్, ఎల్ఐసీ, వ్యవసాయ మార్కెట్, ఉన్నత చదువుల కోసం వందలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో రాకపోకలు సాగిస్తారు. దీంతో ట్రాఫిక్ గతం కంటే ఐదు రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్‌రోడ్డు, సిద్ధిపేటరోడ్డు, రైల్వేస్టేషన్, నెహ్రూపార్కు, స్వర్ణకళామందిర్ రోడ్లు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు రద్దీగా ఉంటా యి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు రోడ్ల విస్తరణ చేపట్టగా.. చాలా మంది యజమానులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కోల్పోయారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండడానికి రోడ్లను వెడల్పు చేస్తే.. ఆ ప్రదేశాన్ని ఫుట్‌పాత్ వ్యాపారాలు, పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. బార్లు, వైన్స్, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్ ఎదుట పార్కింగ్‌కు స్థలం లేక వచ్చే కస్టమర్లు కార్లు, బైక్‌లను రోడ్డుపైనే నిలపాల్సి వస్తున్నది. కొన్ని వాణిజ్య సంస్థలకు సెల్లార్లు ఉన్నా పార్కింగ్‌కు ఉపయోగించకుండా, వ్యాపారాల నిర్వహణకు అద్దెకు ఇస్తున్నారు. జనగామ: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. షాపింగ్ మాల్స్, మార్డులు, వాణిజ్య సంస్థలకు పార్కింగ్ స్థలం లేకుండానే మున్సిపల్ నుంచి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. భవనాల నిర్మాణ సమయంలో సెల్లార్లు ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిని గోదాంలకు ఉపయోగించడం లేదా అద్దెకు ఇస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతూ రవాణా, ప్రజల రాకపోకలతో ఎప్పడూ రద్దీగా ఉంటోంది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ వ్యాపారాలు పెరిగాయి. వాహనాల పార్కింగ్ కోసం రోడ్లను ఆక్రమిస్తుండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది. సెల్లార్లు అద్దెకు.. రోడ్డుపైనే వాహనాలు -
ఇసుక అక్రమ రవాణా చేయొద్దు
కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ రూరల్/రఘునాథపల్లి: ఇసుకను అక్రమంగా రవాణా చేయొద్దు.. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. బుధవా రం జనగామ మండల పరిధి యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి సందర్శించారు. ఇసుక, వాగుల్లోని ఒండ్రుమట్టి తరలింపును అరికట్టేందుకు దారుల్లో ట్రెంచ్‌లు తవ్వి ట్రాక్టర్లు వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సెన్, డీటీ జగన్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టును డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్‌బాషా తనిఖీ చేశా రు. చెక్‌పోస్టు వద్ద అనుచరిస్తున్న విదానాలను ఎస్సై నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎర్త్ కుండీల్లో నీరు నింపాలిచిల్పూరు: వేసవి సమీపిస్తున్నందున ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ కుండీల్లో నీరు నింపాలి.. అలా చేస్తే లోవోల్టేజీని తట్టుకుంటుందని విద్యుత్ డీఈ రాంబాబు అన్నారు. కొండాపూర్ డిస్ట్రిబ్యూషన్లోని మట్టి గుంతల్లో సిబ్బంది నీరు నింపడాన్ని బుధవారం రాజవరం ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్నందున విద్యుత్ ఉప కేంద్రాల్లో సరఫరా, వినియోగం పెరిగి పవర్ ట్రాన్స్ ఫార్మర్లకు(పీటీఆర్) సాంకేతిక సమస్య రాకుండా ఉండేందుకు ఎర్త్ కుండీల్లో రోజూ నీరు నింపాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎల్ఎం కృష్ణంరాజు, జీపీ సిబ్బంది ఉన్నారు. ‘ఏబీవీ’ కళాశాలలో నూతన డిగ్రీ కోర్సులుజనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సాధించింది. దీంతో బీఏ, బీకాం, బీఎస్సీ(లైఫ్ సైన్స్, బీఎస్సీ(ఫిసికల్ సైన్స్)తో పాటు 2025–26 విద్యాసంవత్సరం నుంచి బీబీఏ(జనరల్) బీకాం(ఈ కామర్స్) బీఎస్సీ(ఫార్మసీ), కంప్యూటర్ సైన్స్ కొత్త కోర్సులు(డేటా సైన్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్) ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్సయ్య అన్నారు. బుధవారం కోర్సుల వివరాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని నచ్చిన కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశం పొందవచ్చని సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయానికిసోమనాథుడి పేరు పెట్టాలిపాలకుర్తి టౌన్: స్వయంభూ సోమేశ్వర స్వామి నిలయం, మహాకవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలం అయని పాలకుర్తి క్షేత్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని సాయితీ వేత్త, ఎంప్లాయీస్ వాయిస్ సంపాదకులు క్యామ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో సోమేశ్వర స్వామిని దర్శించుకు న్న అనంతరం పాల్కురికి సోమనాథుడి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట ప్రఖ్యాత నర్తకి అడుసుమల్లి సుజాత, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి సీఐ గట్ల మహేందర్‌రెడ్డి ఉన్నారు. పోలింగ్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీజనగామ రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పరిధి గిర్నిగడ్డ పాఠశాలలోని పోలింగ్ సెంటర్‌ను బుధవా రం డీపీసీ రాజమహేంద్రనాయక్ సందర్శించా రు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి న వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ దామోదర్‌రెడ్డి ఉన్నారు. -
అధికారుల హాస్టల్ నిద్ర
కరుణాపురం ఎంజేపీలో విద్యార్థులతో కలిసి నిద్రిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషాఎంజేపీలో రాత్రి బస చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అలాగే రాత్రి అక్కడే బస చేశారు. వసతులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల ప్రతిభాపాటవాలను పరీక్షించారు. కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాల, కళాశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్.. అంతకు ముందు విద్యార్థులకు పాఠాలు బోధించారు. అలాగే వారితో కలిసి భోజనం చేసి సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.. పదవ తరగతి ఫలితాలు దిక్సూచి అని పేర్కొన్నారు. – జనగామ – వివరాలు 9లోu