
ఎస్టీ హాస్టల్ తనిఖీ
మల్హర్: మండల కేంద్రం తాడిచర్లలోని ఎస్టీ హాస్టల్‌ను బుధవారం సంక్షేమ శాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏసీఎంఓ) రాజారత్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో మెనూ ప్రకారం భోజనం అందజేస్తున్న తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లోని సమస్యలలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని విద్యార్థులకు సూచించారు. టెన్త్‌లో ప్రతి విద్యార్థి 10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు సబ్బులు, దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో వార్డెన్ కిరణ్, తదితరులు ఉన్నారు.
నేడు ఇసుక రీచ్‌ల పరిశీలన
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని పలు ఇసుక క్వారీలను రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ గురువారం పరిశీలించనున్నట్లు తెలిసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పలు క్వారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారులు క్వారీలను పరిశీలిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. అయితే.. ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటన వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు.
పన్నుల వసూళ్లలో
అలసత్వం వహించొద్దు
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లలో సిబ్బంది అలసత్యం వహించొద్దని మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన వార్డు అధికారులు, బిల్ కలెక్టర్ల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. ఇప్పటి వరకు 45శాతం మాత్రమే పన్నులు వసూళ్లు చేయడం జరిగిందని, మార్చి 31వ తేదీ లోపు వంద శాతం వసూలు చేయాలని తెలిపారు. పట్టణంలో పేరుకుపోయిన ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూలు విషయంలో అలసత్వం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలు ఇంటి, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు బకాయి లేకుండా చెల్లించాలని కోరారు.

ఎస్టీ హాస్టల్ తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment