సాక్షి,న్యూఢిల్లీ : చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి లడ్డు వివాదాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, లడ్డూ వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే సిట్ సరిపోదని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ అన్నారు. సిట్ ఏర్పాటుపై సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు. తన రాజకీయ స్వార్థం కోసం లడ్డు వివాదం అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. లడ్డుపై వివాదంపై నిజా నిజాలు బయటికి రావాలంటే ఆయన నియమించిన సిట్ సరిపోదు. న్యాయ విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు.
రాజకీయ ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు బయటికి రావాలంటే న్యాయ విచారణే శరణ్యం’ అని సురేంద్ర జైన్ తెలిపారు. ఈ సందర్భంగా లడ్డూ వివాదంపై తిరుమల శ్రీవారి భక్తులు ఆందోళన చెందవద్దని, ఈ అంశంపై త్వరలోనే మేం న్యాయపరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
దేశంలో అన్ని దేవాలయాలు నిర్వాహణ నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలి. దేవాలయాల పరిరక్షణపై వీహెచ్‌పీ త్వరలో ఉద్యమం చేపడుతుంది’ అని సురేంద్ర జైన్ హెచ్చరించారు.
సిట్‌లో చంద్రబాబు మనిషి
తిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కూలంగా వ్యవహరించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ చీఫ్‌గా నియమించారు. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment