
గర్భగుడికి చేరుకున్న రెక్కల రామక్క
గుండాల: ఆళ్లపల్లి మండలం పెద్దూరు గ్రామంలో రెక్కల రామక్క జాతర కొనసాగుతోంది. బుధవారం దేవతను గర్భగుడికి తీసుకొచ్చారు. తొలిరోజు మంగళవారం గుడి మెలుగుట, కర్రదించుట, దేవతకు కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు ఘనంగా చేశారు. రెండో రోజు బుధవారం ప్రత్యేక పూజలు, డోలి చప్పుళ్ల నడుమ వేల్పులోద్ది గుట్ట నుంచి అమ్మవారిని గర్భగుడికి తీసుకొచ్చారు. ఎదురుకోలు ఉత్సవం జరిపారు. పూజారులు కొమరం కనకయ్య, సీతయ్య, లాలయ్య, రఘుపతి, రవి, ఆర్తి బిడ్డ కత్తుల సతీష్, వడ్డె ఈసం రామయ్య ఆధ్వర్యంలో పూజలు చేశారు. కాగా ఈ జాతర ఐదురోజులపాటు సాగనుంది. గురువారం పాండవుల గుట్టనుంచి వనదేవతను తీసుకొచ్చే ఘటనతో నిండు జాతర మొదలవుతుంది. దేవతలను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు దర్శించుకుని పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment