
ఇసుక వాహనాలపై పోలీసుల నిఘా
మణుగూరు టౌన్/టేకులపల్లి/పినపాక: జిల్లాలో కొద్ది రోజులుగా పోలీసులు అక్రమ ఇసుక తరలింపుపై నిఘా పెట్టారు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమతిలేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. బుధవారం 9 ట్ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మణుగూరు పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో అక్రమంగా గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. రామానుజవరం గ్రామం, పట్టణంలోని చినరావిగూడెం ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ సోమ సతీష్ తెలిపారు. టేకులపల్లి మండల పరిధిలోని శంభునిగూడెం ప్రాంతంలో ముర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు టేకులపల్లి ఎస్‌ఐ పోగుల సురేష్ తెలిపారు. వాహనదారుడు బాణోతు శంకర్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పినపాకమండలంలోని జానంపేట పంచాయతీ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఈ. బయ్యారం ఎస్‌ఐ రాజకుమార్ తెలిపారు.
అక్రమంగా రవాణా చేస్తున్న
తొమ్మిది ట్రాక్టర్లు సీజ్
Comments
Please login to add a commentAdd a comment