breaking news
-
Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.
మేషం నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. చాక్లెట్, ఎరుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. వృషభం కొత్తగా అప్పులు చేస్తారు. బంధువులు,స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నేరేడు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి. మిథునం అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం చివరిలో ఆరోగ్యం సహకరించదు. వృథా ఖర్చులు. తెలుపు, ఎరుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటకం అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు సమర్థతను చాటుకుని మరింత గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువర్గం నుండి సమస్యలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాలు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. పసుపు, గులాబీరంగులు, వినాయకుని పూజించండి. కన్య ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొన్ని హామీలు లభిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. మానసికంగా ఆందోళన. నలుపు, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి. తుల కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యతిరేకులు సైతం అనుకూలంగా మారతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులు సాధించాలనుకున్న అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో ఆప్తులతో కలహాలు. రుణయత్నాలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశాష్టకం పఠించండి. వృశ్చికం చేపట్టిన కార్యక్రమాలలో విజయం. ఆదాయం పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి పొందుతారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు కలుగుతాయి. వారం ప్రారంభంలో దుబారా వ్యయం. కష్టానికి ఫలితం రాదు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి. ధనుస్సు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవార్తా శ్రవణం. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి. భూసంబంధిత వివాదాల పరిష్కారం. దేవాలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొంత బాధ్యతలు తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు కొంత ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి. మకరం ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గుర్తింపు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో బంధువర్గంతో తగాదాలు. మానసిక అశాంతి. నీలం, నేరేడు రంగులు, అంగారకస్తోత్రం పఠించండి. కుంభం ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణ. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యమైన పోస్టు రావచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో లేనిపోని వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు కొత్త అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. నీలం, లేత పసుపు రంగులు, వారం ప్రారం¿¶ ంలో దుబారా వ్యయం. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దుర్గాస్తోత్రాలు పఠించండి. -
Weekly Horoscope: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
మేషం: కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనసౌఖ్యం. ఇంటాబయటా మీకు ఎదురుండదు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి. వృషభం: అమితోత్సాహంతో పురోగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి. మిథునం: మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపై మరింత ఆదరణ చూపుతారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తుతి మంచిది. సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబ సమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. లక్ష్మీస్తుతి మంచిది. తుల: నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, నీలం రంగులు. దేవీఖడ్గమాల పఠించండి. ధనుస్సు: ఆర్థిక పరిస్థితి చాలావరకూ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. మీ ప్రతిపాదనలు అందరూ ప్రశంసిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. ఆపదలోని వారికి సైతం చేయూతనందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఖర్చులు పెరుగుతాయి. గులాబీ, తెలుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి. మకరం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చరంగులు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. కుంభం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులతో విరోధాలు. అనారోగ్య సూచనలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గామాతకు అర్చన చేయండి. మీనం: ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. -
Weekly Horoscope: ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు..
మేషం ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ప్రముఖులు మరింత సాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువుల నుండి ఒత్తిడులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. ∙వ్యవహారాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారనుంది. వాహనాలు, భూములు కొంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక ఆందోళన. కుటుంబసమస్యలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి. మిథునం నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యుల నుండి అనుకూలత లభిస్తుంది. భూ వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుండి ఊహించని పిలుపు రావచ్చు. ఆశ్చర్యరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా సానుకూలత లభిస్తుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కర్కాటకం నూతన ఉద్యోగాలను దక్కించుకుంటారు. ముఖ్య వ్యవహారాలలో విజయమే. ఒక ముఖ్య వ్యక్తిని కలుసుకుని చర్చలు జరుపుతారు. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. సోదరులతో వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. రాజకీయవేత్తలకు ఎనలేని గౌరవం లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల ద్వారా ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. సింహం కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. కొన్ని సమస్యల నుంచి బయపడతారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీపై అందరికీ ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు కొన్ని నిజం కాగలవు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య ఆర్థిక పరిస్థితి మందగించినా అవసరాలకు ఇబ్బందిరాదు. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ ప్రతిభను గుర్తిస్తూ పురస్కారాలు రావచ్చు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా నడిపిస్తారు. ఉద్యోగులకు అంచనాలు నిజం కాగల అవకాశం. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో లేనిపోని ఖర్చులు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. నీలం, లేత పసుపురంగులు, గణపతి అర్చనలు చేయండి. తుల ఇంటి ఖర్చులు పెరిగి రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మనస్సు చంచలంగా ఉంటుంది. మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని నిర్ణయాలలో సర్దుబాట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే పట్టుదలతో పరిష్కారానికి కృషి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు చేజారే సూచనలు. వ్యాపారాలలో వేగం తగ్గి నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరిగి కొంత అసంతృప్తి చెందుతారు. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. వాహనయోగం. ఆకుపచ్చ, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృశ్చికం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఒక సమస్య ఎట్టకేలకుæ పరిష్కారమవుతుంది. అత్యంత నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. సోదరులు, సోదరీలతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు.. చిన్ననాటి సంఘటనలను నెమరువేసుకుంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు.ఉద్యోగులకు అనుకోని మార్పులు లాభిస్తాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు చికాకు పరుస్తాయి. అయితే నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలించే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలను సజావుగా కొనసాగిస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, చాక్లెట్‌రంగులు, శివాష్టకం పఠించండి. మకరం కొన్ని వ్యవహారాలలో∙జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. సోదరులు, బంధువుల ద్వారా కీలక విషయాలు తెలుస్తాయి. అపరిష్కృతంగా ఉన్న వివాదాలు కొలిక్కి వస్తాయి. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలలో తగినంత లాభాలు రాగలవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. వృథా ఖర్చులు. గులాబీ, పసుపురంగులు, ఆదిత్య హృదయం పఠించండి. కుంభం కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలను తొలగించుకుని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక లావాదేవీలపై సంతృప్తి చెందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు పెట్టుబడులు పెంచుకుని విస్తరిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, కనకధారాస్తోత్రం పఠించండి. మీనం తెలివిగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. వేడుకలలో పాలుపంచుకుంటారు. వ్యాపారాలను లాభాలబాటలో నడిపిస్తారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళారంగం వారికి శుభవార్తలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, నేరేడురంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి. -
ఈరాశి వారికి అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి
మేషం కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు. దైవదర్శనాలు. వారం ప్రారంభంలో ధననష్టం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, లేత ఎరుపు రంగులు, శివాష్టకం పఠించండి. వృషభం అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని సంఘటనలు. ఆరోగ్య సమస్యలు. ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు, పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. మిథునం అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం మధ్యలో దుబారా వ్యయం. ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి. కర్కాటకం ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. వస్తులాభాలు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. సింహం కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో వివాదాలు. పసుపు, తెలుపురంగులు, గణేశాష్టకం పఠించండి. కన్య దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు రావచ్చు. కొన్ని ముఖ్య నిర్ణయాలకు వెనుకాడరు. ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషులు మీకు చేయూతనిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారస్తులు తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి మరింత అనుకూల వాతావరణం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. తెలుపు, చాక్లెట్‌రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల పనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు సంభవం. ఎరుపు, బంగారు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుకుంటాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు రావచ్చు, మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.. లేతనీలం, నేరేడురంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మకరం ఆర్థికంగా మరింత సానుకూలత ఉంటుంది. ఇతరుల నుండి ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు వేగంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. మీ అభీష్టం మేరకు కుటుంబంలో నిర్ణయాలు ఉంటాయి. పరపతి కలిగిన వారు పరిచయమవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కలసివచ్చే సమయం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు.. గులాబీ, పసుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి. కుంభం ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి.. తెలుపు, చాక్లెట్‌రంగులు, కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మీనం మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త భాగస్వాములతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుండి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువుల నుండి సమస్యలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, శివపంచాక్షరి పఠించండి. -
Weekly Horoscope: ఈ వారం రాజకీయ నాయకులకి నూతనోత్సాహం
మేషం అనుకున్న పనులు ఎంతగా శ్రమపడ్డా ముందుకు సాగవు. ఆత్మవిశ్వాసం, దృఢచిత్తంతో ముందడుగు వేయండి. ఆరోగ్య విషయాలు, వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్త అవసరం. బంధువులతో కొన్ని విభేదాలు తప్పకపోవచ్చు. ఆదాయం కొంత తగ్గి నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. శివాలయ దర్శనం మంచిది. వృషభం ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సలహాలు అందుతాయి. భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సోదరీసోదరుల మధ్య తగాదాలు తీరతాయి. వాహనయోగం కలుగుతుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు. విష్ణుధ్యానం చేయండి. మిథునం మొదట్లో కొన్ని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైనా లెక్కచేయక ముందుకు సాగుతారు. అనుకోని విజయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వివాదాలు పరిష్కరించుకుని సత్తా చాటుకుంటారు. ఎదురుచూసిన అవకాశాలతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైనరీతిలో మార్పులు ఉంటాయి. కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నీలం, పసుపు రంగులు. హయగ్రీవస్తోత్రాలు కర్కాటకం ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. అయితే , క్రమేపీ వాటిని అధిగమిస్తారు. మీ పట్టుదల, కృషికి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుని వ్యవహారాలు సా«ధిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళాకారులకు అనుకోని అవకాశాలు. వారం చివరిలో శ్రమ తప్పదు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. తెలుపు, గులాబీ రంగులు. అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి. సింహం అనుకున్న రాబడి దక్కుతుంది. కొంతకాలంగా వేధిస్తున్న వివాదాలు పరిష్కారమవుతాయి. భూములు,స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి కీలక సమాచారం అందుతుంది. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం కలిగి ఉపశమనం పొందుతారు.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి. కన్య కొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వ్యవహారాలలో నూతన అగ్రిమెంట్లు జరుగుతాయి. కొన్ని కొత్త సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్ధిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు వారం చివరిలో కలిసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. గణపతి అర్చన చేయండి. తుల ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. గతంలో నిలిచిన కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాహ కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. హనుమా ఛాలీసా పఠించండి. వృశ్చికం బాధ్యతలు సమర్థంగా నిర్వహించి పేరు సంపాదిస్తారు. గతంలోజరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులు విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి తథ్యం. ఉద్యోగులకు శుభవార్తలు వింటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధననష్టం. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు ఎంతోకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కొన్ని కార్యక్రమాలు యథాతథంగా పూర్తి చేస్తారు. జీవితాశయం సాధించేందుకు మీ యత్నాలలో బంధువులు సహకరిస్తారు. అనుకున్నది సాధించడంలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఇంటి నిర్మాణాలు కూడా ప్రారంభించే వీలుంది. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. కళాకారులకు సన్మానాలు, పురస్కారాలు. వారం చివరిలో అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. బంధువిరోధాలు. దత్తస్తోత్రాలు పఠించండి. మకరం అనుకున్న పనులు జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. జీవితాశయం సా«ధనలో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, భూములు సమకూరతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. వివాదాలను ఓర్పుతో అధిగమిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. సోదరుల మధ్య వివాదాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు పదవులు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో తగాదాలు. గులాబీ, నీలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఓర్పు, నేర్పుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆత్మీయుల సలహాలతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. కొన్ని సమస్యలు వాటంతట అవే తీరతాయి. భూములు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి అధిగమిస్తారు. కళాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. గులాబీ, పసుపు రంగులు. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019