breaking news
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది.కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు.ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు.ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం
గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్‌పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జయశంకర్‌నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. తన్నుకున్న తమ్ముళ్లు.. ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్ కార్యాలయం ఆవరణంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. -
నూడుల్స్‌లో డైమండ్స్ : ఏం తెలివితేటలు రా అయ్యా!
బంగారం, విలువైన వజ్రాలను అక్రమంగా రవాణా చేసేందుకు కేటుగాళ్లు అనుసరిస్తున్న పద్దతులు అధికారులను సైతం విస్మయపరుస్తున్నాయి. కానీ చివరకుఅధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికి పోతున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ కోట్లరూపాయల విలువైన వజ్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నూడుల్స్ ప్యాకెట్లలో డైమండ్స్ దాచిన తీరు హాట్ టాపిక్‌గా నిలిచింది. ముంబైనుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న భారతీయుడు ట్రాలీ బ్యాగ్‌లో నూడుల్స్ ప్యాకెట్లో డైమండ్లను తరలిస్తూ గుట్టుగా అధికారుల కన్నుగప్పాలని చేశాడు. కానీ తనిఖీల్లో అడ్డంగా బుక్కయ్యాడు. రూ.2.02 కోట్ల విలువైన 254.71 క్యారెట్ల నేచురల్ లూజ్ డైమండ్, 977.98 క్యారెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ లభ్యమయ్యాయి. మరో ఘటనలో కొలంబో నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ఒక విదేశీ మహిళను తనిఖీ చేయగా ఆమె లోదుస్తుల లోపల దాచిన 24 క్యారెట్ల గోల్డ్ బిస్కట్లు కనుగొన్నారు. వీటి మొత్తం బరువు 321గ్రాములు. మరో వైపు ఫేస్ మాస్క్‌లోనూ డైమండ్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి ఇద్దరు, అబుదాబి ఇద్దరు, బహ్రెయిన్ ఇద్దరు, దోహానుఎంచి ఇద్దరు రియాద్ ఇద్దరు మస్కట్ బ్యాంకాక్ ,సింగపూర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 10 మంది అనుమానితులను తనిఖీ చేయగా, రెక్టమ్, ఇతర శరీర భాగాల్లో దాచిన రూ.4.04 కోట్ల విలువైన 6.199 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గా 13 వేర్వేరు కేసుల్లో రూ.6.46 కోట్ల విలువైన అక్రమ రవాణా బంగారం, డైమండ్స్,తదితరాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. During 19-21 April, 2024, Airport Commissionerate, Mumbai Customs Zone-III seized over 6.815 Kg Gold valued at Rs. 4.44 Cr & Diamonds valued at Rs. 2.02 Cr total amounting to Rs. 6.46 Cr across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four pax were arrested. pic.twitter.com/j5wAPV5jAk — Mumbai Customs-III (@mumbaicus3) April 22, 2024 #WATCH | Maharashtra: During 19-21 April, 2024, Mumbai Customs seized over 6.815 Kg of gold valued at Rs 4.44 crores and diamonds valued at Rs 2.02 crores, total amounting to Rs 6.46 crores across 13 cases. Diamonds were found concealed in noodle packets. Four Passengers were… pic.twitter.com/02LzDS1aDZ — ANI (@ANI) April 22, 2024 -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్‌టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019