Sakshi News home page
Advertisement

Top Stories

వింతలు విశేషాలు

Advertisement

Videos

View all

Lifestyle

View all
 మాట్లాడుతున్న సప్తగిరి, పక్కనే దుర్గాపండ తదితరులు  - Sakshi
పద్మపూర్‌ను ఎన్‌ఏసీగా గుర్తించాలి

రాయగడ: జిల్లాలోని పద్మపూర్‌ను ప్రభుత్వం ఎన్‌ఏసీగా గుర్తించాలని కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉలక డిమాండ్‌ చేశారు. స్థానిక కాంగ్రెస్‌ భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా ఎక్కువగా ఉన్నటువంటి పద్మపూర్‌ అభివృద్ధి బాటలో పయనించాలంటే ఎన్‌ఏసీ గుర్తింపు అనివార్యమన్నారు. దీనికోసం కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ, ఇటీవల ప్రకటించిన ఎన్‌ఏసీ జాబితాలో పద్మపూర్‌ లేకపోవడం విచారకరమన్నారు. అలాగే కాసీపూర్‌ సమితి పరిధిలోని జొడియా తెగలను ఆదివాసీలుగా గుర్తించి, వారిని 8వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. లోక్‌సభ సమావేశాల్లో తాను ఇదే విషయమై ఎన్నోసార్లు ప్రస్తావన చేసినప్పటికీ జొడియా తెగలను విస్మరించడం సమంజసం కాదన్నారు. ఆదివాసీ గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందుకోలేపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొరాపుట్‌ నుంచే పోటీ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కొరాపుట్‌ లోక్‌సభ స్థానం నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తానని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. టిక్కెట్టు కోసం ఎంతమంది పైరవీలు చేసినా అధిష్టానం తనకే టిక్కెట్టు కేటాయిస్తుందనే నమ్మకంతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించానని వెల్లడించారు. కొరాపుట్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు 12 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేశారని, వారిలో తన తమ్ముడు కూడా ఉన్నారన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం తథ్యం త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయం తథ్యమని సప్తగిరి అన్నారు. రెండు దశాబ్ధాలకు పైగా అధికారంలో ఉన్నటువంటి బీజేడీపై ప్రజలు విరక్తితో ఉన్నారన్నారు. అధికారం చేపట్టేందుకు సరిపడా సీట్లు ఈసారి గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. తన తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి రామచంద్ర ఉలక ఈ జిల్లాకు, రాష్ట్రానికి చేసిన సేవలే తనను గెలిపిస్తాయని పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతంలో ఆదివాసీల అభ్యున్నతి, విద్యా వికాసానికి ఆయన చేసిన సేవలు అపారమన్నారు. సమావేశంలో పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్‌ పండ, సునీల్‌ పండ, అస్లామ్‌ ఖాన్‌, అప్పల స్వామి కడ్రక, పార్టీ సీనియర్‌ నాయకుడు చిన్నారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉలక డిమాండ్‌

పర్లాకిమిడి: కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ చంద్రశేఖర సాహు తదితరులు  - Sakshi
రైల్వేస్టేషన్ల అభివృద్ధికి చర్యలు

రాయగడ: అమృత్‌ భారత్‌ స్టేషన్‌ యోజన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్లు, 1500 ఆర్‌వోబీల అభివృద్ధి పనులకు పీఎం నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉలక, రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి, ఎస్పీ హరీష్‌ బిసి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ పట్నాయక్‌, బసంత కుమార్‌ ఉలక, కాళీరాం మాఝి తదితరులు పాల్గొన్నారు. జయపురం: అమృత్‌ భారత్‌ పథకం కింద స్థానిక రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యుడు గౌతమ సామంతరాయ్‌ మాట్లాడుతూ.. జయపురం రైల్వే స్టేషన్‌ను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. స్టేషన్‌కు ఒక ప్రవేశ మార్గంతో పాటు ఒక వెళ్లే మార్గం ఏర్పాటు, అలాగే క్యాంటిన్‌, సౌచాలయం, విశ్రాంత గదులు, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. పర్లాకిమిడి: అమృత్‌ భారత్‌ స్టేషన్‌ యోజన పథకం కార్యక్రమాన్ని పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి బరంపురం ఎంపీ చంద్రశేఖర సాహు, ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, ఈస్టుకోస్టు రైల్వే డివిజనల్‌ మెకానికల్‌ ఇంజినీరు రుద్రరంజన్‌ మిశ్రా, శ్రీకాకుళం రైల్వే ఇంజినీర్‌ బీవీఎస్‌ మూర్తి, డీఈఈ అబనేందు రాయ్‌ తదితరులు పాల్గొన్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ యోజనకు పీఎం మోదీ శంకుస్థాపన

రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌తో మాట్లాడుతున్న ఎంపీ మార్గాని భరత్‌రామ్‌  - Sakshi
రైల్వేస్టేషన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోండి

రైల్వే జీఎంఎంపీ మార్గాని భరత్‌రామ్‌ విజ్ఞప్తి ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల (మెయిన్‌, గోదావరి) అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ను ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ కోరారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన్ను ఎంపీ కలిశారు. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని వివిధ అంశాలను ప్రస్తావించారు. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌కు తూర్పువైపు మరో ప్లాట్‌ఫాం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సైడింగ్స్‌ ప్రాంతాన్ని అత్యాధునిక సదుపాయాలతో కూడిన మల్టీ మోడల్‌ ట్రాన్సిట్‌ హబ్‌గా మార్చడం వల్ల రైల్వే శాఖకు ఆర్థిక వనరులు సమకూరతాయన్నారు. పశ్చిమాన గూడ్స్‌షెడ్‌ ఏరియాలో ఖాళీస్థలాన్ని వాణిజ్యాభివృద్ధికి వినియోగిస్తే బాగుంటుందని సూచించారు. చిత్రాంగి ప్యాలెస్‌ను ’స్వచ్ఛసుందర్‌’ నగరాభివృద్ధిలో భాగంగా మార్చి ఉపయోగపడేలా చూడాలన్నారు. ఏపీ ప్రభుత్వం హేవలాక్‌ సమీపంలోని రైల్వే భూమిని కోరుతోందన్నారు. పర్యాటకం, రహదారి అభివృద్ధికి వీఎల్‌ పురంలోని భూమిని మున్సిపల్‌ కమిషనర్‌ ఎంపిక చేశారన్నారు. ఇది తుది దశకు చేరుకుందన్నారు. అనపర్తి, కేశవరం లెవెల్‌ క్రాసింగ్‌ (ఎల్సీ)ల వద్ద ఆర్‌ఓబీలు నిర్మించాలని సూచించారు. 2020–21లో కడియం – ద్వారపూడి మధ్య కేశవరం (ఎల్‌ సీ404) ఆర్‌ఓబీ మంజూరుకు అగ్రిమెంట్‌ ఖరారైన విషయాన్ని గుర్తు చేశారు. అనపర్తి, నిడదవోలు రైల్వేస్టేషన్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ హాల్ట్‌ ఇవ్వాలని కోరారు. గోదావరి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఎఫ్‌ఓబీ)ని చాలాకాలం క్రితం నిర్మించారన్నారు. దక్షిణం నుంచి ఉత్తరం వైపు వరకూ పాదచారుల సౌకర్యార్థం నిర్మించిన ఎఫ్‌ఓబీ ప్రస్తుతం స్టేషనుకు వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఉపయోగపడుతోందన్నారు. ఇక్కడ ఎఫ్‌ఓబీ నిర్మించాలని కోరారు. ప్రధాన రైల్వేస్టేషన్‌ గూడ్స్‌షెడ్‌ వద్ద ఆర్వోబీ మంజూరు చేయాలన్నారు. అన్నపూర్ణమ్మపేట ఎల్సీ 394 వద్ద ఆర్‌ఓబీ నిర్మించాలని కోరారు. రాజమహేంద్రవరంలో హౌరా– శ్రీసత్యసాయి నిలయం ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ –రాజమండ్రి ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌–పూణే ఎక్స్‌ప్రెస్‌, చైన్నె– జల్వాయిగుడి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, కామాఖ్య–యశ్వంత్‌పూర్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌, పుదుచ్చేరి–హౌరా ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని కోరారు.

- - Sakshi
అమో ఆస్పత్రుల ప్రారంభం

మాట్లాడుతున్న ఎంపీ చంద్రశేఖర సాహు పర్లాకిమిడి: స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి (డీహెచ్‌హెచ్‌), చంద్రగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 5టీలో భాగంగా వివిధ వార్డులు, అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వర్చువల్‌గా సోమవారం ప్రారంభించారు. స్థానికంగా శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ చంద్రశేఖర సాహు హాజరయ్యారు. పర్లాకిమిడి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.5,68,81,000 రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌, అవుట్‌ పేషెంట్‌ వార్డు, చంద్రగిరి (మోహన) సీహెచ్‌సీలో వివిధ పేషెంట్‌ వార్డులు ప్రారంభించారు. మొత్తంగా రాష్ట్రంలో 66 ఆస్పత్రులు, సువర్ణపూర్‌లో 300 పడకల జిల్లా కేంద్ర ఆస్పత్రి, జర్సుగుడలో 100 పడకల బీఎంఆర్‌సీ ఆస్పత్రులను ప్రజలకు అంకితం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్మృతి రంజన్‌ ప్రధాన్‌, ఎస్పీ స్వాతి ఎస్‌.కుమార్‌, సీడీఎంవో డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ పాత్రో, మున్సిపల్‌ చైర్మన్‌ నిర్మలా శెఠి, డీఆర్‌డీఏ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి గుణనిధి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Web Stories

View all

Photos

View all

Funday

View all
 క్రీడాకారులకు బహుతులు అందిస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు, సర్పంచ్‌ బత్తిని సృజన  - Sakshi
‘క్రీడాకారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి’

వజ్రపుకొత్తూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలకు పెద్ద పీట వేస్తోందని, క్రీడాకారులు క్రీడల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు ఆ కాంక్షించారు. మండలంలో గల పెదవంక– బా తుపురంలో గత మూడు రోజులుగా జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 28 జట్లు పాల్గొనగా సచిన్‌ స్పోర్ట్స్‌ ( శ్రీకాకుళం) జట్టు విజేతగా నిలిచింది. యువతరం సేవా సమితి (పూండి) జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానంలో బాతుపురం, చతుర్ధి స్థానంలో కంచిలి జట్లు నిలిచాయి. విజేతలకు షీల్డ్‌లతో పాటు రూ.15 వేలు, రూ. 10 వేలు, రూ.7500, రూ.5 వేల బహుమతులను మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా వైఎస్సార్‌ సీపీ సాంస్కృతిక విభా గం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్‌, స్థానిక సర్పంచ్‌ బత్తిని సృజన చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు బత్తిని లక్ష్మినారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు బత్తిని రామారావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చెల్లూరి తాతారావు, ఇరోతు లక్ష్మణరావు, బత్తిని యోగేశ్వరరావు, యువకులు ఉన్నారు.

టెండర్‌ ప్రక్రియలో పాల్గొన్న దుర్గగుడి చైర్మన్‌ రాంబాబు, ఆలయ అధికారులు  - Sakshi
రింగు తిరిగింది

తలనీలాల వేలంఈ నెల ఒకటి నుంచి దేవస్థానం వద్దే.. జనవరి 31తో గత ఏడాది కాంట్రాక్టు పూర్తయింది. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను దేవస్థానమే భద్రపరుస్తోంది. దుర్గాఘాట్‌ ఎదురుగా ఉన్న కేశఖండన శాలలో తలనీలాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హుండీల్లో భద్రపరుస్తున్నారు. తలనీలాలను భద్రపరచడం, అవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకు దేవస్థాన ఈఓ ఓ బృందాన్ని నియమించారు. ఈ బృందంలోని కమిటీ సభ్యులైన ఏఈఓలు చంద్రశేఖర్‌, ఎన్‌.రమేష్‌బాబు, పర్యవేక్షకులు పి.సునీత, టి.గుర్రాజు, ఎల క్ట్రీషియన్‌ ప్రసన్న, ఏఈ కుటుంబరావు, ధర్మకర్తల మండలి సభ్యులైన చింతా సింహాచలం, కట్టా సత్తెయ్యతో పాటు హోంగార్డు, సెక్యూరిటీ ఎస్‌ఓ, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. గతంలో తలనీలాలను భద్రపరిచే క్రమంలో పలు ఆరోపణలు, వివాదాలు చోటు చేసుకోవడంతో దేవస్థానం ఈ దఫా అటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు సమర్పించే తలనీలాల వేలం ‘రింగు’లు తిరుగుతోంది. భక్తులు సమర్పించిన తలనీలాలను తక్కువ ధరకే దక్కించుకు నేందుకు కాంట్రాక్టర్లు రింగై అంతర్జాతీయ మార్కెట్‌లో రేటు లేదని సాకుగా చూపుతూ తక్కువ ధరకు టెండర్లు వేస్తున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో దేవస్థానం ఆరు పర్యాయాలు టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. మూడు సార్లు టెండర్‌ ప్రక్రియకే కాంట్రాక్టర్లు హాజరు కాలేదు. మరో మూడు సార్లు హాజరైనా తాము అనుకున్న రేటుకే టెండర్‌ దక్కించుకోవాలని పావులు కదిపారు. దీంతో దేవస్థానం ఐదు సార్లు టెండర్‌ ప్రక్రియను నిలిపివేసింది. ఆరో దఫా సోమవారం టెండర్‌ ప్రక్రియ నిర్వహించగా, గత ఏడాది కంటే సుమారు రూ.2.27 కోట్ల తక్కువకు అంటే రూ.5.61 కోట్లకు టెండరు దాఖలు చేశారు. దీంతో ఆరో దఫా కూడా టెండర్‌ ప్రక్రియ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది రూ.7.88 కోట్లు గడిచిన ఏడాదికి రూ.7.88 కోట్లు పలికిన తలనీలాలు టెండర్‌ ఈ ఏడాది పది శాతం పెంపుదలతో సుమారు రూ.8.50 కోట్లు పలుకుతుందని దేవ స్థానం భావించింది. ఈ మేరకు మూడు నెలల్లో ఆరు సార్లు టెండర్లను ఆహ్వానించింది. ఆన్‌లైన్‌, ఈ– టెండర్‌, బహిరంగ వేలం ప్రక్రియ ద్వారా టెండర్లు పిలిచింది. గత నెలలో నిర్వహించిన టెండర్‌ ప్రక్రియ సుదీర్ఘంగా సాగి రూ.5.30 కోట్లకు చేరింది. తాజాగా సోమవారం నిర్వహించిన టెండర్‌ ప్రక్రియలో దేవస్థానం పాటను రూ.8 కోట్లుగా నిర్ణయించింది. ఎనిమిది మంది కాంట్రాక్టర్లు ఈ వేలానికి హాజరయ్యారు. కాంట్రాక్టర్లు ఎవరూ పాటలో పాల్గొనక పోవడంతో రూ.7 కోట్లకు తగ్గించారు. అయితే రూ.4 కోట్ల నుంచి వేలం ప్రారంభించాలని కాంట్రాక్టర్లు కోరారు. చివరి సారిగా నిర్వహించిన వేలంలో రూ.5.30 కోట్ల వరకు ధర వచ్చిందని, అక్కడి నుంచి మాత్రమే పాటను తిరిగి ప్రారంభించే అధికారం తమకు ఉందని చెప్పి అక్కడి నుంచి పాటను ప్రారంభించారు. దీంతో కాంట్రాక్టర్లు పాటను క్రమంగా పెంచడంతో రూ.5.42 కోట్లకు చేరింది. దీంతో ఆలయ అధికారులు బహిరంగ వేలాన్ని నిలిపివేసి సీల్డ్‌ టెండర్‌ తెరిచారు. ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీస్‌ రూ.5.61 కోట్లకు టెండర్‌ దాఖలు చేసింది. గత ఏడాది కంటే రూ.2.27 కోట్ల మేర తక్కువగా ధరకు కోట్‌ చేయడంతో అధికారులు ఈ విషయాన్ని ఆలయ ఈఓ రామారావు దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ ఆదేశాల మేరకు వేలాన్ని ప్రస్తుతానికి నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. టెండర్‌ ప్రక్రియను ఆలయ చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఏఈఓ వెంకటరెడ్డి, సూపరింటెండెంట్‌ డి.వి.వి.సత్యనారాయణ, జగదీష్‌ పర్యవేక్షించారు. దుర్గగుడిలో ఆరో సారి టెండర్‌ ప్రక్రియ వాయిదా రూ.7.88 కోట్లు పలికినగత ఏడాది టెండర్‌ ఇప్పుడు రూ.2.27 కోట్ల తక్కువకు దాఖలు ధర పెంచేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

మహాశతావధానం నిర్వహిస్తున్న మాడుగుల నాగఫణిశర్మ - Sakshi
దుర్గా.. జయం జయం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): జయం.. దుర్గా.. అంటూ దుర్గమ్మను కీర్తిస్తూ ప్రఖ్యాత సహస్రావధాని డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ను ప్రారంభించారు. తెలుగు వారి సాహిత్య వైభవాన్ని ఆవిష్కరించే అవధానంలో డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ తెలుగు భాష మాధుర్యాన్ని చాటి చెప్పారు. ప్రతి పదంలోనూ తెలుగు ఔన్నత్యాన్ని వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ, ధర్మదాయ శాఖ, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఐదు రోజుల పాటు కొనసాగే ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ సోమవారం ప్రారంభమైంది. తొలుత 30 మంది పృచ్ఛకులతో దత్తపదిని ప్రారంభించి ఆ తరువాత సమస్యా పూరణం, వర్ణాలు, ఆశువులు, స్వరపది, మీ స్వరానికి నా పాట తదితర అవధాన ఘట్టాలను నిర్వహించారు. శ్రీదుర్గామల్లేశ్వరుల వైభవాన్ని చాటుతూ సాగిన అవధానం ఆద్యంతం ప్రేక్షకులను తన్మయులను చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సాహితీవేత్తలు పృచ్ఛకులుగా సంధించిన అంశాలకు అవధానిగా నాగఫణిశర్మ ధారణతో దీటుగా బదులిచ్చి ఆకట్టుకున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ పాలపర్తి శ్యామలానందప్రసాద్‌, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, డాక్టర్‌ కె.సౌజన్యలక్ష్మి, మా శర్మ, పి.వి.జ్యోతి, సింగం లక్ష్మీ నారాయణ, డాక్టర్‌ శామనపూడి వెంకటేశ్వరరావు వంటి సాహితీవేత్తలు అలరించారు. స్వరపదిలో భాగంగా సంగీత కళాకారుడు పోపూరి గౌరీనాథ్‌ ఆధ్వర్యంలో సంగీత కళాకారులు అడిగిన స్వరాలకు సైతం నాగఫణిశర్మ అవధాన ప్రక్రియలో బదులిచ్చి మెప్పించారు. కార్యక్రమంలో దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు. కవి నిరంతర లోకహితుడు కవి నిరంతర లోకహితుడని ద్విసహస్రావధాని డాక్టర్‌ మాడుగుల నాగఫణిశర్మ అన్నారు. కవి నుంచి వచ్చే సాహిత్యం కల్పవృక్షం వంటిదన్నారు. సమాజాన్ని జాగృతం చేసే సాహిత్యం అన్ని రకాలుగా లోకహితానికి బాసటగా నిలుస్తుందన్నారు. దుర్గమ్మ ఆలయం, ఏపీ ప్రభుత్వం ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావటం అభినందనీయమని పేర్కొన్నారు. ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ ప్రారంభం ఆద్యంతం దుర్గమ్మను కీర్తిస్తూ సాగిన కార్యక్రమం తరలివచ్చిన సాహితీవేత్తలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ వంటి ఐదు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు జాతి వైభవాన్ని చాటే సాధనాలని కొనియా డారు. అవధానం తెలుగు వారికి మాత్రమే ఉన్న గొప్ప ప్రక్రియ అని, అటువంటి ప్రక్రియను జగద్విఖ్యాతం చేసిన మాడుగుల నాగ ఫణిశర్మతో తాను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు. నాగఫణిశర్మ ప్రతి పదం సామాజిక స్పృహను కలిగించే సాధనమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు. ఆలయాలు కేంద్రబిందువులు కావాలి సాహిత్యం, సంస్కృతి, భాషా వికాసాలకు దేవాలయాలు కేంద్ర బిందువులుగా ఉండా లని అతిథిగా హాజరైన రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ ఆకాంక్షించారు. ‘శ్రీ దుర్గా సౌందర్యలహరి మహాశతావధానం’ అమ్మవారి కీర్తిని మరింతగా వివరిస్తూ పండిత, పామరులను సైతం అలరిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో మును ముందు మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు.

శలపాకలో లబ్ధిదారుకు ఇంటి పట్టా 
అందజేస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ  - Sakshi
పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాజులూరు: పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని శలపాకలో 10.80 ఎకరాల స్థలంలో శలపాక, గొల్లపాలెం, తణుకువాడ, బందనపూడి, మతుకుమిల్లి గ్రామాలకు చెందిన 436 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్‌ పోతుల గనిరాజు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న పథకాలు పేదల జీవితాలకు కొత్త వెలుగులు తెచ్చాయన్నారు. ఇందులో భాగంగానే గూడులేని ప్రతి పేదవానికి ఇళ్ల స్థలం అందించటానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా పేదల పక్షాన నిలిచి సీఎం జగన్‌ అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారని మంత్రి వేణు అన్నారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుత్తుల బుల్లిరాజు, జెడ్పీటీసీ సభ్యుడు వనుం వెంకట సుబ్బారావు, ఎంపీపీ మాత భారతి, వైఎస్సార్‌ సీపీ మండల బీసీ సెల్‌ కన్వీనర్‌ గుబ్బల ఏసురాజు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోతురాజు బాబూరావు, ఆర్‌ఎంసీ డైరెక్టర్లు ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి, దంగేటి అరుణ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు పితాని సుబ్రహ్మణ్యం, సత్తి శ్రీరామారెడ్డి, సమనాశి సోమన్న పాల్గొన్నారు.

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు - Sakshi
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు


 అధికారులతో కలెక్టర్ రఘునందన్‌రావు సమీక్ష        
 మొయినాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నారు. 3న చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో బుధవారం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు చిలుకూరు మహిళా ప్రాంగణంలోని డీఆర్‌డీఏ కార్యాయలంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల వారీగా ఏర్పాట్ల పనులను అప్పగిం చారు. ఆయా శాఖల అధికారులు పనులు వేగవంతం చేసిపటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచిం చారు.
 
 శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకుంటారని, ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆల య ప్రాంగణంలోనే ఓ మొక్కను నాటుతారని చెప్పారు. ఆలయంలో సుమారు 20-25 నిమిషాల పాటు సీఎం ఉంటారన్నారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసే బహిరంగసభ ప్రాంతంలో మొక్కలు నాటి ‘తెలంగాణ హరితహారం’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. సభ ముగింపు అనంతరం  సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటుతారని చెప్పారు. ఆ తర్వాత ఘట్‌కేసర్ మండలం నారపల్లికి చేరుకుని అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కాగా.. సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై శంషాబాద్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌తో సమీక్షించారు.
  
 వేగవంతంగా పనులు..
 3న సీఎం కేసీఆర్ రానుండడంతో చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. సభావేదిక, బహిరంగ సభ నిర్వహించే ప్రాంతంలో మట్టిపోసి గుంతలను పూడ్చివేస్తున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెల్లే రహదారికి మర్మతులు చేపట్టారు. గుంతల పడిన ప్రాంతంలో రీబీటీ తారురోడ్డు వేశారు. రోడ్డు ఇరుపక్కల మట్టిపోసి చదును చేస్తున్నారు. మొక్కలు నాటే స్థలాలను సైతం చదును చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులు చేపడుతున్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ గీతాంజలిశర్మ  - Sakshi
‘పల్స్‌ పోలియో’ను విజయవంతం చేయండి

చిలకలపూడి(మచిలీపట్నం): మార్చి మూడో తేదీన జరిగే పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదేశించారు. ఈ కార్యక్రమంపై సంబంధిత అధికారులు, సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు మామూలుగా వేసే పోలియో చుక్కలతో పాటు అదనంగా ఈ పోలియో చుక్కల మందు వేయటం ద్వారా పోలియో వైరస్‌ను వ్యాపించకుండా అడ్డుకోవచ్చని సూచించారు. అప్పుడే పుట్టిన పిల్లలు మొదలు ఐదేళ్లలోపు పిల్లలు అందరికీ పోలియో చుక్కల మందు తప్పనిసరిగా వేయించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జి.గీతాబాయి మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు సంవత్సరాల్లోపు వయసు పిల్లలు 1,39,180 మంది ఉన్నారని తెలిపారు. వారందరికీ చుక్కల మందు వేస్తామన్నారు. పల్స్‌పోలియో బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించుకోని వారికి మరుసటి రోజు నుంచి మూడు రోజుల పాటు గృహసందర్శన ద్వారా పోలియో చుక్కల మందు వేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డీఆర్డీఏ పీడీ పి.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌, ఐసీడీఎస్‌ పీడీ ఎస్‌.సువర్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జేసీ గీతాంజలి శర్మ