breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
కొండాపురం: గండికోట ప్రాజెక్టు ముంపు బాధిత తొలి విడత గ్రామాలకు ఎన్నికలు తర్వాత ఒక నెలరోజుల్లోపు అదనంగా చెప్పిన పరిహారం రూ.3.25 లక్షలు అందజేసి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని చౌటిపల్లె, గండ్లూరు, కొండాపురం, పెంజి అనంతపురం, ఏటూరు, తాళ్లప్రొద్దుటూరు, దత్తాపురం, కె.సుగు మంచిపల్లె ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సుఽధీ ర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్‌తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పరిహారం పూర్తిస్థాయిలో ఎన్నికల తర్వాత అందుతుందని ఎవరు అధైర్యపడవద్దని ఆయన నిర్వాసితులకు భరోసా కల్పించారు. చౌటిపల్లె, గండ్లరు, కొండాపురం పునరావాసకేంద్రాలల్లో తాగునీటి సమస్యకు సీపీడబ్ల్యూస్కీం కింద శాశ్వత పరిష్కారం చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. రెండేళ్లు కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల సమయంలో ఏ హామీలు జగనన్న చెప్పారో అన్ని హామీలను అమలు చేసి చూపించారన్నారు. అదే చంద్రబాబు 2014లో ఎన్నికల ముందు బీజేపీ, జనసేన , టీడీపీ కలసి పోటీ చేసి.. రైతులకు రుణమాఫీ ,డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఏ ఒక్క హామి అమలు చేయలేక పోయారన్నారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం గమనించి ఓటు వేయాలన్నారు. షర్మిళమ్మ చంద్రబాబు కుట్రలో భాగమై తమపై విమర్శలు చేస్తున్నారని.. దీనిని ఆమె విజ్ఞతకే వదిలేస్తామన్నారు. తప్పొప్పులు అన్ని ఆమెకు తెలుసన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కాలని చూస్తున్న చంద్రబాబు నాయుడుని తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్యాన్‌గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనను, ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గండికోట నిర్వాసితులకు డీకేటీ పట్టాలు ఇప్పిస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పార్టీ గుర్తుతో గెలిచిన ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో వివేకానందరెడ్డికి ఓటు వేయలేదన్నారు. వైఎస్ కుటుంబం ఆదరణతో రాజకీయంగా ఎదిగి ఇప్పుడేమో ఆ కుటుంబాన్ని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. దేవగుడి కుటుంబం ఆర్థికంగా ఎదుగుదల కోసం ఎన్ని పార్టీలైనా మారుతారు అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హామీలు చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఆయా ముంపు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గండికోట నిర్వాసితులకు నెలరోజుల్లోపుఅదనపు పరిహారం చెల్లింపు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి -
టీడీపీది నీచ రాజకీయం
మైదుకూరు : రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ నీచమైన రాజకీయం చేస్తోందని కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ ఆరోపించారు. గురువారం ఆయన మైదుకూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూడా చంద్రబాబే నడిపిస్తున్నారని ఈసందర్భంగా హఫీజ్ ఖాన్ ఆరోపించారు. ఒక వైపు బీజేపీ ఓటు బ్యాంకు కావాలనుకుంటూనే మరో వైపు కాంగ్రెస్ పార్టీ ద్వారా ముస్లింల ఓట్లను చీల్చే కుట్రచేస్తున్నాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ముస్లింలంతా గ్రహించి చంద్రబాబు కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బాబు మోసపూరిత మాటలనూ ముస్లింలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. నాలుగు శాతం రిజర్వేషన్‌ను కాపాడుకోవాలంటే.. ముస్లిం యువతకు భవిష్యత్తును ఇచ్చే నాలుగు శాతం రిజర్వేషన్‌ను కాపాడుకోవాలంటే ముస్లింలంతా వైఎస్సార్సీపీకి ఓటేసి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే అబ్దుద్ హఫీజ్ ఖాన్ కోరారు. ఎన్ఆర్సీని రాష్ట్రంలో లేకుండా చూడాలన్నా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి చేసిన తీర్మానాన్ని కాపాడుకోవాలన్నా, యూనిఫాం సివిల్ కోడ్‌ను ఎదుర్కోవాలన్నా జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మైనారిటీలకు చంద్రబాబు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్‌రెడ్డి రూ.21వేల కోట్లతో విద్య, వైద్యం, గృహ వసతిని కల్పిస్తూ, మహిళా సాధికారతతో మైనారిటీలకు ఎంతో మేలు చేశారని వివరించారు. వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ మదీనా దస్తగిరి, అన్నలూరు సర్పంచ్ ఎం.శ్రీనివాసులరెడ్డి, ఖాసీం, అజంతుల్లా, బాగ్ బాషా, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ ఖాన్ -
‘ములాఖత్’ వేళల్లో మార్పు
కడప అర్బన్: రాష్ట్ర జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయం అధికారులు సవరించిన ఉత్తర్వుల మేరకు ఎండతీవ్రత, తీవ్ర వడగాల్పులు, పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా ఖైదీల ములాఖత్ వేళల్లో మార్పు తీసుకొచ్చినట్లు కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ ఐ.ఎన్.హెచ్ ప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప కేంద్రకారాగారంలోని ఖైదీలకోసం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ‘ములాఖత్’ (ఇంటర్వ్యూ)లో కలవొచ్చని..జూన్ 15 వరకు ఈ మార్పులు కొనసాగుతాయని వివరించారు. 6న జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలు కడప స్పోర్ట్స్: కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలోని నెట్స్ కేంద్రంలో ఈనెల 6వ తేదీ ఉదయం జిల్లాస్థాయి అండర్–23, అండర్–19 పురుషుల విభాగం క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ (సీఏవైడీ) కార్యదర్శి అవ్వారు రెడ్డిప్రసాద్ తెలిపారు. అండర్–23 ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2001 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. అండర్–19 విభాగం ఎంపికలకు 2005 సెప్టెంబర్ 1 తర్వాత పుట్టినవారై ఉండాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, స్టడీ సర్టిఫికెట్, పదోతరగతి మార్కులిస్టు, పాన్‌కార్డు, ఒరిజినల్‌తో పాటు ఒకసెట్ జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని సూచించారు. బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ ఫలితాలు విడుదల వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం బీఈడీ, ఎంఈడీ 3వ సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను వైవీయూ వీసీ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వై.పి. వెంకటసుబ్బయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలిసి తన ఛాంబర్ లో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలకు 2,485 విద్యార్థులకు గాను 2,322 మంది హాజరయ్యారని, అందులో 1,964 (84.58 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంఈడీ మూడో సెమిస్టర్ పరీక్షలకు 64 మంది పరీక్షలు రాయిగా 55 (85.94 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. సహాయ పరీక్షల నియంత్రణ అధికారి డా.గంగయ్య, సీడీసీ డీన్ ఆచార్య రఘుబాబు పాల్గొన్నారు. ఆన్లైన్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి కడప కోటిరెడ్డిసర్కిల్: నిరుద్యోగ యువత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ పిలుపునిచ్చారు. గతంలోలాగా క్యూ లైన్లో నిలబడకుండా నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉత్తీరులలైన అభ్యర్థులు ఎంప్లాయ్మెంట్ పోర్టల్‌లో ఫోన్ నెంబరు, ఆధార్‌కార్డు, మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అయి పూర్తి వివరాలను తమ ఇంటినుంచే మొబైల్లోనే రిజస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులకు వారి మెయిల్ ద్వారా జాబ్‌మేళా వివరాలు, ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. బందోబస్తుపై దిశానిర్దేశం బద్వేలు అర్బన్ : పక్కా ప్రణాళితో ఎన్నికల బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ హాలులో గురువారం నియోజకవర్గ పరిధిలోని సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. మద్యం, నగదుతో ఓటర్లను ప్రలోభ పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రబుల్మాంగర్లు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. -
No Headline
కడప నగరం ఎన్జీఓ కాలనీలో గల ఒక బ్యాంకు ముందు కూర్చున్న ఈ వృద్ధురాలి పేరు మరియమ్మ. స్థానిక చిన్నచౌక్‌లో నివసిస్తోంది. బ్యాంకు తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని ఉదయం 9 గంటలకే వచ్చి కూర్చుంది. అవ్వా..ఇంత తొందరగా ఎందుకొచ్చావు..? అని అటుగా వచ్చిన ఒక వ్యక్తి అడిగాడు. పింఛన్ కోసం వచ్చాను నాయనా...ఇంతకు ముందు వలంటీర్లు ఇంటి కాడికే వచ్చి లెక్క ఇచ్చేవాళ్లు. ఇప్పుడేమో..మా లెక్క బ్యాంకులో వేశారంట. మళ్లా ఎండపెడతాదని ముందుగానే వచ్చాను. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పింఛన్ లెక్క కోసం చాల కట్టపడ్డాం. ఇప్పుడు కూడా ఆ బాబే అడ్డుపడ్డారని తెలిసిందని నిట్టూర్చింది. -
No Headline
ఈ చిత్రంలో భార్య సాయంతో పెన్షన్ తీసుకునేందుకు మడకలవారిపల్లె యూనియన్ బ్యాంకుకు వచ్చిన ఈ వ్యక్తి పేరు ఎన్.పెంచలయ్య. పట్టణంలోని ఆరోగ్యపురంలో నివాసం. కొన్నేళ్లుగా పక్షవాతంతో కాలు చచ్చుపడిపోయి ఇంటి వద్దనే వలంటీర్ సాయంతో పెన్షన్ పొందుతుండేవాడు. చంద్రబాబు పుణ్యమా అని వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలిపివేయడంతో బ్యాంకు వద్దకు వచ్చి పెన్షన్ తీసుకునేందుకు చాలా కష్టమవుతుందని, మాలాంటి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని మండిపడుతున్నాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తుండేవారు. ఇప్పుడు సచివాలయానికి వెళితే బ్యాంకు అకౌంట్లో పడుతుందని చెప్పారు. ఆశగా బ్యాంకు వద్దకు వెళితే బ్యాంకులో కూడా జమ కాలేదని చెప్పారు. అంతదూరం ఎండపొద్దున తిరగాలంటే ఇబ్బందిగా ఉంది. పెన్షన్ కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. మాలాంటి ముసలోళ్లను ఇబ్బందులు పెడితే చంద్రబాబుకు ఏమి వస్తుంది. – సుబ్బమ్మ, మడకలవారిపల్లె మా ఉసురు తగులుతుంది ఈ వయస్సులో ఇంటి నుంచి బయటికి రావాలంటేనే ఎండలంతో భయంగా ఉంది. గతంలో జగను పుణ్యమా అని వలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చినప్పుడు బాగుండేది. ఉదయం 9 గంటలకు వస్తే 12 గంటలకు పెన్షన్ తీసుకున్నా. చంద్రబాబుకు మాలాంటి ముసలోళ్లపైన పగ ఎందుకో. మా ఉసురు ఊరికే పోదు. –లక్షుమ్మ, చింతపుత్తాయపల్లె కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ గురువారం రెండవ రోజుకు చేరింది. 2,67,492 పింఛన్లకు గాను రూ.79.10 కోట్లు అందజేయాలి. మొత్తం పింఛన్లలో 1,87,103 పింఛన్లు బ్యాంకుల ఖాతాల ద్వారా అందజేస్తారు. మిగిలిన 80,389 పింఛన్లు సచివాలయాల ద్వారా అందించడానికి చర్యలు చేపట్టారు. మొదటి రోజు బ్యాంకులకు సెలవు కావడంతో అధిక శాతం మంది పింఛన్ల సొమ్మును పొందలేకపోయారు. బ్యాంకుల వద్దకు పరుగులు... వలంటీర్లు లేకపోవడంతో అవ్వాతాతలకు ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వం పింఛన్ సొమ్మును బ్యాంకుల ఖాతాలకు జమ చేసినప్పటికీ.. పండుటాకులు దూర ప్రాంతాల నుంచి బ్యాంకుల వద్దకు రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి బ్యాంకులకు 10–15 కిలో మీటర్లు దూరం వెళ్లాలి. ఏ ఆటోలో వెళ్లినా తోడుకు ఎవరో ఒకరిని తీసుకెళ్లాలి. రానుపోను చార్జీలకే వందలు పెట్టాల్సి వచ్చింద ని వృద్ధులు వాపోయారు. పైగా ఈ ఎండల్లో తిరగొద్దని వైద్యులు సూచిస్తున్నారు. పింఛన్ల కోసం మండుటెండల్లో వృద్ధులు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు నెలలకే ఇలా.. కేవలం రెండు నెలల పాటు పింఛన్ల పంపిణీకి వలంటీర్లను విధుల నుంచి దూరంగా ఉంచారు. ఆ ప్రభావం పింఛన్లపై భారీగా పడింది. వలంటీర్లు ఉన్నప్పుడు ఎప్పుడు ఏమి జరిగేది. పింఛన్ల సొమ్ము ఎప్పుడిచ్చేది. అన్ని వివరాలు లబ్ధిదారులకు, స్ధానికులకు తెలిసేది. వలంటీర్లు లేకపోవడంతో ఏమి జరుగుతుందో తెలియని పరిస్ధితి ఏర్పడింది. వలంటీర్లు ఉండి ఉంటే మొదటి రోజే పింఛన్ల పంపిణీ 94 శాతం పైగా నమోదు అయ్యేది. ప్రస్తుత పింఛన్ పంపిణీ విధానంఅవ్వాతాతలకు నాటి చంద్రబాబు పాలనలో కష్టాలను గుర్తుకు తెచ్చింది. ఈ చిత్రంలో మేనల్లుడు అయిన రామారావు మోసుకుని వస్తున్న వృద్ధురాలి పేరు పెండ్లిమర్రి లక్షుమ్మ. వయోభారంతో కాళ్లు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో పెన్షన్ పొందేందుకు గత నెల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వృద్ధురాలు వాపోయింది. మాలాంటోళ్లను ఇబ్బంది పెట్టడం మంచిదా అని ప్రశ్నించింది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019