బిగ్‌బాస్‌ సీజన్‌-18 ప్రకటన.. భారీగా సల్మాన్‌ రెమ్యునరేషన్‌ | Bigg Boss 18 Hindi Announcement Promo | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

బిగ్‌బాస్‌ సీజన్‌-18 ప్రకటన.. భారీగా సల్మాన్‌ రెమ్యునరేషన్‌

Published Tue, Sep 17 2024 12:24 PM | Last Updated on Mon, Sep 23 2024 12:41 PM

Bigg Boss 18 Hindi Announcement Promo

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రియాలిటీ షోల్లో బిగ్‌బాస్‌కి ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై వినోదాన్ని పంచే ఈ కార్యక్రమానికి అన్నీ బాషలలో అభిమానులు ఉన్నారు. అయితే హిందీలో బిగ్‌బాస్‌-18 సీజన్‌ గురించి తాజాగా ఒక ప్రకటన వచ్చింది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌  హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం  14 వారాల పాటు కొనసాగనుంది. కలర్స్‌ టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

అక్టోబర్‌లో  ప్రసారం కానున్న హిందీ బిగ్‌బాస్‌-18 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌-3 నుంచి హోస్ట్‌గా తప్పుకున్న సల్మాన్‌ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో అనిల్‌ కపూర్‌ హోస్ట్‌గా ఉన్నారు. అయితే, కాస్త గ్యాప్‌ తర్వాత సల్మాన్‌ మళ్లీ బిగ్‌ బాస్‌లోకి వస్తుండటంతో ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు. ఈమేరకు టైటిల్‌ ప్రోమోను సల్మాన్‌ పంచుకున్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-18 కోసం   సల్మాన్ అక్షరాలా రూ.350 కోట్లు రెమ్యునరేషన్‌గా  తీసుకుంటున్నారని బాలీవుడ్‌లో ప్రచారం ఉంది. వరుసగా 15 సీజన్ల వరకు బిగ్‌బాస్‌ హాస్ట్‌గా ఈ కండలవీరుడు కొనసాగుతున్నారు. అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకునే హోస్ట్‌గా సల్మాన్‌ నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement