తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
● దేవాదుల నీటి పంపింగ్‌కు
లేఖ రాయండి
● అధికారులకు నగర మేయర్
సుధారాణి సూచన
వరంగల్ అర్బన్ : వేసవిలో నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం ఆమె ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. ప్రస్తుత నీటి నిల్వ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగర అవసరాల కోసం 710 ఎంఎస్‌ఎఫ్‌టీల నీరు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ నీటిని వచ్చే నాలుగు నెలలపాటు పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదులనుంచి నీటి పంపింగ్ కోసం ఇరిగేషన్ అధికారులకు లేఖ రాయాలన్నారు. అనంతరం ధర్మసాగర్ 60ఎంఎల్‌డీ ఫిల్టర్ బెడ్‌ను తనిఖీ చేసి నీటి శుద్ధితీరును అడిగి తెలుసుకున్నారు.
ఎల్‌బీ కళాశాలలో
ఇంటర్ మూల్యాంకన క్యాంపు
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లా కేంద్రంగా ఎల్‌బీ కళాశాలలో ఇంటర్ మూల్యాంకన క్యాంపు ఏర్పాటు చేసేందుకు ఇంటర్ బోర్డు అధికా రులు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్‌సుమన్ తెలిపారు. గతంలో హనుమకొండ కేంద్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల ఇంటర్ మూల్యాంకన ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు. 6 జిల్లాలకు ఒక్క క్యాంపు అసౌకర్యంగా ఉందని గుర్తించిన అధికారులు జిల్లా కేంద్రంగా కొత్త మూల్యాంకన కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎల్‌బీ కళాశాలలో ఏర్పాటు కానున్న క్యాంపులో మహబూబా బాద్, ములుగు, వరంగల్ జిల్లాల కోడింగ్ వాల్యుయేషన్‌కు సంబంధించిన పనులు మార్చి నుంచి ప్రారంభించడానికి ఆదేశాలు జారీచేసినట్లు శ్రీధర్‌సుమన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment