breaking news
Ad - Sakshi_Home_Sticky
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా?
న్యూఢిల్లీ: కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్యవిధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం రాందేవ్, బాలకృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ‘‘ ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా?. అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘ మా క్లయింట్లు యాడ్స్ కోసం లక్షలు వెచ్చించారు’ అని రోహత్గీ చెప్పారు. ‘ ఖర్చు ఎంతయింది అనేది మాకు అనవసరం’ అని జడ్జి అసహనం వ్యక్తంచేశారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. దీంతో సోమవారం నాటి ప్రకటనల వివరాలను రెండ్రోజుల్లోపు సమర్పించాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్ల ధర్మాసనం ఆదేశించింది. ఇలాగే తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఫాస్ట్‌మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సంబంధింత మూడు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ‘‘ ఈ కంపెనీల తప్పుడు ప్రకటనలు వల్లే ఆయా సంస్థల ఉత్పత్తులను చిన్నారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు, వృద్ధులు విరివిగా వినియోగిస్తున్నారు’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. -
వేలం వద్దు.. మేమే కేటాయిస్తాం.. మీ తీర్పును సవరించండి
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో ఇచ్చిన తీర్పును సవరించాలని 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. వేలం విధానంలో కాకుండా తామే కేటాయింపులు జరుపుతామని కోర్టుకు తెలిపింది. వేలం ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలంటూ ఇచ్చిన గత తీర్పును సవరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలాల ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అభ్యర్థించారు. ఈ అంశంపై తక్షణం విచారణ చేపట్టాలని కోరారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్(ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత) పద్ధతిలో యూపీఏ హయాంలో ఏ.రాజా టెలికం మంత్రిగా ఉన్నపుడు 2జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించి కంపెనీలకు ఇచ్చిన 122 లైసెన్సులను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. కొన్ని సందర్భాల్లో వేలంలో కాకుండా ప్రభుత్వమే కేటాయింపులు జరపాలని ఆశిస్తోందని, అందుకే పాత తీర్పును సవరించాలని అటార్నీ జనరల్ సోమవారం కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, వివరాలను ఈ–మెయిల్లో పంపాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. అయితే తీర్పును సవరించాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తప్పుబట్టారు. నాటి తీర్పు సమంజసంగానే ఉందని, సవరణ అనవసరమని ఆయన వాదించారు. ఆనాడు యూపీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా 2జీ స్పెక్ట్రమ్‌పై ప్రజా ప్రయోజనా వ్యాజ్యం దాఖలుచేసిన ఎన్జీవో సంస్థ తరఫున ఆనాడు ప్రశాంత్భూషణే వాదించారు. కేటాయింపుల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని మన్మోహన్ ప్రభుత్వంలో నాటి కమ్యూనికేషన్స్, ఐటీ సహాయ మంత్రి కపిల్‌సిబల్ 2011లో వాదించారు. అయితే ఈ కేసులో ఎ.రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ 2017 డిసెంబర్ 21న ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరిచింది. ఈ తీర్పును సవాల్‌చేస్తూ సీబీఐ 2018 మార్చి 20న హైకోర్టును ఆశ్రయించింది. అక్రమ కేటాయింపుల వల్ల కేంద్ర ఖజానాకు రూ.30,984 కోట్ల నష్టం వాటిల్లిందని వాదించింది. వేలం విధానంలో జరగని కేటాయింపుల లైసెన్స్‌లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. -
పతంజలి ధిక్కార కేసులో మళ్లీ అక్షింతలు
న్యూఢిల్లీ, సాక్షి: తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. తదనంతర కోర్టు ధిక్కారణ పరిణామాల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద్ తీరును తప్పుబట్టడంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏమాత్రం ఉపేక్షించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం విచారణలోనూ ఆ కంపెనీ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సుప్రీం కోర్టు మండిపడింది. పేపర్లో క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇచ్చినా కూడా.. కోర్టు వాళ్లను వదలకపోవడం విశేషం. ‘‘ఇవాళ్టి న్యూస్పేపర్లో ఇచ్చిన క్షమాపణల ప్రకటన.. గతంలో పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనల మాదిరే ఉన్నాయా?.. ఆ క్షమాపణల తాలుకా అక్షరాల సైజు కూడా ప్రకటనలప్పుడు ఇచ్చిన సైజులోనే ఉన్నాయా?’’ అంటూ ద్విసభ్య ధర్మాసనం పతంజలి ఆయుర్వేద్ నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలను ప్రశ్నించింది. అయితే.. క్షమాపణల కోసం పతంజలి లక్షలు వెచ్చిందని, సమారు రూ.10 లక్షల ఖర్చుతో 67 పత్రికల్లో ఈ ప్రకటన ఇచ్చిందని పతంజలి తరఫు న్యాయవాది రోహత్గీ కోర్టుకు తెలియజేశారు. అలాంటప్పుడు.. గతంలో ఇచ్చిన ప్రకటనల మాదిరే ఈ క్షమాపణల ప్రకటన ఉందా? అని జస్టిస్ హిమా కోహ్లీ, పతంజలి న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రకటనల కోసం పతంజలి భారీగా ఖర్చు చేసిందని రోహత్గీ చెప్పగా.. దానివల్ల మాకొచ్చిన ఇబ్బందేం లేదంటూ బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. మరోవైపు పతంజలిపై కేసు వ్యవహారంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్‌కు రూ.100 కోట్ల జరిమానా విధించాలంటూ ఒక విజ్ఞప్తి వచ్చిందని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై అనుమానాలున్నాయని బెంచ్ పేర్కొంది. అయితే ఆ అభ్యర్థనతో తమ క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది రోహత్గి కోర్టుకు వివరణ ఇచ్చారు. మరోవైపు పత్రికల్లో క్షమాపణలు మరింత పెద్ద సైజులో ప్రకటనలుగా ఇస్తామని రాం దేవ్ చెప్పడంతో ఈ కేసు విచారణను మరో వారం వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఇదిలా ఉంటే.. డయాబెటిస్, బీపీ లాంటి వ్యాధులను తమ కంపెనీ ఉత్పత్తులు నయం చేస్తాయని పతంజలి ఆయుర్వేద్ గతంలో ప్రకటనలు ఇచ్చుకుంది. అయితే ఆ తప్పుడు ప్రకటనల కేసులో ఇవాళ విచారణ ఉండగా, పతంజలి ఆయుర్వేద్ దేశవ్యాప్తంగా పలు ప్రముఖ జాతీయ దినపత్రికల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటన ఇచ్చింది. కోర్టును తాము ఎప్పుడూ గౌరవిస్తామని, తప్పులు మరోసారి చేయబోమంటూ అందులో పేర్కొన్నారు. -
MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా.. తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. కవిత బెయిల్‌పై వాదనలు లిక్కర్ స్కాంలో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడి వాదనలు కవితను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయమని మేము కోర్టుకు అండర్ టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు దీని అర్థం అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కాంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని తమకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారు ఈడి జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్ లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచాము పిఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5% అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా రూ.100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాలు ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు అని గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసులో కూడా కవిత నేరం చేయలేదు అనే దానికి ఎలాంటి ఆధారం లేదు ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది ఈ కేసులో కవితకు పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి సాక్ష్యాలున్నాయి కవిత తరపు లాయర్ వాదనలు మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 వ తేదీ తీర్పు వెల్లడించన్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019