Politics
ktr satirical comments congress party government
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి అని మరోసారి తేలిపోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు...
maharashtra congress mp vasant chavan demise
మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్(69) తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చవాన్ చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతిచెందారు...
tamil hero vijay unveils his party flag at chennai
చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్, స్టార్ హీరో విజయ్ ఆ పార్టీ పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. ఇటీవల తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం చెన్నైలో ఎరుపు, పసుపు రంగులో ఏనుగులతో ఉన్న పార్టీ జెండా, గుర్తును ఆయన ఆవిష్కరించారు...
vundavalli aruna kumar talk on margadarsi case and request to telugu cms
మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని, కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా స్పందిస్తారో చూడాలని మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో జగన్ ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. బుధవారం ఉదయం రాజమహేంద్రవరంలో ఉండవల్లి మీడియాతో మాట్లాడారు...
Sports
T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు!ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాంమేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్‌లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తాకాగా.. 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో భారత్ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.యూఏఈలోమహిళా టీ20 ప్రపంచకప్-2024 ఎడిషన్ అక్టోబర్ 3- 20 వరకు జరుగనుంది. షార్జా, దుబాయ్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది.ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్ దశలో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్ సేన తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.అందుకే వేదిక మార్పుఅదే విధంగా.. లీగ్ దశలోని మొదటి మూడు మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడనున్న టీమిండియా... ఆసీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. చదవండి: 38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్
Jay Shah Elected As ICC Chairman
35 ఏళ్ల జై షా ఐసీసీ పీఠం అధిరోహించనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. షా ఐసీసీ బాస్‌గా ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపడతాడు. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ మొదలైన షా ప్రస్తానం.. ఐసీసీ అగ్రపీఠం వరకు చేరింది. షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు.
If you dont: Shami teases about Rohit Sharma Scary Side
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్‌కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్ ఇలా చేస్తాడని.. కెప్టెన్‌గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్
R Sai Kishore Says: I Am One Of The Best Spinners In Country
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్‌రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు.
National
kolkata doctor case: accused mother says he was innocent
దేశానికి రాజైనా తల్లికి కొడుకే చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, ఈ నేరానికి సంబంధించి సివిల్ వాలంటీర్‌ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రూరమైన సంఘటన దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది, భారతదేశం అంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి...
mlc kavitha granted bail in delhi liquor case
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ సుమారు గంటన్నరపాటు ఇవాళ వాదనలు వినిపించారు...
pm modi ukraine tour specialities
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయల్దేరారు. నేడు ఆయన పోలాండ్ రాజధాని వార్సా వెళ్లేందుకు విమానం ఎక్కారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. పోలాండ్‌తో దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండాయని మోదీ తెలిపారు....
supreme court serious on doctor case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హత్యాచార ఘటన, కేసు దర్యాప్తు, ఆస్పత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది...
International
వీడియోలు
కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ కు కవిత
కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్..
హుస్సేన్ సాగర్ లో వెయ్యి ఎకరాలు మింగేసి అక్రమ కట్టడాలు
30 ఏళ్ల కింద కట్టినా కూల్చేస్తాం.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి MLRIT కాలేజీకి రెవిన్యూశాఖ నోటీసులు
బెయిల్ నిబంధనలపై సుప్రీం హాట్ కామెంట్స్
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు
శంషాబాద్ ఓయో హోటల్ లో సీసీ కెమెరాలు