Yadadri
-
స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం ప్రధానాలయంలోని ముఖ మండపంలో స్వస్తివాచనం, విశ్వక్సేనారాధనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ముఖ మండపంతో పాటు గర్భాలయంలో, ఆలయ పరిసరాల్లో పుణ్యాహ వాచనం జరిపించారు. ప్రధానాలయ ముఖ మండపం నుంచి యాగశాలకు ఊరేగింపుగా శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక సేవపై తీసుకువచ్చారు. అనంతరం పంచ కుండాత్మక యాగానికి అగ్ని ప్రతిష్ఠాపన చేసి హోమాధి పూజలు జరిపించారు. అదేవిధంగా రాత్రికి శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, ద్వారాది కుంభార్చన, బింబ, కుంభ, మండల, అగ్ని ఆరాధన, మూర్తి మంత్ర హోమాలు, వారుణానువాక హోమం చేసి, జలాధివాసం నిర్వహించారు. ఫ యాదగిరి క్షేత్రంలో ప్రారంభమైన మహా కుంభాభిషేక సంప్రోక్షణ 23న సీఎం రాక యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురానికి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 23న రానున్నారు. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు కూడా రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో బుధవారం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ యాదగిరికొండ కింద హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. -
కలెక్టర్‌కు ఆహ్వానం
భువనగిరిటౌన్: కలెక్టర్ హనుమంతరావును యాదగిరిగుట్ట ఆలయ ఈఓ భాస్కర్‌రావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలిభువనగిరి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశ నోడల్ పర్సన్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలను ఎంసీహెచ్ కిట్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి మహిళా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించేలా ప్రోత్సహించాలన్నారు. ప్రసవం అనంతరం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ యశోధ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శిల్పిని, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాయిశోభ, డిమో అంజయ్య, ఆశ నోడల్ అధికారి సత్యవతి పాల్గొన్నారు. గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా చూడాలియాదగిరిగుట్ట రూరల్: వేసవి నేపథ్యంలో గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా చూడాలని డీఎల్పీఓ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూర్ ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల చివరి వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు వంద శాతం పూర్తి చేయాలన్నారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. సమావేశంలో ఎంపీఓలు సలీమ్, వెంకటేశ్వర్లు, కిషన్, చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. స్వర్ణగిరిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలుభువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, సాయంత్రం భగవదజ్ఞ, రక్షాబంధనం నిర్వహించారు. అంతకు ముందు సుమారు 4వేల మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ మానేపల్లి రామారావు, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
ఏడాదికాలంగా ఎదురుచూపులు
భువనగిరి: జిల్లా కేంద్రంలో క్రీడా మైదానాలు, పరికరాలు లేక విద్యార్థులు, యువత ఆటలకు దూరమవుతున్నారు. ఈనేపథ్యంలో మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం భువనగిరి మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంజూరు చేసింది. ఈమేరకు 2023 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించింది. అదే నెలలో అధికారులు డీపీఆర్ సైతం రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. 10 ఎకరాల స్థలం కేటాయింపు జిల్లా కేంద్రంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరారు. స్పందించిన గత ప్రభుత్వం అప్పట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంజూరు చేసింది. ఇందుకోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్‌ను కోరింది. అయితే అప్పట్లో స్థల కేటాయింపు జరగలేదు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో ఽఅధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఈమేరకు రూ. 9.50 కోట్లు విలువ చేసే స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాయగిరి, గూడూరు, ముత్తిరెడ్డిగూడెం ప్రాంతాల్లో స్థలం కోసం పరిశీలించారు. చివరికి రాయగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 259లో 10 ఎకరాల స్థలాన్ని యువజన క్రీడల శాఖకు కేటాయించారు. రూ. 33.50 కోట్లతో ప్రతిపాదనలు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలం కేటాయించిన అనంతరం డీపీఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు రూ.33.50 కోట్ల ఖర్చుతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టవచ్చని డీపీఆర్ సిద్ధం చేశారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు, అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేశారు. ఈ డీపీఆర్‌ను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఇప్పటి వరకు నిధులు మాత్రం మంజూరు కాలేదు. డీపీఆర్ అందజేశాం భువనగిరికి మంజూరైన మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. స్థలం కూడా కేటాయించబడింది. – ధనుంజయనేయులు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఫ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంజూరు కాని నిధులు ఫ స్థలం కేటాయించిన ప్రభుత్వం ఫ రూ.33.50 కోట్లతో ప్రతిపాదనలు -
ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి
సాక్షి,యాదాద్రి: వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. జిల్లాలో మంచి నీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సరఫరా పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తాగు నీటి సరఫరా నిమిత్తం మిషన్ భగీరథ ద్వారా అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఏదైనా నివాస ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వెంటనే, ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఏర్పడితే గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గంగాధర్, చీఫ్ ఇంజనీర్ లలిత, జెడ్పీసీఈఓ శోభారాణి, మిషన్ భగీరథ ఎస్ఈ కృష్ణయ్య, ఈఈ కరుణాకరన్, ఈఈ లక్ష్మీనారాయణ, డీపీఓ సునంద, డీఈలు, డీఎల్పీఓలు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
భక్తులకు సదుపాయాలు కల్పించాలి
యాదగిరిగుట్ట: కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయ అధికారులు సదుపాయాలు కల్పించాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. సంప్రోక్షణ ఉత్సవాల్లో భాగంగా ఈ సందర్భంగా కొండపైన గల దేవాలయ కార్యాలయంలో కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భాస్కర్‌రావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. యాగశాల నిర్వహణ, భక్తులకు రవాణా సదుపాయం, దర్శనం ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీ, మెడికల్ క్యాంప్, పరిశుభత్ర, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అంతకు ముందు కొండ కింద హెలిపాడ్ స్థలం, కొండపైన స్వాగత తోరణానికి ఇరువైపులా వేస్తున్న రంగులు, ఘాట్‌రోడ్డు, ప్రధానాలయాన్ని పరిశీలించారు. ఫ దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ -
తాగునీరు వస్తుందా..
ఫ భువనగిరి మున్సిపాలిటీలో పర్యటించిన కలెక్టర్ హనుమంతరావు భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీ హనుమాన్‌వాడలోని 7వ వార్డులో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ గంగాధర్‌తో కలిసి బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నాయా, తాగునీరు వస్తుందా, రేషన్ బియ్యం ప్రతి నెలా ఇస్తున్నారా, గ్యాస్ సబ్సిడీ వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. నర్సింహ అనే వ్యక్తిని గ్యాస్ సబ్సిడీ రావడం లేదని చెప్పగా.. వెంటనే సంబంధిత సివిల్ సప్లయ్ అధికారికి ఫోన్ చేసి సబ్సిడీ వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు. స్థానిక మహిళల అభ్యర్థన మేరకు కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈ కొండల్ రావు, మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ రజిత ఉన్నారు. -
తవ్వేస్తాం.. దోచేస్తాం!
సాక్షి, యాదాద్రి: జిల్లాలో మూసీ, ఆలేరు, బిక్కేరు, శామీర్పేటతోపాటు పలు వాగులు, కాళేశ్వరం క్వారీల నుంచి యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో ట్రాక్టర్ల సాయంతో ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్‌చేసి హైదరాబాద్, జనగామ, భువనగిరి వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వాగుల నుంచి ఇసుక తరలింపు మూసీ వెంట ఉన్న బీబీనగర్, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని గ్రామాల వాగుల నుంచి నుంచి రాత్రి సమయంలో ఇసుకను తోడేస్తున్నారు. ఆలేరు, బిక్కేరు వాగుల వెంట ఉన్న రాజాపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని గ్రామాల నుంచి వందలాది ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న వాగులతోపాటు గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. అదేవిధంగా భువనగిరి, ఆలేరు, మోటకొండూరు, యాదగిరిగుట్ట, బీబీనగర్, బొమ్మలరామారం, ఆలేరు మండలాల్లో ఇసుక డంపులు ఏర్పాటు చేస్తున్నారు. వాగుల నుంచి దొంగచాటుగా తెస్తున్న ఇసుకను, కాళేశ్వరం నుంచి తెస్తున్న ఇసుకను ఒక చోట డంప్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఈ రెండు రకాల ఇసుకను కలిపి గోదావరి ఇసుక అని సరఫరా చేసి వినియోగదారులను మోసం చేస్తున్నారు. అనుమతి కంటే ఎక్కువ మొత్తంలో రవాణా ప్రైవేట్ భవన నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం ట్రాక్టర్ యజమానులు రెవెన్యూ శాఖ నుంచి అనుమతి తీసుకుంటున్నారు. ఈమేరకు స్థానిక వాగుల నుంచి తమకు అనుమతించిన రోజుల్లోనే పర్మిట్ పొందిన ట్రిప్పుల కంటే ఎక్కువ మొత్తంలో ఇసుకను రవాణా చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా వందల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. మూసీ పరిధిలో ఉన్న రామన్నపేట, వలిగొండ, బీబీనగర్ మండలాల నుంచి రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను సరఫరా చేస్తున్నారు. దాడులు చేస్తున్నా ఆగని దందా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు దాడులు ప్రారంభించారు. ఈనెల 14నుంచి ఓవర్‌లోడ్ ఇసుక లారీలు, ఇసుక డంప్‌లపై దాడులు నిర్వహిస్తున్నారు. పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగించి, జరిమానాలు విధించారు. అయినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా సాగిస్తే కేసులు నమోదు చేస్తాం అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలు, వాల్టా చట్టానికి తూట్లు పొడిచే విధంగా ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే రాచకొండ పరిఽధిలో ఇసుక అక్రమ తరలింపు కేసులు 250 నమోదు చేశాం. 50 వేల టన్నుల ఇసును సీజ్‌చేశాం. తక్కువ ట్రిప్పులకు పర్మిషన్ తీసుకుని ఎక్కువ ట్రిప్పులు కొడుతున్న వారిపై నిఘా పెడతాం. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలను సీజ్ చేస్తాం. ఇసుక డంపులపై దాడులు చేసి వాటికి సంబంఽధించిన వారిపై చర్యలు తీసుకుంటాం. – సుధీర్‌బాబు, రాచకొండ సీపీఫ యథేచ్చగా ఇసుక దందా సాగిస్తున్న అక్రమార్కులు ఫ అనుమతి పొందిన ట్రిప్పుల కంటే ఎక్కువ మొత్తంలో ఇసుక రవాణా ఫ రహస్య ప్రాంతాల్లో డంప్‌చేసి హైదరాబాద్, జనగామ, భువనగిరికి తరలింపు ఫ వాగులు లేని ప్రాంతాల్లో మట్టిని నీటితో శుభ్రం చేసి ఇసుకను తీసి అమ్ముతున్న వ్యాపారులు వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని.. కాళేశ్వరం రీచ్‌లనుంచి ఇసుక ఓవర్ లోడ్ తగ్గడంతో గిట్టుబాటు కావడంలేదని వ్యాపారులు ఽటన్ను ధర పెంచేశారు. మరో వైపు వాగుల నుంచి తెస్తున్న ఇసుక ధర కూడా పెరిగింది. ఈ క్రమంలో వాగులు లేని ప్రాంతాల్లో ట్రాక్టర్లలో మట్టిని తెచ్చి నీటితో శుభ్రం చేసి ఇసుకను తీసి అమ్ముతున్నారు. యాదగిరిగుట్ట, భువనగిరి, బొమ్మరాలరామారం, భువనగిరి, బీబీనగర్, మోటకొండూరు మండలాల్లో ఈ ఫిల్టర్ ఇసుక తయారు చేసి విక్రయిస్తున్నారు. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని నిజమైన ఇసుక వలే విక్రయించి మోసం చేస్తున్నారు.