Bhadradri
-
అపార్ ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయండి
బూర్గంపాడు: విద్యార్థుల అపార్ ఐడీ ఆన్లైన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని డీఈఓ వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలను, బూర్గంపాడులోని టీఎస్ఆర్ఎస్(బాలికల)పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉప్పుసాకలో విద్యార్థుల అపార్ ఐడీ ఆన్లైన్ ప్రక్రియ వెనుకబడి ఉండటాన్ని గుర్తించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బూర్గంపాడు టీఎస్ఆర్సీలో విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సతీష్, నాగరాజశేఖర్, సైదులు పాల్గొన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచాలి అశ్వాపురం: విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని మిట్టగూడెం జెడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ బాలమేళా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మిట్టగూడెం కాంప్లెక్స్ పరిధిలోని 15 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనగా.. పాఠశాలల వారీగా విద్యార్థులు టీఎల్ఎం నమూనాలు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన డీఈఓ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ బాలమేళా కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. మారుమూల ప్రాంత పాఠశాలలు మిగతా మండలాల వారికి ఆదర్శంగా ఉంటడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఎఫ్‌ఎల్‌ఎం బాలమేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ వెంకటేశ్వరాచారి -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సిబ్బందికి ఆదేశించారు. పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద వాహన తనిఖీలను, చెక్‌పోస్ట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకోవాలన్నారు. అంతకుముందు చర్ల మండలం మొగళ్లపల్లి, వీరాపురం, చింతకుంటలో ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఎవరైనా ఇసుక అక్రమంగా తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో చర్ల, భద్రాచలం సీఐలు రాజు వర్మ, రమేష్, పాల్వంచ రూరల్ ఎస్ఐ సురేష్, తదితరులు పాల్గొన్నారు. చెక్‌పోస్టు తనిఖీ.. పాల్వంచరూరల్ : మండల పరిధిలోని నాగారం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఎస్పీ రోహిత్‌రాజ్ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించాక సిబ్బందితో మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలను పట్టుకుని చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వాహనాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.చెక్‌పోస్ట్ సిబ్బందికి ఎస్పీ ఆదేశం -
కేసులు త్వరగా పరిష్కరించాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదిర్శి భానుమతి కొత్తగూడెంటౌన్: జాతీయ లోక్ అదాలత్‌తో త్వరితగతిన కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. బుధవారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్లో న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీమా కంపెనీలు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసుల్లో కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లోక్ అదాలత్‌లో రాజీపడితే కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాది రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
30 ఏళ్లు దాటినవారికి వైద్య పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: చాపకింద నీరులా వ్యాపిస్తున్న మధుమేహం, రక్తపోటు, కేన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను కట్టడి చేసేందుకు 30 ఏళ్ల వయసు దాటిన వారిందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరన్ తెలిపారు. బుధవారం వైద్య, ఆరోగ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మార్చి 31 వరకు రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధి నిర్ధారణ తర్వాత బాధితులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించాలికొత్తగూడెంఅర్బన్: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంఎచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ నాయక్ వైద్యాధికారులను సూచించారు. బుధవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. నేషనల్ హెల్త్ పాలసీలను 100శాతం పూర్తి చేయాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాము, సిబ్బంది ఉన్నారు. రామాలయ మాజీ ప్రధానార్చకుడు మృతిభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు పొడిచేటి జగన్నాఽథాచార్యులు(71) అనారోగ్యంతో మృతి చెందిన విషయం బుధవారం ఆలస్యంగా దేవస్థానం వర్గాలకు తెలిసింది. భక్త రామదాసు శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన ఐదు వంశాల్లో పొడిచేటి వంశానికి చెందిన జగన్నాఽథాచార్యులు 1954 జనవరి 1న జన్మించారు. నాలుగున్నర దశాబ్దాల పాటు ఆలయంలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన చివరకు ప్రధానార్చకులుగా కొనసాగుతూ 2018 డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేశారు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందారు. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవ క్రతువుల్లో ఆయన పలుమార్లు కీలక పాత్ర పోషించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధందుమ్ముగూడెం: మండలంలోని పెద్దఅర్లగూడెం గ్రామానికి చెందిన పాయం ముత్యాలక్క ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బుధవారం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సామగ్రి, పట్టాదారు పాస్ బుక్‌లు, ఆధార్‌కార్డులు మంటల్లో కాలిపోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఘటనా స్థలాన్ని ఆర్ఐ నరసింహారావు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, ముత్యాలక్క కుటుంబానికి విజయవాడకు చెందిన పీవీ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యుడు కృష్ణారావు తక్షణ సాయంగా ప్రకటించిన రూ.5 వేలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరమాచినేని వినీల్ అందజేశారు. నాయకులు కనుబుద్ది దేవా, నటరాజ స్వామి, వాసం రాంకుమార్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. మహిళ మెడలో గొలుసులు అపహరణభద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఇందిరా మార్కెట్లో ఉన్న ఓ కిరాణా దుకాణం నిర్వహకురాలు సుశీల మెడలో గొలుసులను బుధవారం దుండగులు అపహరించారు. తాగునీటి సీసా కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేసి, బాటిల్ తీసుకుని వెళ్లే సమయంలో ఆమె మెడలో ఉన్న రూ.6 లక్షల విలువైన రెండు బంగారపు గొలుసులు లాక్కెళ్లారు. బాధితురాలు సుశీల డయల్ 100కు ఫోన్ చేయగా, టౌన్ సీఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా గొలుసులు లాక్కెళ్లినప్పుడు సుశీల మెడకు గాయాలయ్యాయి. సీఐ రమేష్ కేసు నమోదు చేశారు. -
64 కేజీల గంజాయి స్వాధీనం
మణుగూరు టౌన్: ఒడిశా నుంచి మణుగూరు మీదుగా బెంగళూరుకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కరమ్‌చంద్ కథనం ప్రకారం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి కేరళకు చెందిన మహ్మద్ జమీర్ కారులో బెంగళూరుకు గంజాయి తరలిస్తున్నాడు. పక్కా సమాచారంతో కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్, మణుగూరు ఎక్సైజ్ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. మణుగూరు రథంగుట్ట అర్బన్ పార్క్ సమీపంలో అనుమానాస్పద వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేయగా, 64 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయి, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కారు విలువ రూ.19.10 లక్షలు ఉంటుందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఐ రాజిరెడ్డి, ఎస్ఐలు గౌతమ్, కిశోర్‌బాబు, సిబ్బంది హబీబ్ పాషా, వెంకట నారాయణ, సుమంత్, ప్రసన్న, శ్రీను, ఆంజనేయులు, పార్ధసారథి, రమేశ్ పాల్గొన్నారు. గంజాయి పట్టుకున్న బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఖమ్మం డివిజన్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితరులు అభినందించారు. భద్రాచలంలో 17 కేజీలు..భద్రాచలంఅర్బన్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విక్రయించేందుకు రెండు బైక్‌లపై నలుగురు యువకులు 17 కేజీల గంజాయిని ఒడిశా సరిహద్దు నుంచి తీసుకెళ్తుండగా పట్టణంలోని కూనవరం రోడ్డులో బుధవారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నా రు. ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గంజాయిని, రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు భద్రాచలం ఎకై ్సజ్ సీఐ షేక్ రహీమున్నీసా బేగం తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ అల్లూరి సీతారామరాజు, సిబ్బంది ఆలీం, జమాల్, బాబు, వీరబాబు, లలిత, రాకేష్, కిరణ్ ఉన్నారు. కారు స్వాధీనం, ఒకరి అరెస్ట్ -
బడ్జెట్ కేటాయింపులపై పునరాలోచించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలకు మేలు చేసేలా కాకుండా కార్పొరేట్ శక్తులు, సంపన్నవర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ, సీపీఎం, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యాన బుధవారం కొత్తగూడెంలో బడ్జెట్‌పై నిరసన తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కూనంనేని మాట్లాడుతూ రైతులు, కార్మికులకు వ్యతిరేకంగానే కాక విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. బడ్జెట్ మార్చాలన్న తమ ప్రధాన డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎస్.కే.సాబీర్‌పాషా, మచ్చ వెంకటేశ్వరరావుతో పాటు వివిధ పార్టీల నాయకులు గౌని నాగేశ్వరరావు, కందగట్ల సురేందర్, పి.సతీష్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, రత్నకుమారి, ఫహీం, లిక్కి బాలరాజు, కె.బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, కె.లక్ష్మి, ఎన్.రమేష్, అభిమన్యు, నాగకృష్ణ, జె.సీతారామయ్య, ఉమ, అలీముద్దీన్, ఎం.రాజశేఖర్, నక్కా లావణ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద భద్రత పెంపు
● ఇటీవల కానిస్టేబుల్‌ను బైక్‌తో ఢీ కొట్టి పారిపోయిన స్మగ్లర్లు ● తనిఖీలు చేస్తున్నా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనివైనం భద్రాచలంఅర్బన్: పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత పెంచారు. భద్రాచలం మీదుగా జరుగుతున్న గంజాయి, ఇతర ప్రభుత్వ నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టే బుల్‌ను ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. రెండు నెలల క్రితం ఇదే విధంగా ఓ ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ అనంతయ్యను కూడా ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టు వద్ద భద్రత పెంచారు. అదనంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ షిఫ్ట్‌లో ఓ ఎస్ఐ స్థాయి అధికారి, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ముగ్గురు టీజీపీఎస్పీ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా వీరికి అదనంగా సీఆర్పీఎఫ్ బలగాలను కూడా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పోలీసులను ఢీకొట్టి గాయపర్చిన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని, అప్పుడే పోలీసులు మనోధైర్యంతో విధులు నిర్వర్తిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇసుక వాహనాలపై పోలీసుల నిఘా
మణుగూరు టౌన్/టేకులపల్లి/పినపాక: జిల్లాలో కొద్ది రోజులుగా పోలీసులు అక్రమ ఇసుక తరలింపుపై నిఘా పెట్టారు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమతిలేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. బుధవారం 9 ట్ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మణుగూరు పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో అక్రమంగా గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. రామానుజవరం గ్రామం, పట్టణంలోని చినరావిగూడెం ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ సోమ సతీష్ తెలిపారు. టేకులపల్లి మండల పరిధిలోని శంభునిగూడెం ప్రాంతంలో ముర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు టేకులపల్లి ఎస్ఐ పోగుల సురేష్ తెలిపారు. వాహనదారుడు బాణోతు శంకర్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పినపాకమండలంలోని జానంపేట పంచాయతీ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఈ. బయ్యారం ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. అక్రమంగా రవాణా చేస్తున్న తొమ్మిది ట్రాక్టర్లు సీజ్ -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
సత్తుపల్లిరూరల్/దమ్మపేట: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో బుధవారం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడేనికి చెందిన కేతేపల్లి జానకీరాం బైక్‌పై పట్వారిగూడెం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా.. దమ్మపేట మండలం జగ్గారానికి చెందిన మడివి నాగేంద్రబాబు, వగ్గెల లక్ష్మణ్ మరో ద్విచక్రవాహనంపై జగ్గారం వెళ్తున్నారు. మార్గమధ్యలోని గండుగులపల్లిలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా లక్ష్మణ్, జానకీరాం, నాగేంద్రబాబుకు తీవ్రగాయాలు కావడంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, జానకీరాం, లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, క్షతగాత్రులను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన సమయాన సిబ్బంది ఒక్కరే ఉండడంతో వారిని లోపలకు తీసుకెళ్లేందుకు 20 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అంతసేపు క్షతగాత్రులు అవస్థ పడ్డారు. సిబ్బంది లేక అంబులెన్స్‌లోనే 20 నిమిషాలు -
విత్తు.. వనమైతే!
ఇళ్లలో విరివిగా పండ్ల వినియోగం ● చెత్త బుట్టల్లోకి చేరుతున్న గింజలు ● అడవుల్లో వెదజల్లితే అందరికీ ‘ఫలాలు’ ● వన్యప్రాణులకూ తీరనున్న ఆహార సమస్య ఇళ్లలో పండ్లు తిన్న తర్వాత వాటి గింజలను సేకరించి, అడవుల్లో వేయడం ద్వారా అనేక రకాల పండ్ల మొక్కలు అడవుల్లో మళ్లీ చిగురించే అవకాశం ఉంది. తద్వారా అడవుల్లోని జీవరాశులకు సైతం ఆహార కొరత తీరేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా కోతుల వంటివి గ్రామాలపై పడి దాడి చేయకుండా అడవుల్లోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅగ్ని ప్రమాదాలతో అనర్థం.. అడవుల్లో చెట్లకు కాసే పండ్లను పక్షులు, కోతులు, ఇతర వన్యప్రాణులు తింటాయి. ఈ క్రమంలో ఆయా చెట్ల కాయలు, వాటిలోని గింజలు వేర్వేరు ప్రాంతాల్లో పడుతుంటాయి. ఆ విత్తనాలు భూమిపై పడి వర్షాలు పడగానే తిరిగి మొలకెత్తుతుంటాయి. అయితే అడవుల్లో మానవ సంచారం పెరిగిన తర్వాత తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో అయితే ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంది. ఇలా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎండిపోయిన ఆకులకు నిప్పంటుకుని దావానంలా చుట్టు పక్కల ప్రాంతాలకూ మంటలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద చెట్లకు నష్టం కొంతయితే.. అడవిలో నేలపై రాలిపోయిన గింజలు/విత్తనాలు మాడిమసవడం ద్వారా అధిక నష్టం జరుగుతోంది. దీంతో సహజ పద్ధతిలో అడవుల విస్తరణ ఆశించిన మేర పెరగడం లేదు. అటవీ శాఖ నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటితేనే అడవులు మనుగడ సాగిస్తున్నాయి. గింజలు కాపాడితే.. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జామ, కీరదోస, పుచ్చకాయ, సపోట, మామిడి, దానిమ్మ, బత్తాయి, రేగు, సీతాఫలం, సంత్రాలు తదితర పండ్లతో పాటు యాపిల్, చెర్రీ, బెర్రీ వంటి పండ్లను విరివిగా కొనుగోలు చేసి తింటుంటాం. పండ్లను తిన్న తర్వాత మిగిలిన గింజలను డస్ట్‌బిన్‌లో పడేసి ఆ తర్వాత మున్సిపల్/పంచాయతీ చెత్త కుండీల్లో వేస్తుంటాం. దీంతో ప్రకృతిలో ఎంతో విలువైన విత్తనాలు వృథా అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పండ్లు తిన్న తర్వాత మిగిలే గింజలను నిల్వ చేసి, వేసవిలో ఎండబెట్టడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించొచ్చు. దృఢంగా పెరుగుతాయి.. సాధారణంగా నర్సరీల్లో అంటు కట్టడం ద్వారా పెంచే మొక్కలంటే విత్తనం ద్వారా అడవిలో మొలకెత్తే చెట్టు బలంగా ఉంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. నర్సరీ నుంచి తెచ్చి నాటిన మొక్కకు ట్రీగార్డ్ ఏర్పాటు చేసి, సరిపడా నీరు అందించినప్పుడే అది చెట్టుగా ఎదుగుతుందని, అదే విత్తనం నుంచి వచ్చిన మొక్క అయితే ప్రకృతి అడ్డంకులను ఎదుర్కొని బలంగా పెరుతుందని అంటున్నారు. పదేళ్లుగా ఇదే పని ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొందిన తర్వాత అడవుల పెంపకంపైనే దృష్టి పెట్టాను. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వివిధ గింజలను సేకరించడం, ఎండబెట్టడం.. ఆ తర్వాత వాటిని అడవులు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లడం చేస్తుంటాను. వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు అక్కడా ఇదే పని చేస్తుంటా. ఇటీవల కుంభమేళాకు వెళ్లి అక్కడి ప్రజలకు మన దగ్గర దొరికే పండ్ల గింజలు ఇచ్చి వచ్చా. గత పదేళ్లలో నేను చల్లిన ఎన్నో విత్తనాలు ఆ తర్వాత మొక్కలై ఇప్పుడు చెట్లుగా మారాయి. గింజలను వృథాగా చెత్త బుట్టల్లో వేయొద్దు. కొంత సామాజిక బాధ్యతగా ఎండబెట్టి.. వీలున్నప్పుడు ఖాళీ ప్రదేశాలు, అడవుల్లో వేయండి. – హరినాథ్, ప్రకృతి ప్రేమికుడు ఆ గింజలు అడవుల్లో వేస్తే.. వేసవికాలంలో ఎండబెట్టిన గింజలను రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తర్వాత ఇంటి నుంచి వేరే ఊళ్లకు లేదా బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోడ్ల పక్కన, బంజరు భూముల్లో, అడవుల్లో, ముళ్ల పొదల్లో, చిట్టడవుల దగ్గర జల్లడం ద్వారా ఆయా గింజలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. వంద గింజలు విసరితే కనీసం పది గింజలు మొలకెత్తినా, అందులో ఒకటి మొక్కగా మారి చెట్టయినా ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి, పరోక్షంగా మానవాళికి ఉపయోగకరంగా మారుతుంది. -
నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం సూపర్‌బజార్(కొత్తగూడెం): అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఇతర అధికారులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహ, వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటో జనరేటర్లు సిద్ధం చేయాలన్నారు. రైతు భరోసా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియకు పార్షియల్ సబ్‌డివిజన్ మార్కింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని, తహసీల్దార్లు, మండల వ్యవసాయాధికారులు తమ పరిధిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల మార్కింగ్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఎంత యూరియా అందుబాటులో ఉంది, ఇంకా ఎంత అవసరమో నివేదికలు అందజేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు. పోటీలకు రావడమే తొలి విజయంఅశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలల్లో శాస్త్రవేత్తలుగా, వివిధ హోదాల్లో ఉన్నవారు క్రీడా పోటీలకు రావడమే తొలి విజయంగా భావించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల మైదానంలో ఏజీ యూనివర్సిటీ పరిధిలోని నాలుగు జోన్ల క్రీడా పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటల్లో పోటీతత్వం ఉండాలని, అప్పడే లక్ష్యం చేరుకుంటామని అన్నారు. క్రీడలతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ క్రీడాలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఇక్కడి పచ్చని వనాలు, పామాయిల్ తోటలు, నర్సరీలు స్వాగతం పలుకుతాయని అన్నారు. ఈనెల 22 వరకు జరిగే ఈ పోటీలకు నాలుగు జోన్ల పరిధిలోని 9 కళాశాలల నుంచి 110 మంది బోధనా సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, అబ్జర్వర్ సురేష్, కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్, ఎస్.మధుసూధన్ రెడ్డి, శ్రావణ్ కుమార్, శీరిష తదితరులు పాల్గొన్నారు. మునగ సాగు విస్తరించాలి.. మునగ పంట సాగును మరింత విస్తరించేలా కృషి చేయాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పంట సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వాలు అందించే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనం కృష్ణ ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ సోయం ప్రసాద్‌రావు పాల్గొన్నారు. విద్యతోనే భవిష్యత్ బాగుంటుందికొత్తగూడెంఅర్బన్: విద్యతోనే భవిష్యత్ బాగుంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు. సందేహాలుంటే ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని చెప్పారు. 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి మేలు చేసే మునగ, కరివేపాకును వంటల్లో వినియోగించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం కొండలరావు, ఎంపీడీఓ చలపతి తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలంటే భయం వద్దు
● ఉన్నత విద్యకు ‘పది’ ఫలితాలే పునాది ● తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయాలి ● ఐటీడీఏ పీఓ రాహుల్ అశ్వారావుపేటరూరల్: పదో తరగతి పరీక్షలకు ఇంకా నెల రోజుల సమయం ఉందని, పరీక్షలంటే విద్యార్థుల్లో భయాందోళనలు సహజమని, భయాన్ని వీడాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వార్షిక పరీక్షల్లో పాటించాల్సిన మెళకువలు, జాగ్రత్తలపై సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్ పదో తరగతి మార్కులతోనే ఆధారపడి ఉంటుందని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రతిరోజూ స్టడీ అవర్స్ నిర్వహించాలని హెచ్ఎం భావ్‌సింగ్‌కు సూచించారు. పాఠశాల భవన మైనర్ రిపేర్లు చేయించాలని ఏఈఈ ప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఎస్ఓ ఉదయభాస్కర్, ఏటీడీఓ చంద్రమోహన్, ఎస్సీఆర్పీ రాజబాబు పాల్గొన్నారు. స్వశక్తితో ఎదగాలి.. ములకలపల్లి: నిరుద్యోగులు ఐక్యంగా కుటీర పరిశ్రమలు స్థాపించి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని పాతగంగారంలో ఏర్పాటు చేసిన గిరిజన సాఽధిక బ్రిక్స్ యూనిట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నలుగురు బృందంగా ఏర్పడి రూ.15 లక్షల సబ్సిడీతో రూ.25 లక్షల వ్యయంతో బ్రిక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ఇటుకలను మార్కెటింగ్ చేసి, చక్కటి లాభాలు ఆశించాలని సాధిక బ్రిక్ యూనిట్ సభ్యులకు సూచించారు. ఆయన వెంట టీజీబీ మేనేజర్ నరేశ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేశ్ తదితరులు ఉన్నారు. ప్రాథమిక విద్యే పునాది దమ్మపేట : ప్రాథమిక విద్యే చిన్నారుల భవితకు పునాదని పీఓ రాహుల్ అన్నారు. మండలంలోని కొడిసెలగూడెం, అంకంపాలెం పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. కొడిసెలగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన, పఠన, రాత సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారి పేర్లు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారని, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో వేరే వారిని నియమించాలని ఏటీడీఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. పాఠశాలలపై ఎస్సీఆర్పీల పర్యవేక్షణ ఉండాలన్నారు. అంకంపాలెం పాఠశాలలో కెరీర్ గైడెన్స్ చార్ట్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలను గుర్తించి, వాటిని పెంపొందించుకునేలా సరైన తోడ్పాటు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం శారద, వార్డెన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గ ర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సింగరేణి డైరెక్టర్ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)గా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆడ్రియాల ప్రాజెక్ట్ జీఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఇటీవల యాజమాన్యం డైరెక్టర్‌గా నియమించింది. ఈ నేపథ్యాన కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించగా జీఎంలు, వివిధ విభాగాల ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అటవీ అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలుసీసీఎఫ్ భీమానాయక్ అశ్వాపురం : అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎఫ్ ధరావత్ భీమానాయక్ అన్నారు. మండలంలోని వేములూరు, మనుబోతులగూడెం, రేగులగండి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి అటవీ శాఖ ఆధ్వర్యంలో వేయనున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. మనుబోతులగూడెంలో అటవీ అధికారుల కోసం నిర్మించిన క్వార్టర్లను సందర్శించారు. గ్రామంలో ఇటీవల ఎఫ్ఆర్ఓపై గిరిజనులు దాడి చేసిన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తేగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మొండికుంట నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట డీఎప్‌ఓ కృష్ణాగౌడ్, ఎఫ్డీఓ సయ్యద్ మక్సూద్, రేంజర్ రమేష్ తదితరులు ఉన్నారు. -
గర్భగుడికి చేరుకున్న రెక్కల రామక్క
గుండాల: ఆళ్లపల్లి మండలం పెద్దూరు గ్రామంలో రెక్కల రామక్క జాతర కొనసాగుతోంది. బుధవారం దేవతను గర్భగుడికి తీసుకొచ్చారు. తొలిరోజు మంగళవారం గుడి మెలుగుట, కర్రదించుట, దేవతకు కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు ఘనంగా చేశారు. రెండో రోజు బుధవారం ప్రత్యేక పూజలు, డోలి చప్పుళ్ల నడుమ వేల్పులోద్ది గుట్ట నుంచి అమ్మవారిని గర్భగుడికి తీసుకొచ్చారు. ఎదురుకోలు ఉత్సవం జరిపారు. పూజారులు కొమరం కనకయ్య, సీతయ్య, లాలయ్య, రఘుపతి, రవి, ఆర్తి బిడ్డ కత్తుల సతీష్, వడ్డె ఈసం రామయ్య ఆధ్వర్యంలో పూజలు చేశారు. కాగా ఈ జాతర ఐదురోజులపాటు సాగనుంది. గురువారం పాండవుల గుట్టనుంచి వనదేవతను తీసుకొచ్చే ఘటనతో నిండు జాతర మొదలవుతుంది. దేవతలను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. -
వేళ్లూనుకున్న అవినీతి
ముడుపులు ముట్టజెబితేనే ప్రభుత్వ శాఖల్లో పనులు ● కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్న ప్రజలు ● ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో ఏసీబీకి చిక్కిన 15 మంది ఉద్యోగులుపాల్వంచరూరల్: అటవీశాఖ ఇల్లెందు డివిజన్లో గత మంగళవారం కొమరారం ఎఫ్ఆర్ఓ, ఎఫ్‌బీఓలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటనతో ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. ముడుపులు ముట్టజెప్పనిదే ఏ ప్రభుత్వ శాఖలోనూ పనులు జరగడం లేదనేందుకు ఈ సంఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డవారిలో ఎక్కువ మంది భద్రాద్రి జిల్లావారే ఉన్నారు. వారిలోనూ పాల్వంచ ఉద్యోగులు, అధికారులు ఏడుగురు ఉన్నారు. ఏయే శాఖల్లో ఎవరెవరు పట్టుబడ్డారంటే...? ●గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 15 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. 2024 జనవరి 29న ఖమ్మం టూటౌన్లో రూ. 50వేలు లంచం తీసుకుంటున్న హెడ్‌కానిస్టేబుల్ పి.కోటేశ్వరరావును పట్టుకున్నారు. ●ఏప్రిల్ 18న పాల్వంచ మున్సిపల్ సూపరింటెండెంట్ అక్కిరెడ్డి వెంకటరమణి, ఉద్యోగి ప్రసన్నకుమార్ రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ●భద్రాచలం ఎస్ఐ ఎం.శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ●మే 16న అశ్వారావుపేటలో విద్యుత్‌శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ధరావత్ శంకర్ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ●మే 23న చర్ల డిప్యూటీ తహసీల్దార్ బి.భరణిబాబు రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అదే నెలలో పాల్వంచ పట్టణ ఎస్ఐ బాణాల రాము రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ●ఆగస్టు 21న ఆళ్లపల్లి మండల పంచాయతీ అఽధికారి బత్తిని శ్రీనివాసరావు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ●సెప్టెంబర్ 18న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.సూర్యనారాయణ రూ.లక్షా 14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ●పాల్వంచ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ●2025 జనవరి 25న ఇల్లెందులో ప్రభుత్వ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణ, ఆఫీసు సహాయకుడు కొచ్చెర్ల రామకృష్ణ రూ.2వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జనవరి 27న సత్తుపల్లిలోని మున్సిపల్ ఉద్యోగి ఎన్.వినోద్ రూ.2500 లంచం తీసుకుని దొరికాడు. ●ఫిబ్రవరి 18న కొమరారం ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఆర్.ఉదయ్‌కుమార్, బీట్ఆఫీసర్ ఎన్.హరిలాల్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నేరం రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింపు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు అవినీతికి పాల్పడి ఏబీసికి పట్టుబడ్డాక నేరం రుజువైతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. లంచం పుచ్చుకుంటూ దొరికిన ఉద్యోగులను ఏసీబీ అధికారులు 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. 40 రోజులు జైలులో ఉండాల్సిందే. బెయిల్ కూడా దొరకదు. కోర్టులో నేరం రుజువైతే ఆరేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అవినీతి ఉద్యోగుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుంది. కేసుల నమోదు ఇలా.. ప్రభుత్వ ఉద్యోగులు చట్టప్రకారం చేయాల్సిన పనుల విషయంలో లంచం అడగడం, తీసుకోవడం నేరం. సెక్షన్ 7 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉంటే సెక్షన్ 13 (1) ప్రకారం చర్యలు తీసుకుంటారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవకతవకలకు పాల్పడినా, ప్రజాధనం దుర్వినియోగం చేసినా సెక్షన్ 13(1) అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. అక్రమ ఆస్తుల కూడబెట్టడంలో సహకరించిన స్నేహితులు, బంధువులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. అవినీతి అధికారులను పట్టించే విషయంలో భయపడొద్దు. నిర్భయంగా సమాచారం ఇచ్చి సహకరించాలి. –వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ