
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సిబ్బందికి ఆదేశించారు. పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద వాహన తనిఖీలను, చెక్‌పోస్ట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకోవాలన్నారు. అంతకుముందు చర్ల మండలం మొగళ్లపల్లి, వీరాపురం, చింతకుంటలో ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఎవరైనా ఇసుక అక్రమంగా తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో చర్ల, భద్రాచలం సీఐలు రాజు వర్మ, రమేష్, పాల్వంచ రూరల్ ఎస్‌ఐ సురేష్, తదితరులు పాల్గొన్నారు.
చెక్‌పోస్టు తనిఖీ..
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని నాగారం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఎస్పీ రోహిత్‌రాజ్ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించాక సిబ్బందితో మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలను పట్టుకుని చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వాహనాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.
చెక్‌పోస్ట్ సిబ్బందికి ఎస్పీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment