Sports
-
Ind vs Ban: విరాట్ కోహ్లి జట్టు గెలిచింది: టీమిండియా కోచ్
సుమారు ఆరు నెలల తర్వాత టీమిండియా తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆడనుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి తాజా సిరీస్ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రోహిత్ సేన.. బంగ్లాదేశ్‌పై గెలుపొంది మార్గం సుగమం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.వారం రోజుల సెషన్చాలా కాలం తర్వాత.. తొలిసారిగా టెస్టు మ్యాచ్ ఆరంభానికి ముందు వారం రోజుల పాటు ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటోంది. ఇందుకోసం ఇప్పటికే మొదటి టెస్టుకు వేదికైన చెన్నైకి చేరుకుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్యాచింగ్ ప్రాక్టీస్ప్రాక్టీస్లో ఈసారి తాను రెండు సెగ్మెంట్లను ప్రవేశపెట్టానని తెలిపాడు. చెన్నై వాతావరణం బాగా పొడిగా ఉన్న దృష్ట్యా జట్టును రెండు టీమ్‌లుగా విభజించి.. కాంపిటీషన్ డ్రిల్ నిర్వహించానని పేర్కొన్నాడు. క్యాచింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేయించానని.. సోమవారం నాటి సెషన్లో విరాట్ కోహ్లి టీమ్ గెలిచిందని టి.దిలీప్ వెల్లడించాడు. ఇలాంటి మినీ కాంపిటీషన్ల ద్వారా ఆటగాళ్లు త్వరగా అలసిపోరని.. వీలైనంత ఎక్కువసేపు నెట్స్‌లో గడిపేందుకు ఇలాంటి సెషన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.యాక్టివ్‌గా ఉన్నారుఏదేమైనా ప్రాక్టీస్ అద్భుతంగా సాగుతోందని.. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తమ ప్లేయర్లు యాక్టివ్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారని టి.దిలీప్ వారిని ప్రశంసించాడు. కాగా ఈ సెషన్లో దిలీప్‌తో పాటు అభిషేక్ నాయర్ కూడా ఆటగాళ్లతో మమేకమయ్యాడు. ఇక నెట్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్ బౌలర్లను ఎదుర్కోగా.. కోహ్లి బుమ్రా బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. చెన్నై, కాన్పూర్ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.చదవండి: T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్Intensity 🔛 point 😎🏃♂️Fielding Coach T Dilip sums up #TeamIndia's competitive fielding drill 👌👌 - By @RajalArora #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/eKZEzDhj9A— BCCI (@BCCI) September 16, 2024 -
గోల్ఫర్ సాహిత్ రెడ్డికి నిరాశ
కాలిఫోర్నియా: ప్రొకోర్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత సంతతి అమెరికా గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఈసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో సాహిత్ 12 అండర్ 276 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. ప్యాటన్ కిజైర్ (అమెరికా) 20 అండర్ 268 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. డేవిడ్ లిప్స్కీ (అమెరికా) రెండో స్థానంలో, ప్యాట్రిక్ ఫిష్‌బర్న్ (అమెరికా) మూడో స్థానంలో నిలిచారు.విజేతగా నిలిచిన ప్యాటర్ కిజైర్కు 10,80,000 డాలర్లు (రూ. 9 కోట్ల 5 లక్షలు), రన్నరప్ లిప్‌స్కీకి 6,54,000 డాలర్లు (రూ. 5 కోట్ల 48 లక్షలు), సెకండ్ రన్నరప్ ఫిష్బర్న్కు 4,14,000 డాలర్లు (రూ. 3 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచిన తీగల సాహిత్ 1,76,100 డాలర్ల (రూ. 1 కోటి 47 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన తీగల సాహిత్ తల్లిదండ్రులు 1980 దశకంలో అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్ అమెరికాలోనే పుట్టి పెరిగి గోల్ఫర్గా రాణిస్తున్నాడు. -
చరిత్రలో తొలిసారి..!
చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత గ్రాండ్ మాస్టర్లు లైవ్ చెస్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో చోటు దక్కించుకున్నారు. చెస్ ఒలింపియాడ్‌లో తాజా ప్రదర్శనల అనంతరం అర్జున్ ఎరిగైసి, డి గుకేశ్ లైవ్ ర్యాంకింగ్స్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అర్జున్ ఖాతాలో 2788.1 పాయింట్లు ఉండగా.. గుకేశ్ ఖాతాలో 2775.2 పాయింట్లు ఉన్నాయి. 2832.3 పాయింట్లతో మాగ్నస్ కార్ల్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లైవ్ ర్యాంకింగ్స్ అనేవి రియల్ టైమ్‌లో అప్డేట్ అయ్యే రేటింగ్స్. ఫిడే నెలాఖర్లో ప్రచురించే రేటింగ్స్‌కు వీటికి వ్యత్యాసం ఉంటుంది.కాగా, బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో పాల్గొంటున్న భారత చెస్ ప్లేయర్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది. ఈ టోర్నీలో అర్జున్ ఎరిగైసి వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయగా.. రిచర్డ్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్ డ్రాగా ముగించాడు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.చదవండి: కొరియాను చిత్తు చేసిన భారత్.. ఆరోసారి ఫైనల్లో -
T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్‌నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు!ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్‌ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాంమేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్‌లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తాకాగా.. 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌తో భారత్ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.యూఏఈలోమహిళా టీ20 ప్రపంచకప్-2024 ఎడిషన్ అక్టోబర్ 3- 20 వరకు జరుగనుంది. షార్జా, దుబాయ్ ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది.ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్ దశలో భారత్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్ సేన తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.అందుకే వేదిక మార్పుఅదే విధంగా.. లీగ్ దశలోని మొదటి మూడు మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడనున్న టీమిండియా... ఆసీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ బంగ్లాదేశ్‌లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. చదవండి: 38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్