
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీసులో పోస్టల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సాయిపోతిరెడ్డి శివారెడ్డి ఖోఖో ప్ర పంచకప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించడం గర్వకారణ మని పలువురు పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో గెలుపొందిన అనంతరం ఆయన బుధవా రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేర కు పట్టణంలోని వినాయక చౌక్‌లో పోస్టల్ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. అక్క డి నుంచి జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ కా ర్యాలయం వరకు స్వాగతించారు. అనంత రం ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ సిద్ధార్థ ఆయనను సత్కరించి మెడల్ అందించారు. ఈసందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ తాను వరల్డ్ కప్‌లో రాణించేందుకు శాఖ అధికారుల సహకారం ఎంతో ఉందన్నారు. ఇందులో పోస్ట్‌మాస్టర్ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment