
30 ఏళ్లు దాటినవారికి వైద్య పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: చాపకింద నీరులా వ్యాపిస్తున్న మధుమేహం, రక్తపోటు, కేన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను కట్టడి చేసేందుకు 30 ఏళ్ల వయసు దాటిన వారిందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరన్ తెలిపారు. బుధవారం వైద్య, ఆరోగ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మార్చి 31 వరకు రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధి నిర్ధారణ తర్వాత బాధితులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తామని తెలిపారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
కొత్తగూడెంఅర్బన్: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంఎచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ నాయక్ వైద్యాధికారులను సూచించారు. బుధవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. నేషనల్ హెల్త్ పాలసీలను 100శాతం పూర్తి చేయాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాము, సిబ్బంది ఉన్నారు.
రామాలయ మాజీ
ప్రధానార్చకుడు మృతి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు పొడిచేటి జగన్నాఽథాచార్యులు(71) అనారోగ్యంతో మృతి చెందిన విషయం బుధవారం ఆలస్యంగా దేవస్థానం వర్గాలకు తెలిసింది. భక్త రామదాసు శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన ఐదు వంశాల్లో పొడిచేటి వంశానికి చెందిన జగన్నాఽథాచార్యులు 1954 జనవరి 1న జన్మించారు. నాలుగున్నర దశాబ్దాల పాటు ఆలయంలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన చివరకు ప్రధానార్చకులుగా కొనసాగుతూ 2018 డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేశారు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందారు. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవ క్రతువుల్లో ఆయన పలుమార్లు కీలక పాత్ర పోషించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
దుమ్ముగూడెం: మండలంలోని పెద్దఅర్లగూడెం గ్రామానికి చెందిన పాయం ముత్యాలక్క ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బుధవారం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సామగ్రి, పట్టాదారు పాస్ బుక్‌లు, ఆధార్‌కార్డులు మంటల్లో కాలిపోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఘటనా స్థలాన్ని ఆర్‌ఐ నరసింహారావు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, ముత్యాలక్క కుటుంబానికి విజయవాడకు చెందిన పీవీ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యుడు కృష్ణారావు తక్షణ సాయంగా ప్రకటించిన రూ.5 వేలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరమాచినేని వినీల్ అందజేశారు. నాయకులు కనుబుద్ది దేవా, నటరాజ స్వామి, వాసం రాంకుమార్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
మహిళ మెడలో
గొలుసులు అపహరణ
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఇందిరా మార్కెట్‌లో ఉన్న ఓ కిరాణా దుకాణం నిర్వహకురాలు సుశీల మెడలో గొలుసులను బుధవారం దుండగులు అపహరించారు. తాగునీటి సీసా కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేసి, బాటిల్ తీసుకుని వెళ్లే సమయంలో ఆమె మెడలో ఉన్న రూ.6 లక్షల విలువైన రెండు బంగారపు గొలుసులు లాక్కెళ్లారు. బాధితురాలు సుశీల డయల్ 100కు ఫోన్ చేయగా, టౌన్ సీఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా గొలుసులు లాక్కెళ్లినప్పుడు సుశీల మెడకు గాయాలయ్యాయి. సీఐ రమేష్ కేసు నమోదు చేశారు.

30 ఏళ్లు దాటినవారికి వైద్య పరీక్షలు

30 ఏళ్లు దాటినవారికి వైద్య పరీక్షలు

30 ఏళ్లు దాటినవారికి వైద్య పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment