చరిత్రలో తొలిసారి..! | 2 Indians Feature In Top 5 Of Live Chess Rankings For The First Time In History | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

చరిత్రలో తొలిసారి..!

Published Tue, Sep 17 2024 12:23 PM | Last Updated on Tue, Sep 17 2024 3:39 PM

2 Indians Feature In Top 5 Of Live Chess Rankings For The First Time In History

చరిత్రలో తొలిసారి ఇద్దరు భారత గ్రాండ్‌ మాస్టర్లు లైవ్‌ చెస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. చెస్‌ ఒలింపియాడ్‌లో తాజా ప్రదర్శనల అనంతరం అర్జున్‌ ఎరిగైసి, డి గుకేశ్‌ లైవ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అర్జున్‌ ఖాతాలో 2788.1 పాయింట్లు ఉండగా.. గుకేశ్‌ ఖాతాలో 2775.2 పాయింట్లు ఉన్నాయి. 2832.3 పాయింట్లతో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లైవ్‌ ర్యాంకింగ్స్‌ అనేవి రియల్‌ టైమ్‌లో అప్‌డేట్‌ అయ్యే రేటింగ్స్‌. ఫిడే నెలాఖర్లో ప్రచురించే రేటింగ్స్‌కు వీటికి వ్యత్యాసం ఉంటుంది.

కాగా, బుడాపెస్ట్‌ వేదికగా జరుగుతున్న చెస్‌ ఒలింపియాడ్‌ 2024లో పాల్గొంటున్న భారత చెస్‌ ప్లేయర్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ టోర్నీలో భారత పురుషులు, మహిళల జట్లు వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేశాయి. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3-1తో ఆతిథ్య హంగేరిని ఓడించింది. ఈ టోర్నీలో అర్జున్ ఎరిగైసి వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేయగా.. రిచర్డ్‌తో జరిగిన గేమ్‌ను గుకేశ్ డ్రాగా ముగించాడు. మహిళల జట్టు 2.5-1.5 తేడాతో అర్మేనియాపై విజయం సాధించింది.

చదవండి: కొరియాను చిత్తు చేసిన భారత్‌.. ఆరోసారి ఫైనల్లో

No comments yet. Be the first to comment!
Add a comment

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement