Hanamkonda
-
చదువుతోనే సమాజంలో గుర్తింపు
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని, విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే అశించిన ఫలితాలు వస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. హనుమకొండ రాంనగర్‌లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోవడం, వార్డెన్ 24 గంటలు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎస్సీడీఓను ఆదేశించారు. వంటమనిషి ఆరు గంటలకే రాత్రి భోజనం వండుతుందని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. కుక్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతిగృహాన్ని రాంనగర్ నుంచి వరంగల్‌కు మార్చాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు. పరీక్ష ప్యాడ్లు అందజేశారు. తనిఖీల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుమతి, వార్డెన్ హరిత పాల్గొన్నారు. ఆరెల్లి బుచ్చయ్య ఉన్నత పాఠశాలలో.. ఖిలా వరంగల్: మధ్యకోటలోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో)
23,86819,87717,68418,24516,18118,67716,31716,50912,90313,90111,48112,15711,84810,93912,24410,2987,58310,3536,1475,38213,09211,67213,8755,6952020–212019–202022–232021–22మహబూబాబాద్భూపాలపల్లివరంగల్ అర్బన్వరంగల్ రూరల్జనగామ -
గురువారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
హనుమకొండలో చేతులకు సంకెళ్లతో నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనేతలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్..ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికిఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు అ తరువాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్ 22, మహబూబాబాద్ 23, జనగామ 29, జేఎస్ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7.583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా, అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్ వరంగల్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్–2లో నిలిచినట్లు చెబుతున్నారు.2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132 కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ (వరంగల్) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174కు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే, రూ.1,86,278 ఉన్న జనగామ ఈసారి రూ.2,21,424తో 16, రూ.1,79,222తో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్ రూ.2,00,309తో 25వ స్థానం, రూ.1,77,316తో 21వ స్థానంలో ఉన్న ములుగు రూ.2,15,772తో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086తో చివరి స్థానంలో నిలిచిన వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618తో 31వ స్థానంలో ఉంది. సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వెనకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధి రేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్ అర్బన్ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్ రూరల్ 22, (వరంగల్), మహబూబాబాద్ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22 సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటీకి రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనుకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో ఈ వివరాలు వెల్లడించారు. పట్నవాసం వద్దు.. పల్లె నివాసమే బెస్ట్ ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి తర్వాత స్థానంలో హనుమమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లలోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్ జిల్లాలో 7,37,148 మంది 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణవాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3 శాతం) పట్టణాల్లో, జేఎస్ భూపాలపల్లిలో 4,16,763 మందికి 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671కి 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం) మంది పట్నవాసం చేస్తున్నారు.జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో) జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23 వరంగల్ అర్బన్ 1,40,994 1,26,594 1,55,055 1,86,618 వరంగల్ రూరల్ 1,55,802 1,65,549 1,95,115 2,20,877 జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424 మహబూబాబాద్ 1,37,562 1,44,479 1,79,057 2,00,309 జేఎస్.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655 ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629 వరంగల్ 7,37,148 5,10,057 2,27,091 జనగామ 5,34,991 4,63,634 71,357 జేఎస్.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387 మహబూబాబాద్ 7,74,549 6,98,173 76,376 ములుగు 2,94,671 2,83,178 11,493 న్యూస్రీల్జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటురూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు జేఎస్ భూపాలపల్లిలో తగ్గి.. ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’ 15వ స్థానంలో జేఎస్ భూపాలపల్లి హనుమకొండ జిల్లాలో అర్బన్ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే ‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్–2024’లో వెల్లడి -
కులగణనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వరంగల్: కులగణనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్‌కు వచ్చిన ఆయన ఓసిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఇంట్లో మీడియాతో మాట్లాడారు. కులగణన రీసర్వే చేస్తామనడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రహదారుల నిర్మాణంలోని భూనిర్వాసితులకు మార్కెట్ ధరల ప్రకారం నష్ట పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొత్తం బీఆర్ఎస్ పాలనను మరిపిస్తోందని, ప్రజ లకు, ఉద్యోగులకు సమస్యలపై పోరాటం చేసే వారికోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజల పక్షాన ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటల పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి.. నల్లగొండ ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై ఉద్యోగులకు ఇచ్చిన హామీని ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదన్నారు. తాను సీపీఎస్ రద్దు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ సహకారంతో పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, నాయకులు ప్రదీప్ రావు, గంట రవికుమార్, రావు పద్మ, సతీష్షా, బాకం హరిశంకర్, సముద్రాల పరమేశ్వర్, మార్టిన్ లూధర్, రఘునారెడ్డి పాల్గొన్నారు. కేయూ, వివిధ కళాశాలల్లో ప్రచారం కేయూ క్యాంపస్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అభ్యర్థి పులి సరోత్తంరెడ్డితో కలిసి ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ, నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో సందర్శించారు. ఎమ్మెల్సీగా పోటీలో నిలి చిన సరోత్తంరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కేడీసీ నూతన భవన నిర్మాణానికి రూ 15కోట్లు మంజూరు చేయాలని పీఎం ఉషా పథకం కింద ప్రతిపాదనలు పంపామని, చొరవ తీసుకొని మంజూరు చేయించాలని ప్రిన్సిపాల్ రాజారెడ్డి.. ఎంపీ ఈటల దృష్టికి తీసుకెళ్లగా, తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● దేవాదుల నీటి పంపింగ్‌కు లేఖ రాయండి ● అధికారులకు నగర మేయర్ సుధారాణి సూచన వరంగల్ అర్బన్ : వేసవిలో నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం ఆమె ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. ప్రస్తుత నీటి నిల్వ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగర అవసరాల కోసం 710 ఎంఎస్ఎఫ్టీల నీరు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ నీటిని వచ్చే నాలుగు నెలలపాటు పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదులనుంచి నీటి పంపింగ్ కోసం ఇరిగేషన్ అధికారులకు లేఖ రాయాలన్నారు. అనంతరం ధర్మసాగర్ 60ఎంఎల్డీ ఫిల్టర్ బెడ్‌ను తనిఖీ చేసి నీటి శుద్ధితీరును అడిగి తెలుసుకున్నారు. ఎల్బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపుకాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఎల్బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపు ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డు అధికా రులు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ తెలిపారు. గతంలో హనుమకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 6 జిల్లాలకు ఒక్క క్యాంపు అసౌకర్యంగా ఉందని గుర్తించిన అధికారులు జిల్లా కేంద్రంగా కొత్త మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్బీ కళాశాలలో ఏర్పాటు కానున్న క్యాంపులో మహబూబా బాద్, ములుగు, వరంగల్ జిల్లాల కోడింగ్ వాల్యుయేషన్‌కు సంబంధించిన పనులు మార్చి నుంచి ప్రారంభించడానికి ఆదేశాలు జారీచేసినట్లు శ్రీధర్‌సుమన్ తెలిపారు. -
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
వరంగల్ : నగరంలోని వెంకట్రామా జంక్షన్ నుంచి లేబర్ కాలనీ వరకు వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ కోరారు. ఈమేరకు బుధవారం మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లేబర్ కాలనీ నుంచి వెంకట్రామా జంక్షన్ వరకు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈవిషయంపై స్పందించిన మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకాశ్ తెలిపారు. రవీందర్రావును కలిసిన పీఏసీఎస్ చైర్మన్లువరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల పదవీ కాలం ఆరునెలలు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ (టీజీసీఏబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావును బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు కలిసి పూలబొకేలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట దర్గా, వరంగల్, పర్వతగిరి, మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు ఉకంటి వనంరెడ్డి, ఇట్యాల హరికృష్ణ, మనోజ్‌గౌడ్, జక్కు రమేష్‌గౌడ్‌లు పాల్గొన్నారు. డిక్షనరీల పంపిణీ ఖిలా వరంగల్ : కరీమాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మీ నేస్తం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఆంగ్ల డిక్షనరీలు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు జయప్రకాశ్, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాకోబు, ఉపాధ్యాయులు భిక్షపతి, ప్రసాద్, భాగ్యలక్ష్మి, ఉమాకుమారి, సంధ్యారాణి, సుకన్య, రేఖ పాల్గొన్నారు. మైనారిటీ గురుకులంలో ‘తఖ్‌మీల్ ఏ ఖురాన్’ న్యూశాయంపేట : కేయూ క్రాస్‌రోడ్‌లోని వరంగల్–1, మైనార్టీ గురుకులంలో బుధవారం తఖ్‌మీల్ ఏ ఖురాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుకు లంలో విద్యానభ్యసిస్తున్న 34 మంది మైనార్టీ వి ద్యార్థులు ఖురాన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రిన్సిపాల్ డి.కృష్ణకుమారి శాలువాలతో స న్మానించిసర్టిఫికెట్స్ అందజేశారు. అధ్యాపకులు, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెన్నకేశవస్వామి కల్యాణంమడికొండ : కాజీపేట మండలంలోని మడికొండలో గల శ్రీ శివకేశవ ఆలయంలో బుధవారం వైభవంగా చెన్నకేశవ స్వామి కల్యాణం జరిపించారు. ఉదయం నుంచి అర్చకులు వంశీకృష్ణచార్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వైభవంగా శ్రీదేవి, భూదేవి, శ్రీలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవస్వామి కల్యాణతంతును చేపట్టారు. తౌటిరెడ్డి విద్యాసాగర్‌రెడ్డి, దొంతుల శంకర్ లింగం,ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, పింగిళి రఘునాథరావు, సురేష్‌కుమార్ పాల్గొన్నారు. -
డీజిల్ షెడ్లో రైల్వే హెల్త్ క్యాంప్
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో బుధవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. రైల్వే ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ ధీరజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో డాక్టర్లు నరేందర్హిర్వాని, ఉత్తమ్, ప్రవళిక, వైద్య సిబ్బంది 180 మంది రైల్వే ఎంప్లాయీస్‌కు పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. నేడు(గురువారం) కూడా కార్మికుల కోసం హెల్త్ చెకప్ క్యాంపును నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్కె. జానిమియా, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, సత్యనారాయణ, శివప్రసాద్, మాషుజాని, రాజయ్య, శ్రీధర్, రైల్వే వైద్య సిబ్బంది కవిత, రమాదేవి, ప్రసాద్, మల్లేష్, గోపి, కార్మికులు పాల్గొన్నారు. వైద్యశిబిరానికి అపూర్వ స్పందన ఖిలా వరంగల్ : వరంగల్ 32వ డివిజన్ బీఆర్ నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ పద్మాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా లయన్‌క్లబ్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్‌రెడ్డి, డాక్టర్ సిరికొండ భాస్కర్‌రావు, ధరణికొటి వీణావాణి హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. -
బాలల రక్షణలో పేరెంట్స్‌దే కీలకపాత్ర
● అడిషనల్ డీసీపీ ఎన్.రవిహన్మకొండ: బాలలను ఆన్లైన్ వేధింపుల నుంచి రక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని వరంగల్ పోలీసు కమిషనరేట్ అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని ‘అసుంత’ భవన్లో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో వరంగల్, హనుమకొండ జిల్లాలోని ఎంపిక చేసిన తల్లిదండ్రులకు ‘ఆన్లైన్లో బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులు–దానిని నిరోధించడంలో తల్లిదండ్రుల పాత్ర’ అనే అంశంపై వర్క్‌షాపు జరిగింది. అడిషనల్ డీసీపీ ఎన్.రవి మాట్లాడుతూ మారుతున్న సమాజంలో ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ జీవన విధానంలో భాగమైందని, వినియోగంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కౌమార బాలలు దీని బారిన పడుతున్నారన్నారు. బాలలను వేధింపులకు గురి చేస్తే 1930, 100, 1098 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ పి.వెంకన్న, మై చాయిస్ ఫౌండేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ జె.క్రాంతి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తల్లిదండ్రులకు అర్థమయ్యేలా వివరించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో వయోవృద్ధుల ట్రిబ్యునల్ సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితారెడ్డి, హనుమకొండ జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పరికి సుధాకర్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ ఎస్.భాస్కర్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీకాంత్, మేనేజర్ అజయ్ కుమార్, ఫీల్డ్ కోఆర్డినేటర్ ఈసంపల్లి సుదర్శన్ పాల్గొన్నారు. -
పీడీఎస్‌యూ నాయకుల నిరసన
కేయూ క్యాంపస్ : అమెరికాలోని భారతీయ వలసదారులను అక్రమంగా బంధించి వెనక్కి పంపుతున్న ఆ దేశాధ్యక్షుడి చర్యలను, అలాగే మోదీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం కేయూ మొదటి గేట్‌వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, ఉపాధ్యక్షుడు బి.నర్సింహారావు మాట్లాడుతూ అగ్రరాజ్యమైన అమెరికా తన నూతన ఆర్థికవిధానాలు ఇతర దేశాలపై బలవంతంగా రుద్దారని దీంతో వివిధ దేశాల్లో వలసలు పెరిగాయన్నారు. విద్యా, ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన వారి మనుగడ అధ్యక్షుడి చర్యలతో జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. అక్రమ వలసదారులంటూ భారతీయులపై అమెరికా అధ్యక్షుడి చర్యలను మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కావ్య, అనూష, కన్వీనర్ బాలు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీచైతన్యలో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్
వరంగల్ : వరంగల్ ఎల్బినగర్లోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు అతిథులుగా హాజరు కాగా వారికి సన్మానం నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ బండారి కిరణ్ మాట్లాడుతూ..జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులను దూరం చేయొద్దని అన్నారు. చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం రాజేశ్వర్‌రెడ్డి, కోఆర్డినేటర్ తిరుమల్‌రెడ్డి, డీన్ వెంకటేశ్, జనార్దన్, శ్వేత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఆధునిక సాగుపై అవగాహన ఉండాలి
ఖిలా వరంగల్ : ఆధునిక వ్యవసాయ సాగు విధానంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న, శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు బుధవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎస్ఆర్ యూనివర్సిటీ విద్యార్థులు సందర్శించారు. ఈసందర్భంగా నూతన సాగువిధానం, పంటలను విద్యార్థులు పరిశీలించారు. అనంతరం చేపలు, నాటుకోళ్ల పెంపకం వల్ల వచ్చే లాభాలను వివరించారు. ఎస్ఆర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి కృష్ణారెడ్డి, శ్రీను, శ్రావ్య, పూజ, శ్రీవాత్సవ్, మానస, అమిత్, రవితేజ పాల్గొన్నారు -
పింఛన్.. ఇప్పించండి
కాజీపేట : కాజీపేటలోని డీజిల్‌కాలనీకి చెందిన కొరవి గణేష్‌కు ఐదేళ్ల క్రితం పక్షవాతం రావడంతో దాతల సాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ప్రస్తుతం బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. అయితే గణేష్ పక్షవాతానికి గురికావడంతో సరిగ్గా నడవలేని పరిస్థితి ఏర్పడింది. మిత్రుల సహకారంతో ఎంజీఎం ఆస్పత్రి నుంచి సదరం ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నాడు. తనకు పింఛన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా ఎదురు చూస్తున్నట్లు గణేష్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. దీనస్థితిలో ఉన్న గణేష్‌ను కుటుంబీకులు భారంగా భావిస్తుండటంతో మనసులోని బాధను ఎవరితో చెప్పుకోలేక కుమిలి పోతున్నాడు. ఇప్పటికై నా పింఛన్ అందించి ఆదుకోవాలని గణేష్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. కలెక్టర్ స్పందించి పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
కార్పొరేట్‌కు అనుకూలంగా బడ్జెట్
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్‌కు అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వివక్ష చూపడంపై బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నాయకులు చేతికి సంకెళ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అమలును బీజేపీ నిర్లక్ష్యం చేసిందని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించలేదన్నారు. లక్షలాదిమంది యువకులకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టును మూలకు పడేయడం దారుణమన్నారు.బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం ద్వారా దేశీయ ఎల్ఐసీ, జీఐసీలపై ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, ఎన్.జ్యోతి, సదాలక్ష్మి, కె.శివాజీ, ఎస్.వాసుదేవ రెడ్డి, ఎ ం.చుక్కయ్య, బొట్ల చక్రపాణి, మద్దెల ఎల్లేష్, ఉ ట్కూరి రాములు, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, రాసమల్ల దీనా, బత్తిని సదానందం, మా లోతు శంకర్ నాయక్, సుదర్శన్, మెట్టు శ్యామ్ సుందర్ రెడ్డి, రొంటాల రమేష్, దేవా, కామెర వెంకటరమణ, గుంటి రాజేందర్, నిమ్మల మనోహర్, వీరన్న నాయక్, జి.రాములు, సాంబయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్లో.. వరంగల్ చౌరస్తా : కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. 10 కమ్యూనిస్టు, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం వరంగల్ హెడ్‌పోస్టాఫీస్ సెంటర్లో ధర్నా చేశారు. దీంతో అరగంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూడెమొక్రసీ నేత రాచర్ల బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, పలు పార్టీల నాయకులు గంగుల దయాకర్, అక్కెనపల్లి యాదగిరి, సుంచు జగదీశ్వర్, సత్యనారాయణ, ఎండీ బషీర్, ఆడెపు సదయ్య, పనాస ప్రసాద్, ఐతం నగేశ్, టి.భవాని, దుర్గయ్య, ఇనుముల శ్రీనివాస్, రంజిత్, గన్నారపు రమేశ్, గండ్రతి హరిబాబు, ప్రశాంత్, మాలి ప్రభాకర్, దేశెట్టి సమ్మయ్య, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
కాలనీలో సౌకర్యాలు కరువు
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం న్యూశాయంపేటలోని సుర్జీత్నగర్కాలనీలో స్థానికులు సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో కాలనీవాసులు అసౌకర్యాల నడుమ దుర్భారజీవితం కొనసాగిస్తున్నారు. 20ఏళ్ల క్రితం ప్రభుత్వ భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెల్లో సుమారు 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. కాగా అనేక పోరాటాలతో 2015లో 300 మందికి, 2024లో 58 జీఓ ప్రకారం 300 మందికి పట్టాలిచ్చారు. అయితే కాలనీలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తుండడంతో దుర్భార జీవితాన్ని గడుపుతున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కరువు సుర్జీత్‌నగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల ఏర్పాటులో అధికారులు అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో మురుగునీరు ఇళ్లలోకి పారుతూ దుర్వాసనతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.డ్రెయినేజీ ఏర్పాటు చేయాలి కాలనీ నుంచి బయట అడుగుపెట్టాలంటే ఇబ్బందిగా ఉంది, వెంటనే అధికారుల స్పందించి సీసీ రోడ్లు,సైడ్ డ్రెయినేజీల నిర్మాణం చేపట్టి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలి. వర్షాకాలంలో సరైన రోడ్లు లేక బురదలో ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంది. మురుగు నీటి దుర్వాసనతో దోమలు స్వైరవిహారం చేస్తు జ్వరాలబారిన పడుతున్నాం. – రజిత, సుర్జీత్‌నగర్ కాలనీఇళ్లు నిర్మించి ఇవ్వాలి.. సుర్జీత్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 500 కుటుంబాల్లో 300 మందికి పట్టాలిచ్చారు. మిగతా 200 కుటుంబీకులకు సైతం పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సొంత భూమిలేక 20ఏండ్లుగా కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేదలను ఆదుకోవాలి. – కారు ఉపేందర్, సుర్జీత్‌నగర్ కాలనీ వ్యవస్థాపకుడు●సుర్జీత్నగర్కాలనీలో సమస్యల తిష్ట సీసీ రోడ్లు, డ్రెయిజీలు లేక స్థానికుల ఇబ్బందులు