
భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద భద్రత పెంపు
● ఇటీవల కానిస్టేబుల్‌ను బైక్‌తో ఢీ కొట్టి పారిపోయిన స్మగ్లర్లు ● తనిఖీలు చేస్తున్నా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనివైనం
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని బ్రిడ్జి సెంటర్‌లో ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత పెంచారు. భద్రాచలం మీదుగా జరుగుతున్న గంజాయి, ఇతర ప్రభుత్వ నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టే బుల్‌ను ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. రెండు నెలల క్రితం ఇదే విధంగా ఓ ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ అనంతయ్యను కూడా ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టు వద్ద భద్రత పెంచారు. అదనంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ షిఫ్ట్‌లో ఓ ఎస్‌ఐ స్థాయి అధికారి, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ముగ్గురు టీజీపీఎస్పీ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా వీరికి అదనంగా సీఆర్పీఎఫ్ బలగాలను కూడా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పోలీసులను ఢీకొట్టి గాయపర్చిన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని, అప్పుడే పోలీసులు మనోధైర్యంతో విధులు నిర్వర్తిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment