Jayashankar
-
ఆర్థిక ఒడిదుడుకులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనుకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధిరేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే.. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తర్వాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7,583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు. పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్.... ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణ వాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం)మంది పట్నవాసం చేస్తున్నారు. జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం జనాభా జనాభా జనాభా హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 మొత్తం 38,20,369 28,28,036 9,92,333జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 17,684 16,181 19,877 23,868 వరంగల్ రూరల్ 12,903 13,901 16,509 18,677 జనగామ 10,939 10,353 11,672 13,875 మహబూబాబాద్ 12,244 13,092 16,317 18,245 జేఎస్.భూపాలపల్లి 12,157 10,298 11,848 11,481 ములుగు 5,695 5,382 6,147 7,583జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618 వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877 జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424 మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309 జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655 ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్.. 2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174 లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278లున్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్భన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది.జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటు రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి... ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
తాగునీటి ఇబ్బందులు రావొద్దు
లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదవాలి రేగొండ: ప్రతీవిద్యార్థి లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళిబద్ధంగా చదవాలని కలెక్టర్ రాహుల్‌శ ర్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. వి ద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివి ఉత్తమ ఫలి తాలు సాధించేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్మి స్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే రైతువేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మనోరమ, గృహనిర్మాణ పీడీ లోకిలాల్, డీఆర్డీఓ నరేష్, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు ఉన్నారు. భూపాలపల్లి అర్బన్: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, విద్యుత్, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా మంచినీటి సరఫరా పరిస్థితిని ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుల ఉంటే వెంటనే చేయాలని ఆదేశించారు. గ్రామ, పట్ట ణాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూ చించారు. విద్యుత్ సమస్య వస్తే 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నారు. మంచినీటి సమస్య వ స్తే ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేయాలని తెలి పారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 26న కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవాలయంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో మహాశివరాత్రి వేడుకలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచా యతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్, మత్స్య, విద్యుత్, ఆబ్కారీ, సింగరేణి, ఆర్టీసీ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. మహాశివరాత్రి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నా యక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, డీపీఓ నారాయణరావు, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, మత్స్యశాఖ అధికారి అవినాశ్, దేవస్థానం ఈఓ మహేష్ పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాహుల్‌శర్మ -
ఎస్టీ హాస్టల్ తనిఖీ
మల్హర్: మండల కేంద్రం తాడిచర్లలోని ఎస్టీ హాస్టల్‌ను బుధవారం సంక్షేమ శాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏసీఎంఓ) రాజారత్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని సమస్యలలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని విద్యార్థులకు సూచించారు. టెన్త్‌లో ప్రతి విద్యార్థి 10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు సబ్బులు, దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో వార్డెన్ కిరణ్, తదితరులు ఉన్నారు. నేడు ఇసుక రీచ్‌ల పరిశీలన కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని పలు ఇసుక క్వారీలను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ గురువారం పరిశీలించనున్నట్లు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పలు క్వారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులు క్వారీలను పరిశీలిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. అయితే.. ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. పన్నుల వసూళ్లలో అలసత్వం వహించొద్దు భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లలో సిబ్బంది అలసత్యం వహించొద్దని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వార్డు అధికారులు, బిల్ కలెక్టర్ల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఇప్పటి వరకు 45శాతం మాత్రమే పన్నులు వసూళ్లు చేయడం జరిగిందని, మార్చి 31వ తేదీ లోపు వంద శాతం వసూలు చేయాలని తెలిపారు. పట్టణంలో పేరుకుపోయిన ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలు విషయంలో అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు బకాయి లేకుండా చెల్లించాలని కోరారు. -
భూ వివాదంలో వ్యక్తి దారుణ హత్య
భూపాలపల్లి: భూవివాదంలో భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫక్కీర్‌గడ్డ(ఆకుదారివాడ)కు చెందిన 15వ వార్డు తాజా మాజీ వార్డు కౌన్సిలర్ నాగవెల్లి సరళ, ఆమె భర్త, రాజలింగమూర్తి(49) కొన్ని నెలలుగా పట్టణంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం ఫక్కీర్‌గడ్డలోని తన బంధువుల ఇంటికి వెళ్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వచ్చాడు. అక్కడ టీ తాగి రెడ్డి కాలనీలోని తన ఇంటికి రాత్రి సుమారు 7 గంటలకు వెళ్తున్న క్రమంలో హత్యకు గురయ్యాడు. దుండగులు మొఖం, పొట్ట భాగంలో కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో పేగులు బయటపడ్డాయి. ఈ హత్యలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలోని ఓ భూ వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి రాస్తారోకో చేపట్టారు. నిందితులను గుర్తించే వరకు అంత్యక్రియలు నిర్వహించమంటూ రోడ్డుపై బైఠాయించారు. కాగా, తన భర్త హత్య వెనుక స్థానిక బీఆర్ఎస్ నాయకులు, స్థానికుల కుట్ర ఉందని మృతుడి భార్య సరళ ఆరోపిస్తోంది.