breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Vinamar Test Article Webo
None -
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి. మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk — Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024 #WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ — ANI (@ANI) April 22, 2024 -
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్‌లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్‌లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు. బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!) #Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw — Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కసారిగా కురిస్తే ఇలా ఉంటుందా..!
వర్షం అనేది మనకు సీజన్ల బట్టే వస్తోంది ఒక్కోసారి సమ్మర్లో కూడా వచ్చిన అదికూడా ఓ మోస్తారుగా వస్తుంది. వర్షాకాలంలోనే మనకు అత్యధికంగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఎడారి దేశమైన దుబాయ్ లాంటి దేశాల్లో వర్షం అనేది చాలా తక్కువ. ఏడాదికి చాలా తక్కువ వర్షపాతమే నమోదవ్వుతుంది. అలాంటిది ఇటీవల దుబాయ్‌ని వణికించేలా వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా దుబాయ్‌లోని కార్లు, బహుళ అంతస్థులు నీట మునిగాయి. అంతేగాదు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చెప్పాలంటే ఒక్క ఏడాదిలో కురవాల్సిన వానంతా ఒక్కరోజే పడితే ఎలా ఉంటుందో అలా కుండపోతగా కురిసేసింది. అంతేగాదు అక్కడ అధికారులు కూడా ఇలాంటి వానను ఎన్నడు చూడలేదని ఇది "చారిత్రక వాతావరణ సంఘటన" అని చెబుతున్నారు. దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు ఎడారి దేశమైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భారీ వర్షాలు యూఏఈనే కాకుండా ఒమన్‌ని కూడా తాకింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ముంబైలో ఉండగా కూడా తాము ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఎడారిలాంటి దుబాయ్ అంతటా కాలువలు పారుతున్నాయంటూ పోస్టులు పెట్టారు. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా?
ప్రతీరోజు ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటున్నాం. వింత ప్రదేశాలు, వింత చేష్టలు, ఆశ్యర్యపరిచే నిజాలు, అద్భుతాలు.. ఇలా ఎన్నోవాటి గురించి ఎంతోకొంత అవగాహనకు వస్తూనే ఉన్నాయి. మరి ఈ కొత్త పదాలు, వింత వింతల గురించి ఎప్పుడైనా విన్నారా! లేదా? మరేంటో తెలుసుకుందామా..!! అవే ఇవి.. పే త్రూ ది నోస్.. సాధారణంగా చెల్లించేదాని కంటే ఎక్కువగా చెల్లించే సమయంలో వాడే మాట...పే త్రూ ది నోస్. ఉదా: వీ హ్యాడ్ టూ పే త్రూ ది నోస్ ఫర్ అవర్ రూమ్ బికాజ్ ఇట్ వాజ్ ఏ లాంగ్ వీకెండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ వర్ బుక్డ్. గోయింగ్ గ్రేట్ గన్స్.. ఒక రంగంలో, పనిలో విజయ వంతంగా దూసుకువెళ్లే సందర్భంలో వాడే మాట... గోయింగ్ గ్రేట్ గన్స్. ఉదా: ది ఫర్మ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ గోయింగ్ గ్రేట్ గన్స్ విత్ హిజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. అవును.. ఇది నిజమే! ఆడ నెమలిని పీహెన్ అని పిలుస్తారు. అగ్గిపుల్లల కంటే ముందుగానే లైటర్‌ను తయారుచేశారు. కరెంట్ మూడ్ ఆధారంగా పాటలను ప్లే చేసే హెడ్ఫోన్లను న్యూరబుల్ కంపెనీ తయారు చేసింది. ఇవి చదవండి: అతిపెద్ద పాము ఉనికి వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019