
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గ ర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన సింగరేణి డైరెక్టర్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)గా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆడ్రియాల ప్రాజెక్ట్ జీఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఇటీవల యాజమాన్యం డైరెక్టర్‌గా నియమించింది. ఈ నేపథ్యాన కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించగా జీఎంలు, వివిధ విభాగాల ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అటవీ అధికారులపై
దాడి చేస్తే కఠిన చర్యలు
సీసీఎఫ్ భీమానాయక్
అశ్వాపురం : అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎఫ్ ధరావత్ భీమానాయక్ అన్నారు. మండలంలోని వేములూరు, మనుబోతులగూడెం, రేగులగండి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి అటవీ శాఖ ఆధ్వర్యంలో వేయనున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. మనుబోతులగూడెంలో అటవీ అధికారుల కోసం నిర్మించిన క్వార్టర్లను సందర్శించారు. గ్రామంలో ఇటీవల ఎఫ్‌ఆర్‌ఓపై గిరిజనులు దాడి చేసిన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తేగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మొండికుంట నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట డీఎప్‌ఓ కృష్ణాగౌడ్, ఎఫ్‌డీఓ సయ్యద్ మక్సూద్, రేంజర్ రమేష్ తదితరులు ఉన్నారు.

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం

కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
Comments
Please login to add a commentAdd a comment