
బడ్జెట్ కేటాయింపులపై పునరాలోచించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలకు మేలు చేసేలా కాకుండా కార్పొరేట్ శక్తులు, సంపన్నవర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ, సీపీఎం, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యాన బుధవారం కొత్తగూడెంలో బడ్జెట్‌పై నిరసన తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కూనంనేని మాట్లాడుతూ రైతులు, కార్మికులకు వ్యతిరేకంగానే కాక విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. బడ్జెట్ మార్చాలన్న తమ ప్రధాన డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎస్.కే.సాబీర్‌పాషా, మచ్చ వెంకటేశ్వరరావుతో పాటు వివిధ పార్టీల నాయకులు గౌని నాగేశ్వరరావు, కందగట్ల సురేందర్, పి.సతీష్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, రత్నకుమారి, ఫహీం, లిక్కి బాలరాజు, కె.బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, కె.లక్ష్మి, ఎన్.రమేష్, అభిమన్యు, నాగకృష్ణ, జె.సీతారామయ్య, ఉమ, అలీముద్దీన్, ఎం.రాజశేఖర్, నక్కా లావణ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
Comments
Please login to add a commentAdd a comment