గర్భధారణ జరిగాక సాధారణంగా పారాసిటమాల్ వంటి మందులు తప్ప మహిళలకు ఎలాంటి మందులూ ఇవ్వరు. కొన్ని రకాల మందులైతే అస్సలు ఇవ్వకూడదు కూడా. కొన్ని మందులు తీసుకోవడం వల్ల గర్భంలోని పిండంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్త. అలాంటి మందులేవో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండేందుకు ఉపయోగపడేదే ఈ కథనం...
గర్భవతులు వాడకూడని మందులేమిటో పోరబాటున వాడితే వచ్చే ప్రతికూల ప్రభావాలెలా ఉంటాయో తెలుసుకుందాం.
యాంటీకన్వల్‌సెంట్స్ : ఫిట్స్ వ్యాధి ఉన్నవారిలో సీజర్స్ తగ్గడానికి వాడే మందులివి. కార్బమాజిపైన్, సోడియం వాల్‌్రపోయిక్ యాసిడ్, ఫెనీటోయిన్ వంటి అన్ని యాంటీకాన్వల్‌సెంట్ మందుల వల్ల పుట్టబోయే బిడ్డలో చెవి, ముఖానికి సంబంధించిన ఎముకల అపసవ్యత, న్యూరల్ ట్యూబ్ లో΄ాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలెక్కువ.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఫిట్స్ రావడంతో మందులు వాడుతున్నవారు సైతం గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫిట్స్ కోసం ఒకటి కంటే ఎక్కువగా మందులు వాడుతున్న వారు దాన్ని కేవలం ఒకే ఒక టాబ్లెట్‌కు పరిమితం చేసుకుని, ఫిట్స్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకుని, కాబోయే తల్లి తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కా΄ాడుకుంటుంటే నిరభ్యంతరంగా గర్భధారణకు ΄్లాన్ చేసుకోవచ్చు.
కానీ తల్లి వాడే కొన్ని రకాల ఫిట్స్ మందులు పిండంపై దుష్ప్రభావం చూపవచ్చు. అలాంటప్పుడు బిడ్డలో వెన్నెముక పూర్తిగా అభివృద్ధి చెందని స్పైనా బైఫిడా, గ్రహణం మొర్రిగా పేర్కొనే క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ΄ాలెట్ లేదా పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు (కంజెనిటల్ హార్ట్ డిసీజెస్) వంటివి వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఫిట్స్ మందులను తల్లికి ప్రయోజనకరంగానూ, బిడ్డకూ హానికరం కాకుండా ఉండేలా మోతాదులు తగ్గించిన తర్వాతనే గర్భధారణ ΄్లాన్ చేయాలి.
యాంటిసైకోటిక్ : ఇవి మానసిక çసమస్యలకూ, మనసు నిలకడగా ఉండటానికి వాడతారు. ప్రెగ్నెన్సీ వచ్చిన తొలి రోజుల్లో ఇచ్చే లిథియమ్ వల్ల గుండెకు సంబంధించిన ఎబ్‌స్టైన్ అనామలీ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మానసిక సమస్యలకు మందులు వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ ΄్లానింగ్ చేసుకోకూడదు.
యాంటీమైగ్రెయిన్ మందులు : ఎర్గోటమైన్, మెథీజరిజడ్ వంటి మందుల్ని తలనొప్పి తగ్గడానికి ఇస్తారు. వీటి వల్ల సమయానికి ముందే ప్రసవం అయి΄ోయే అవకాశాలెక్కువ. కాబట్టి మైగ్రేన్ మందులు వాడుతుంటే గైనకాలజిస్టుకు ఆ విషయం చె΄్పాలి.
యాంటీ బయాటిక్స్ : ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి వాడే ఈ మందులు బిడ్డలో అనేక దుష్ప్రభావాలు కలగజేయవచ్చు. ఉదా: టెట్రాసైక్లిన్స్ వల్ల దంతాల రంగుపోవడం, ఎముకల ఎదుగుదలకు అడ్డంకులు వంటి సమస్యలు రావచ్చు. సల్ఫోనమైడ్స్ అనే మందుల వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే కామెర్లూ, స్ట్రె΄్టోమైసిన్ వాడటం వల్ల చెవుడు వచ్చే అవకాశాలెక్కువ.
యాంటీకోయాగ్యులెంట్స్ : రక్తం గడ్డకట్టడంలో లోపాలుంటే ఇచ్చే వార్‌ఫేరిన్ డైఫినాడైయాన్ గ్రూపుకు చెందిన ఈ మందుల వల్ల ముక్కు రంధ్రం పూర్తిగా తయారుకాకపోవడం, గర్భవతిలో రక్తస్రావం, కంటి అపసవ్యతలు ఏర్పడటం, తల పెరగకుండా ఉండటం, ఫలితంగా చిన్నారుల్లో బుద్ధిమాంద్యం వచ్చే అవకాశాలెక్కువ.
యాంటీ డయాబెటిక్ : మధుమేహానికి వాడే మందులైన క్లోరో్రపోమైడ్ వంటివి తీసుకోవడం వల్ల బిడ్డ పుట్టిన నెలలోపే చిన్నారి తాలూకు రక్తంలో గ్లూకోజ్ తగ్గడం (హైపోగ్లైసీమియా) వంటి కండిషన్లు ఏర్పడవచ్చు.
విటమిన్–ఎ అనలాగ్స్ : ఈ మందుల్ని మొటిమలు (యాక్నే) చికిత్సలో వాడతారు. ఎట్రటినేట్, ఐసోట్రెటినోయినిన్‌లాంటి మందులతో చెవులు చిన్నగా ఉండటం, గుండె సమస్య, మెదడులోకి నీరు చేరడం, అబార్షన్ కావడం, ముఖాకృతిలో తేడాలు రావడం వంటివి జరగవచ్చు.
డయాగ్నస్టిక్ రేడియోలజీ : గర్భం ధరించిన తొలిరోజుల్లో ఎక్స్–రే తీయించిన కేసుల్లో... చిన్నారి పుట్టిన తొలి ఏళ్లలో లుకేమియా వంటి రక్త సంబంధిత క్యాన్సర్ల బారిన పడే అవకాశాలెక్కువ. అందుకే గర్భవతులు రేడియేషన్‌కు ఎక్స్΄ోజ్ కావద్దంటూ ఎక్స్‌రే రూమ్‌ల ముందు స్పష్టంగా హెచ్చరిక రాసి ఉంటుంది.
గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు వాడినప్పటికీ చిన్నారి మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువ. ఏ మందు ఎంత సురక్షితమో లేదా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలియదు. కాబట్టి గర్భవతులు మందులు వాడాల్సిన పరిస్థితి వస్తే వారు డాక్టర్‌ను తప్పక సంప్రదించాకే వాడాలని గుర్తుంచుకోండి. డాక్టర్లు సైతం ఆ మందుల అవసరాన్ని, బిడ్డపై పడే ప్రభావాల్ని జాగ్రత్తగా బేరీజు వేశాకే తల్లికి ప్రిస్క్రయిబ్ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment