Ind vs Ban: విరాట్‌ కోహ్లి జట్టు గెలిచింది: టీమిండియా కోచ్‌ | Virat Kohli Team Won: Competition In India Training Ahead Bangladesh Tests | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Ind vs Ban: విరాట్‌ కోహ్లి జట్టు గెలిచింది: టీమిండియా కోచ్‌

Published Tue, Sep 17 2024 1:11 PM | Last Updated on Tue, Oct 22 2024 12:48 PM

Ind vs Ban: విరాట్‌ కోహ్లి జట్టు గెలిచింది: టీమిండియా కోచ్‌

Ind vs Ban: విరాట్‌ కోహ్లి జట్టు గెలిచింది: టీమిండియా కోచ్‌

సుమారు ఆరు నెలల తర్వాత టీమిండియా తొలిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి తాజా సిరీస్‌ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ చేరడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రోహిత్‌ సేన.. బంగ్లాదేశ్‌పై గెలుపొంది మార్గం సుగమం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.

వారం రోజుల సెషన్‌
చాలా కాలం తర్వాత.. తొలిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆరంభానికి ముందు వారం రోజుల పాటు ట్రెయినింగ్‌ సెషన్‌లో పాల్గొంటోంది. ఇందుకోసం ఇప్పటికే మొదటి టెస్టుకు వేదికైన చెన్నైకి చేరుకుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

క్యాచింగ్‌ ప్రాక్టీస్‌
ప్రాక్టీస్‌లో ఈసారి తాను రెండు సెగ్మెంట్లను ప్రవేశపెట్టానని తెలిపాడు. చెన్నై వాతావరణం బాగా పొడిగా ఉన్న దృష్ట్యా జట్టును రెండు టీమ్‌లుగా విభజించి.. కాంపిటీషన్‌ డ్రిల్‌ నిర్వహించానని పేర్కొన్నాడు. క్యాచింగ్‌, రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేయించానని.. సోమవారం నాటి సెషన్‌లో విరాట్‌ కోహ్లి టీమ్‌ గెలిచిందని టి.దిలీప్‌ వెల్లడించాడు. 

ఇలాంటి మినీ కాంపిటీషన్ల ద్వారా ఆటగాళ్లు త్వరగా అలసిపోరని.. వీలైనంత ఎక్కువసేపు నెట్స్‌లో గడిపేందుకు ఇలాంటి సెషన్లు ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.

యాక్టివ్‌గా ఉన్నారు
ఏదేమైనా ప్రాక్టీస్‌ అద్భుతంగా సాగుతోందని.. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తమ ప్లేయర్లు యాక్టివ్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారని టి.దిలీప్‌ వారిని ప్రశంసించాడు. కాగా ఈ సెషన్‌లో దిలీప్‌తో పాటు అభిషేక్‌ నాయర్‌ కూడా ఆటగాళ్లతో మమేకమయ్యాడు. 

ఇక నెట్స్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పిన్‌ బౌలర్లను ఎదుర్కోగా.. కోహ్లి బుమ్రా బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసినట్లు సమాచారం. కాగా సెప్టెంబరు 19- అక్టోబరు 1 వరకు టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య టెస్టు సిరీస్‌కు షెడ్యూల్‌ ఖరారైంది. చెన్నై, కాన్పూర్‌ ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

చదవండి: T20 WC: టీ20 క్రికెట్‌.. పొట్టి ఫార్మాట్‌ కానేకాదు: కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement