Jogulamba
-
స్వచ్ఛందంగా తరలింపు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ మాకు జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా ఉన్న మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం సక్రమంగా ఇస్తేనే వెళతాం.. ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్ మండలం ● -
ఎస్బీఐ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
అలంపూర్: ఎస్బీఐ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అన్నారు. అలంపూర్ చౌరస్తాలో ఎస్బీఐ బ్రాంచీని బుధవారం ఆయనతోపాటు హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్‌తో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ నెట్వర్క్–2 ప్రకాష్ చంద్ర బరోర్, రీజినల్ మేనేజర్ సునిత, ఆయా గ్రామాల ప్రజలు డిజిటల్ స్క్రీన్‌పై వర్చువల్ ప్రారంభాన్ని వీక్షించారు. అనంతరం సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్నాయక్తో మాట్లాడారు. ఇక్కడి భూములు, పంటల వివరాలు, పరిశ్రమలు, మిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులకు, ప్రజలకు రుణాలు, సేవల గురించి వివరించారు. ఇదిలాఉండగా, ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిది మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామం. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు అలంపూర్ చౌరస్తాలో ఎస్బీఐ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎస్బీఐ సేవలు తీసుకొచ్చిన చైర్మన్‌కు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతల్ బైల్, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజీ కింద 5 ఎకరాలు, లేదంటే రూ.15 లక్షలు అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు మొదటి విడతలో కుడిచింతలబైల్,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
మారని పోలీసు తీరు..!
●శాఖాపరమైన చర్యలు తప్పవు పోలీసుశాఖలో ఏ స్థాయి అధికారి తప్పు చేసిన శాఖ పరమైన చర్యలు ఉంటాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం సమూల మార్పులు తీసుకువస్తున్నాం. పేకాట విషయంలో సిబ్బందిపై వచ్చిన ఆరోపణాలపై ఇప్పటికే అనర్హత వేటు వేశాం. సీఐ స్థాయి అధికారులు మొదలుకుని ఎస్ఐ, కానిస్టేబుళ్ల వరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నాం. అన్ని పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ప్రత్యేక విభాగం నిఘా ఉంచింది. వివిధ స్థాయిలో చేసిన తప్పిదాలపై మెమోలు జారీ చేశాం. నాయకులు, ప్రజలు అనే భేదం లేకుండా పోలీసులు సేవలు అందిస్తారు. దళారీ వ్యవస్థలో ఎవరిని సహించేది లేదు. చట్ట పరిధిలో అందరూ సమానమే. – శ్రీనివాసరావు, ఎస్పీ● పేకాటరాయుళ్లతో డబ్బులు వసూలు ● క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యం ● ఆరోపణల నేపథ్యంలో పలువురు సిబ్బందిపై వేటు గద్వాల క్రైం: శాంతిభద్రతలను కాపాడుతూ.. ప్రజలకు మేమున్నామనే భరోసానిచ్చేది పోలీసులు. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన పోలీసు శాఖకు కొందరు సిబ్బంది మాయని మచ్చ తెస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారితో చేతులు కలుపుతున్నారు. ఓవైపు ఇసుక, బియ్యం, మట్టి, పేకాట తదితర అసాంఘిక దందాలను కట్టడి చేస్తున్నా.. మరో వైపు అవీనితికి పాల్పడిన వారికి అండగా నిలుస్తూ.. స్థాన చలనం.. అనర్హత వేటుకు గురవుతున్నారు. జిల్లా పోలీసుశాఖలో గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమయ్యాయి. జిల్లాలోని కొన్ని సంఘటనలు.. ● 21.08.2024వ తేదీన అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి పోలీసుస్టేషన్ సమీపంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది పేకాటరాయుళ్లు నిత్యం పేకాట దందాను నిర్వహిస్తుండగా పోలీసులు మెరుపు దాడులు చేపట్టి పలువురిని అరెస్టు చేశారు. అయితే పోలీసు సిబ్బందితోపాటు ప్రైవేట్ వ్యక్తులు ఈ దాడుల్లో పాల్గొని పేకాటరాయుళ్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి.. పట్టుబడిన నగదును తక్కువగా చూయించారు. ఈ ఘటనపై విచారించి ఆరోపణలు వాస్తవమని పోలీసు పైఅధికారులు నిగ్గు తేల్చారు. దీంతో మల్టీ జోన్ –2 ఐజీ పీవి.సత్యనారాయణ గద్వాల స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ జములప్ప, ఎస్ఐలు విక్రం, శ్రీనివాసులును విధుల నుంచి తొలగించి వీఆర్‌కు ఆటాచ్ చేశారు. అవినీతి, అక్రమాల్లో కొందరు.. -
గద్వాల విద్యార్థికి ప్రధాని ప్రశంస
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆదికేశవ్ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో గుజరాత్‌లోని వాద్నగర్లో నిర్వహించిన జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు విద్యార్థి ఆదికేశవ్ ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా, అందులో గద్వాల విద్యార్థి ఉండటం విశేషం. దేశ చరిత్ర, సాంస్కృక, స్వాభిమాన్, ధైర్య సహసాలు, పరిశ్రములు, కరుణ, సత్యనిష్ట, నాయకత్వం, విశ్వసనీయత, కర్తవ్యం, సత్యం, అహింసా తదితర అంశాలపై శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ విద్యార్థిని అభినందిస్తూ లేఖ రాశారు. ‘జాతీయస్థాయి ప్రేరణ సదస్సుకు ఎంపికై , అక్కడ నిర్వహించిన శిక్షణలో చక్కటి అంశాలను నేర్చుకోవడం శుభపరిణామం. వాటిని జీవితంలో అవలంభిస్తూ ఆదర్శవంతంగా ఎదగాలి’ అని లేఖలో ప్రస్తావించారు. హెచ్ఎం ఇమ్మానియేల్, ఉపాధ్యాయులు.. విద్యార్థిని సన్మానించారు.మిరపకు మద్దతు ధర కల్పించాలి అలంపూర్: ప్రభుత్వం మిరప రైతులకు మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జీకే ఈదన్న డిమాండ్ చేశారు. అలంపూర్ మండలంలోని సింగవరంలో బుధవారం మిరప రైతులను కలిసి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుత.. ఎకర మిరప పంట సాగుకు రూ.లక్షకుపైగా ఖర్చు చేశారని, కానీ మిరపను విక్రయించేందుకు వెళితే సాగు వ్యయం ఖర్చులు రావడం లేదన్నారు. బహిరం మార్కెట్లో విక్రయించేందుకు వెళ్తే క్వింటాల్ ధర రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు మాత్రమే పలుకుతుందన్నారు. పంట మొత్తం విక్రయించిన కనీసం పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు లేవని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిరప బోర్డును ఏర్పాటు చేయా లన్నారు. క్వింటాల్‌కు రూ. 25 వేల ప్రకటించి కొ నుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నరసింహ్మా, రజాక్, గోపాల్, చిన్న ఈరన్న, బాబు సాబ్, మహమ్మద్, నరసింహులు ఉన్నారు. నెలాఖరు వరకు ఆర్డీఎస్కు నీరు శాంతినగర్: ఫిబ్రవరి 28 వరకు ఆర్డీఎస్కు సాగు నీరు పుష్కలంగా అందుంతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. వడ్డేపల్లి మండలంలో ప్రవహించే ఆర్డీఎస్ కెనాల్లో బుధవారం నీటి ప్రవాహం కొనసాగింది. మరో తొమ్మిది రోజుల పాటు ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీబీ డ్యాంలో నాల్గో ఇండెంట్‌గా పెట్టిన 1.16 టీఎంసీల నీరు బుధవారం ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ రాజోళిబండకు చేరాయని పేర్కొన్నారు. సాయంత్రం ఆనకట్టపై ఇంచు మేర ఓవర్ ఫ్లో కొనసాగుతోందని, గురువారం ఉదయం వరకు ఓవర్ ఫ్లో మరింత పెరిగే అవకాశం వుందన్నారు. తుమ్మిళ్ల లిఫ్ట్ సంప్ వద్ద నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఇండెంట్ నీరు గురువారం సాయంత్రం వరకు తుమ్ళిళ్లకు చేరుతుందని, తుమ్మిళ్ల లిఫ్ట్‌కు ఇండెంట్ నీరు నెలాఖరు వరకు అందుతుందని, ఆర్డీఎస్ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఐదో చివరి ఇండెంట్ 0.8 టీఎంసీలు మిగిలి వుందని, కేసీ కెనాల్‌కు ఇండెంట్ పెట్టిన సమయంలో పెడతామని ఏఈ పేర్కొన్నారు. అంతేగాక ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ రాజోళి బండ షెట్టర్ల నుంచి ప్రధాన కాల్వ ద్వారా విడుదలైన నీరు బుధవారం అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చేరాయని, గురువారం ఉప్పల వరకు చేరుతాయన్నారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత అయిజ: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోదమయానందాజీ మహారాజ్ అన్నారు. బుధవారం మండలంలోని సంకాపురంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామకృష్ణ ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మనిషి దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత చాలా వసరమని అన్నారు. చిన్ననాటినుంచి ఆధ్యాత్మికత కలిగి ఉండాలని, దానివలన సమాజం భక్తి మార్గం వైపు నడుస్తుందని అన్నారు. అహింసా మార్గాన్ని విడనాడాలని, ప్రతి రోజు ప్రతి ఒక్కరు గంటసేపు ధ్యానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం శర్మ, సూర్య ప్రకాష్, ఉమాదేవి, రాముడు, రాజీవ్, వెకంట్రాములు, కృష్ణ, సత్యనారాయణ, ఈశ్వర్, దామోదర్, ఈశ్వరన్న పాల్గొన్నారు. -
సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని..గద్వాల పట్టణంలో ‘ప్రత్యేక’ పాలన మార్కు చూపించి, ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, వార్డు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా సమీక్షించి, వారి నుంచి సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో ప్రగతి పనుల నిమిత్తం ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలన్నారు. పన్ను బకాయిలపై ప్రత్యేక శ్రద్ద కనబర్చి, రెగ్యులర్ పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు. సిబ్బందికి లక్ష్యలను నిర్ధేశించి పన్ను, అద్దెలను వసూలు చేయాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్య జఠిలంగా ఉన్న వార్డులలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. తక్షణమే వార్డు అధికారులకు వార్డులను కేటాయించి, వారికి బాధ్యతలను అప్పగించాలన్నారు. ఇక నుంచి వార్డు అధికారులు ఆయా వార్డులలో ప్రజలకు అందుబాటులో ఉండి వారితో మమేకం కావాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఆస్తిపన్ను వసూళ్లు, తాగునీటి సరఫరా, లే అవుట్లు, విద్యుత్తు తదితర విభాగాలను సమర్ధవంతంగా పర్యవేక్షించాలన్నారు. ప్రతి వార్డు అధికారికి ఆయా వార్డులపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి పట్టు సాధించాలన్నారు. 15 రోజుల తరువాత మరోసారి సమీక్ష నిర్వహించి, పురోగతిపై అంచనా వేస్తామన్నారు. రాబోవు వేసవికాలం తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాంచారు. ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం మున్సిపాలిటీలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలపై ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయని ఆయా విభాగాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తిపన్ను మదింపులో అక్రమాలపై ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలు, మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఊదాసీనంగా ఉన్నారని, ఇలాగే కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు, కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలి వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు చర్యలు కలెక్టర్ బీఎ సంతోష్