Health
-
రెండు 'టీ' లకు మించొద్దు..! లేదంటే ఆ సమస్య తప్పదు..!
రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు. టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు. కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు. ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.(చదవండి: కిస్మిస్ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!) -
కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!
శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇదీ చదవండి: పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా -
క్యాన్సర్ కేర్ వంటిల్లూ పుట్టిల్లే!
క్యాన్సర్ రావడానికి కొన్ని పద్ధతుల్లో వంట కూడా కారణమవుతుంది. ఉదాహరణకు ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ వాడకూడదనేది అందరికీ తెలిసిన విషయం. అలా మాటిమాటికీ నూనెను వేడి చేయడం వల్ల అందులో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఏర్పడతాయి. అందుకే అలా వాడకూడదని నిపుణులు సలహా ఇస్తుంటారు. ఇది మాత్రమే కాకుండా వంట విషయంలో క్యాన్సర్‌కు కారణమయ్యే అంశాలేమిటీ... వంటలో చేయకూడనివేమిటీ, చేయాల్సినవేమిటో తెలుసుకుందాం. 7 వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడకూడదు. 7 కొవ్వులు ఎక్కువ ఉన్న ఆహారం క్యాన్సర్ కారకమయ్యే అవకాశముంది. అందుకే వేట మాంసం (రెడ్ మీట్) వద్దని నిపుణుల సలహా. రెడ్ మీట్ ఎక్కువగా తినే దేశాల్లో కొలోన్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్లు ఎక్కువ. రెడ్ మీట్‌తో ΄్యాంక్రియాటిక్, ్ర΄ోస్టేట్, ΄÷ట్ట క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది. మామూలు కూరగాయలు, ఆకుకూరల ఆహారం తినేవారితో ΄ోలిస్తే ప్రతిరోజూ ప్రతి 100 గ్రాముల రెడ్‌మీట్ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 17 శాతం పెరగడం కొందరు అధ్యయనవేత్తల పరిశీలనలో తేలిన విషయం. అయితే మాంసాహార ప్రియులకు న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు ఇచ్చే సలహా ఏమిటంటే... మాంసాహార ప్రియులు రెడ్‌మీట్‌కు బదులు వైట్ మీట్ అంటే కొవ్వులు తక్కువగా ఉండే చికెన్, చేపలు తినడం మంచిది. చేపలైతే ΄ోషకాహారపరంగా కూడా మంచివి. అందులోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్‌ను నివారిస్తాయి కూడా. 7 క్యాన్సర్ నివారణలో ఏం వండారన్నది కాదు... ఎలా వండామన్నది కూడా కీలకమే. ముఖ్యమే. ఒక వంటకాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రతతో వండటం కొన్నిసార్లు క్యాన్సర్ కారకాలైన రసాయనాలు వెలువడేందుకు అవకాశమివ్వవచ్చు. ఉదా: మాంసాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తున్నా... అంటే గ్రిల్డ్ ఐటమ్స్, ఫ్రైడ్ (వేపుడు) ఐటమ్స్‌గా చేస్తుంటే అందులోని కొన్ని పదార్థాలు హెటెరో సైక్లిక్ అరోమాటిక్ అమైన్స్ అనే రసాయనాలుగా మారవచ్చు. అవి క్యాన్సర్ కారకాలు. 7 విదేశీ తరహాలో ఇప్పుడు మనదేశంలోనూ స్మోక్డ్ ఫుడ్ తినడం మామూలుగా మారింది. స్మోకింగ్ ప్రక్రియకు గురైనా, నేరుగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత తగిలేలా మంట మీద వండిన ఆహారపదార్థాల్లోంచి వెలువడే ‘΄ాలీ సైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ అనే (పీఏహెచ్‌స్) అనే రసాయనాలు క్యాన్సర్ కారకాలు. అందుకే ఈ పద్ధతుల్లో వడటం సరికాదు.7 ఆహారాన్ని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోడానికి వాడే కొన్ని రకాల పదార్థాల వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఉదాహరణకు ఆహారాల నిల్వకు ఉప్పు వాడటం అనాదిగా వస్తున్న పద్ధతి. అయితే ఉప్పులో చాలాకాలం పాటు ఊరిన పదార్థాల వల్ల పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతిని, అది ఇన్ఫ్లమేషన్కు గురికావచ్చు. అలా కడుపు లోపలి రకాలు (లైనింగ్) దీర్ఘకాలం ఒరుసుకుపోవడంతో కడుపులో ఒరుసుకు΄ోయిన లైనింగ్ రకాలు నైట్రేట్ల వంటి క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావానికి గురయ్యే అవకాశముంది. అలాంటప్పుడు కడుపులో ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే సూక్ష్మజీవి ఉంటే అది ఆ ్రపాంతాల్లో పుండ్లు (స్టమక్ అల్సర్స్) వచ్చేలా చేస్తుంది. ఈ స్టమక్ అలర్స్ కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అందుకే ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, సాల్టెట్ పదార్థాలు, బేకరీ ఐటమ్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవాలన్నది వైద్యనిపుణుల సలహా. ఆహారంలో ఉప్పు పెరుగుతున్నకొద్దీ్ద హైబీపీ కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకు ఆరు గ్రాములకు మించి ఉప్పు వాడటం సరికాదు. -
నీళ్లోసుకుంటే ఈ మాత్రేసుకోవద్దు!
గర్భధారణ జరిగాక సాధారణంగా పారాసిటమాల్ వంటి మందులు తప్ప మహిళలకు ఎలాంటి మందులూ ఇవ్వరు. కొన్ని రకాల మందులైతే అస్సలు ఇవ్వకూడదు కూడా. కొన్ని మందులు తీసుకోవడం వల్ల గర్భంలోని పిండంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్త. అలాంటి మందులేవో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండేందుకు ఉపయోగపడేదే ఈ కథనం...గర్భవతులు వాడకూడని మందులేమిటో పోరబాటున వాడితే వచ్చే ప్రతికూల ప్రభావాలెలా ఉంటాయో తెలుసుకుందాం. యాంటీకన్వల్సెంట్స్ : ఫిట్స్ వ్యాధి ఉన్నవారిలో సీజర్స్ తగ్గడానికి వాడే మందులివి. కార్బమాజిపైన్, సోడియం వాల్్రపోయిక్ యాసిడ్, ఫెనీటోయిన్ వంటి అన్ని యాంటీకాన్వల్సెంట్ మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో చెవి, ముఖానికి సంబంధించిన ఎముకల అపసవ్యత, న్యూరల్ ట్యూబ్ లో΄ాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఫిట్స్ రావడంతో మందులు వాడుతున్నవారు సైతం గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫిట్స్ కోసం ఒకటి కంటే ఎక్కువగా మందులు వాడుతున్న వారు దాన్ని కేవలం ఒకే ఒక టాబ్లెట్‌కు పరిమితం చేసుకుని, ఫిట్స్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకుని, కాబోయే తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కా΄ాడుకుంటుంటే నిరభ్యంతరంగా గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు. కానీ తల్లి వాడే కొన్ని రకాల ఫిట్స్ మందులు పిండంపై దుష్ప్రభావం చూపవచ్చు. అలాంటప్పుడు బిడ్డలో వెన్నెముక పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బైఫిడా, గ్రహణం మొర్రిగా పేర్కొనే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ΄ాలెట్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్) వంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఫిట్స్ మందులను తల్లికి ప్రయోజనకరంగానూ, బిడ్డకూ హానికరం కాకుండా ఉండేలా మోతాదులు తగ్గించిన తర్వాతనే గర్భధారణ ΄్లాన్ చేయాలి. యాంటిసైకోటిక్ : ఇవి మానసిక çసమస్యలకూ, మనసు నిలకడగా ఉండటానికి వాడతారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తొలి రోజుల్లో ఇచ్చే లిథియమ్ వల్ల గుండెకు సంబంధించిన ఎబ్స్టైన్ అనామలీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మానసిక సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ΄్లానింగ్ చేసుకోకూడదు. యాంటీమైగ్రెయిన్ మందులు : ఎర్గోటమైన్, మెథీజరిజడ్ వంటి మందుల్ని తలనొప్పి తగ్గడానికి ఇస్తారు. వీటి వల్ల సమయానికి ముందే ప్రసవం అయి΄ోయే అవకాశాలెక్కువ. కాబట్టి మైగ్రేన్ మందులు వాడుతుంటే గైనకాలజిస్టుకు ఆ విషయం చె΄్పాలి. యాంటీ బయాటిక్స్ : ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి వాడే ఈ మందులు బిడ్డలో అనేక దుష్ప్రభావాలు కలగజేయవచ్చు. ఉదా: టెట్రాసైక్లిన్స్ వల్ల దంతాల రంగుపోవడం, ఎముకల ఎదుగుదలకు అడ్డంకులు వంటి సమస్యలు రావచ్చు. సల్ఫోనమైడ్స్ అనే మందుల వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే కామెర్లూ, స్ట్రె΄్టోమైసిన్ వాడటం వల్ల చెవుడు వచ్చే అవకాశాలెక్కువ. యాంటీకోయాగ్యులెంట్స్ : రక్తం గడ్డకట్టడంలో లోపాలుంటే ఇచ్చే వార్‌ఫేరిన్ డైఫినాడైయాన్ గ్రూపుకు చెందిన ఈ మందుల వల్ల ముక్కు రంధ్రం పూర్తిగా తయారుకాకపోవడం, గర్భవతిలో రక్తస్రావం, కంటి అపసవ్యతలు ఏర్పడటం, తల పెరగకుండా ఉండటం, ఫలితంగా చిన్నారుల్లో బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలెక్కువ. యాంటీ డయాబెటిక్ : మధుమేహానికి వాడే మందులైన క్లోరో్రపోమైడ్ వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే చిన్నారి తాలూకు రక్తంలో గ్లూకోజ్ తగ్గడం (హైపోగ్లైసీమియా) వంటి కండిషన్లు ఏర్పడవచ్చు. విటమిన్–ఎ అనలాగ్స్ : ఈ మందుల్ని మొటిమలు (యాక్నే) చికిత్సలో వాడతారు. ఎట్రటినేట్, ఐసోట్రెటినోయినిన్లాంటి మందులతో చెవులు చిన్నగా ఉండటం, గుండె సమస్య, మెదడులోకి నీరు చేరడం, అబార్షన్ కావడం, ముఖాకృతిలో తేడాలు రావడం వంటివి జరగవచ్చు. డయాగ్నస్టిక్ రేడియోలజీ : గర్భం ధరించిన తొలిరోజుల్లో ఎక్స్–రే తీయించిన కేసుల్లో... చిన్నారి పుట్టిన తొలి ఏళ్లలో లుకేమియా వంటి రక్త సంబంధిత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలెక్కువ. అందుకే గర్భవతులు రేడియేషన్‌కు ఎక్స్΄ోజ్ కావద్దంటూ ఎక్స్‌రే రూమ్‌ల ముందు స్పష్టంగా హెచ్చరిక రాసి ఉంటుంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు వాడినప్పటికీ చిన్నారి మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. ఏ మందు ఎంత సురక్షితమో లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి గర్భవతులు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే వారు డాక్టర్‌ను తప్పక సంప్రదించాకే వాడాలని గుర్తుంచుకోండి. డాక్టర్లు సైతం ఆ మందుల అవసరాన్ని, బిడ్డపై పడే ప్రభావాల్ని జాగ్రత్తగా బేరీజు వేశాకే తల్లికి ప్రిస్క్రయిబ్ చేస్తారు.