breaking news
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది.కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
అప్నా నంబర్ ఆయేగా
మీ షూ సైజు ఎంత? యూకే సైజులో అయితే ఈ నంబర్.. యూఎస్ సైజులో అయితే ఈ నంబర్ అని చెబుతాం.. చాలా చెప్పుల షాపుల్లో ఈ నంబర్లే నడుస్తున్నాయి. ఎప్పుడైనా ఆలోచించారా? మన పాదాల సైజు గురించి చెప్పేందుకు.. వేరే దేశాల నంబర్లపై ఎందుకు ఆధారపడుతున్నామో.. మన దేశానికి సొంత ఫుట్‌వేర్ సైజుల నంబర్ ఎందుకు లేదో? ఇకపై ఆ సీన్ మారనుంది. ఎందుకంటే.. త్వరలోనే అప్నా నంబర్ బీ అయేగా.. అప్పుడెప్పుడో బ్రిటిష్‌వాళ్లు.. దేశానికి స్వాతంత్య్రం ముందు బ్రిటిష్ వాళ్లు వారి ఫుట్‌వేర్ సైజుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సగటు భారత మహిళ 4 నుంచి 6 సైజుల మధ్య ఉండే పాదరక్షలను ధరిస్తోంది. అలాగే సగటు పురుషుడు 5 నుంచి 11 సైజుల మధ్య ఉండే ఫుట్‌వేర్‌ను వేసుకుంటున్నాడు. అయితే భారతీయుల అవసరాలకు అనుగుణంగా పాద రక్ష ల కొలతల వివరాలు లేవు.. దీంతో ఇప్పటివరకు మనకంటూ ప్రత్యేక విధానం లేకుండాపోయింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల భారత్‌లో ఏటా సగటు భారతీ యుడు 1.5 జతల పాదరక్షలను కొనుగోలు చేస్తున్నాడు. అంటే ఎన్ని కోట్ల జతలో చూడండి. అలాగే షూ తయారీపరంగా కూ డా భారత్ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. కానీ ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా వచ్చే పాదరక్షల్లో 50 శాతం తమకు సరిపో వట్లేదని వినియోగదారులు తిరస్క రిస్తున్నారని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో భారత ఫుట్‌వేర్ సైజుల విధానాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా దేశవ్యా ప్తంగా ఇటీవల భారతీ యుల పాదాల సైజులపై ఓ సర్వే జరి గింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ ఐఆర్) పరిధిలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ) ఈ అధ్యయనం చేపట్టింది. ఈ సైజుల విధానానికి ‘భా’(భారత్) అనే పేరు పెట్టాలని భావిస్తు న్నారు. దేశంలో ఫుట్‌వేర్ తయారీకి ఇకపై ఈ సైజులే కొల మానం కానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న యూకే/ యూరో పియన్, యూఎస్ సైజులను ‘భా’ భర్తీ చేయనుంది. సర్వేలో ఏం తేలింది? భారత్‌లో వివిధ జాతుల ప్రజలు ఉండటం.. పైగా.. ఈశాన్య భారతానికి చెందిన ప్రజల పాదాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల పాదాలకన్నా కాస్త చిన్నవిగా ఉంటాయి కాబట్టి.. దేశంలో కనీసం 5 రకాల ఫుట్‌వేర్ సైజుల పద్ధతి అవసరమ వుతుందని ఈ సర్వేకు ముందు భావించారు. తర్వాత అందరికీ ఒకే ఫుట్‌వేర్ సైజు సరిపోతుందని తేల్చారు. 2021 డిసెంబర్ నుంచి 2022 మార్చి మధ్య దేశవ్యాప్తంగా లక్ష మంది ప్రజల షూ కొలత లకు సంబంధించి సర్వే నిర్వహించారు. పాదాల సైజు, వాటి నిర్మాణ తీరు, సగటు భారతీ యుల పాదాల ఆకారం గురించి మరింత మెరుగ్గా అర్థం చేసు కొనేందుకు 3డీ ఫుట్ స్కానింగ్ మెషీన్లను సర్వే కోసం ఉపయోగించారు. దీని ప్రకారం సగటు భారతీయ మహిళ పాదం 11 ఏళ్ల వయసులోనే గరిష్ట సైజుకు చేరుకుంటుందని తేలింది. అలాగే సగటు పురుషుడి పాదం 15 లేదా 16 ఏళ్లకు గరిష్ట సైజుకు చేరుకుంటోందని వెల్లడైంది. అలాగే భారతీయుల పాదాలు యూరోపియన్లు లేదా అమెరికన్ల పాదాలకన్నా వెడల్పుగా ఉంటాయని సర్వే నిర్ధారించింది. ఇన్నేళ్లుగా యూకే, యూరోప్, యూఎస్ పాదాల సైజుల ప్రకారం వెడల్పు తక్కువగా ఉండే ఫుట్‌వేర్ తయార వుతుండటంతో భారతీయు లంతా ఇప్పటివరకు బిగుతుగా ఉన్న పాదరక్షలు ధరిస్తున్నారని.. బిగుతుగా ఉండటంతో కొందరు తమ పాదాల కన్నా పొడవైన పాదరక్షలు కొనుక్కుంటున్నారని తేలింది. ముఖ్యంగా హై హీల్స్ వాడే మహిళలు వారి పాదాల సైజుకన్నా పెద్దవైన హైహీల్స్నే వాడుతు న్నారని.. ఇవి అసౌకర్యంగా, గాయాలకు దారితీసేలా ఉన్నాయని కూడా సర్వేలో వెల్లడైంది. ఇక మగవారైతే షూ వదులుగా ఉండకుండా చూసుకొనేందుకు లేస్‌లను మరింత గట్టిగా కడుతున్నారు. ఇది షూ ధరించే వారిలో సాధారణ రక్త ప్రసరణను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, షుగర్ వ్యాధితో బాధపడేవారు ఇలా తమ సైజులకు నప్పని పాదరక్షలు ధరిస్తూ గాయాల ముప్పును ఎదుర్కొంటున్నారని తేలింది. ఈ నేపథ్యంలో ‘భా’ అందుబాటులోకి వస్తే అది వినియోగదారులకు, పాదరక్షల తయారీదారులకు లాభం చేకూర్చనుంది. ఈ సర్వే ఆధారంగా చేసిన సిఫార్సులను కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)కి సమర్పించింది. ఆ విభాగం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్)కు ఈ సిఫార్సులను పంపింది. దేశంలో సైజుల విధానానికి అనుమతి తెలపడంతోపాటు దాన్ని అమలు చేసే అధికారం బీఐఎస్కే ఉంది. ప్రస్తుతం యూకే కొలతల ప్రకారం 10 సైజుల విధానం అమల్లో ఉండగా ‘భా’ వల్ల వాటి సంఖ్య 8కి తగ్గనుంది. దీనివల్ల ఇకపై అర సైజుల అవసరం కూడా తప్పనుంది. వచ్చే ఏడాదిలో ‘భా’ విధానం అమల్లోకి వస్తుందని అంచనా. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
మా మతం ఎవరినీ తక్కువగా చూడదు
శ్రీనగర్: ముస్లింలు చొరబాటుదారులు, తల్లులు, అక్కాచెల్లెళ్ల బంగారం, మంగళసూత్రాలను కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి నేలబారు మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. ‘‘ ఇతర మతాలను కించపరచాలని మా మతం అస్సలు బోధించదు. హిందూ మహిళల మంగళసూత్రాలను ఏ ఒక్క ముస్లిం కూడా దోచుకోడు. అందరినీ సమానంగా చూడాలని ఇస్లాం ప్రభోదిస్తోంది. మేం నమ్మే మా మతం అన్ని మతాలకూ గౌరవం ఇవ్వాలనే చెబుతోంది. హిందూ తల్లి, సోదరి మంగళసూత్రాలను ముస్లిం దోచాడని నేను ఎక్కడా వినలేదు. అలా ఒకవేళ ఎక్కడైనా జరిగి ఉంటే అతను ముస్లిమే కాదు. అతను ఇస్లాంను సరిగా అర్థంచేసుకోలేదని అర్థం’’ అని అన్నారు. మంగళవారం రాజసాŠథ్న్లోని బాంసవాడా పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఫరూక్ మాట్లాడారు. ‘‘ ఒకరిని చంపితే మానవత్వాన్ని చంపేసినట్లేనని ఇస్లాం బోధనల్లో ఉంది. నేనూ ముస్లింనే. హిందువులను ద్వేషించాలని ఖురాన్లో ఎక్కడా లేదు. సిక్కులు, ముస్లింలను ఎంతగా ప్రేమిస్తానో హిందువుల పట్ల అంతే ప్రేమతో వ్యవహరిస్తా. ఇతర మతాల వాళ్లు అభివృద్ధిలోకి వస్తే వారితోపాటే మనమూ వృద్ధిలోకి వస్తాం. అప్పుడే దేశమే అభివృద్ధిపథంలో ముందుకెళ్తుంది’’ అని అన్నారు. బీజేపీ 2047 విజన్‌పై ఫరూక్ ఆరోపణలు గుప్పించారు. ‘‘ విజన్ 2047పై బీజేపీ ఎప్పుడూ వల్లెవేస్తోంది. 2047ను ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు?. అప్పటికల్లా దేశంలో పారదర్శకమైన ఎన్నికలు అనేవే లేకుండా చేయడం బీజేపీ ఉద్దేశం. అధికారాన్ని హస్తగతం చేసుకుని నచ్చినట్లు దేశాన్ని ఏలాలని భావిస్తోంది. రష్యాలో పుతిన్‌లాగా మోదీని బతికున్నంతకాలం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ ఆశపడుతోంది’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. ‘‘ ముస్లింల పట్ల బీజేపీ వైఖరిని తెల్సుకోండి. ఆ తర్వాత ఆ పార్టీకి మద్దతు అవసరమా లేదా అని ఆలోచించండి’ అని కశ్మీర్ ప్రాంత పార్టీల నేతలను హెచ్చరించారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019