
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
వరంగల్ : నగరంలోని వెంకట్రామా జంక్షన్ నుంచి లేబర్ కాలనీ వరకు వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలని టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్ కోరారు. ఈమేరకు బుధవారం మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లేబర్ కాలనీ నుంచి వెంకట్రామా జంక్షన్ వరకు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈవిషయంపై స్పందించిన మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకాశ్ తెలిపారు.
రవీందర్‌రావును కలిసిన పీఏసీఎస్ చైర్మన్లు
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల పదవీ కాలం ఆరునెలలు పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంక్ (టీజీసీఏబీ) చైర్మన్ మార్నేని రవీందర్‌రావును బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు కలిసి పూలబొకేలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట దర్గా, వరంగల్, పర్వతగిరి, మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు ఉకంటి వనంరెడ్డి, ఇట్యాల హరికృష్ణ, మనోజ్‌గౌడ్, జక్కు రమేష్‌గౌడ్‌లు పాల్గొన్నారు.
డిక్షనరీల పంపిణీ
ఖిలా వరంగల్ : కరీమాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మీ నేస్తం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు ఆంగ్ల డిక్షనరీలు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు జయప్రకాశ్, సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు యాకోబు, ఉపాధ్యాయులు భిక్షపతి, ప్రసాద్, భాగ్యలక్ష్మి, ఉమాకుమారి, సంధ్యారాణి, సుకన్య, రేఖ పాల్గొన్నారు.
మైనారిటీ గురుకులంలో ‘తఖ్‌మీల్ ఏ ఖురాన్’
న్యూశాయంపేట : కేయూ క్రాస్‌రోడ్‌లోని వరంగల్–1, మైనార్టీ గురుకులంలో బుధవారం తఖ్‌మీల్ ఏ ఖురాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురుకు లంలో విద్యానభ్యసిస్తున్న 34 మంది మైనార్టీ వి ద్యార్థులు ఖురాన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రిన్సిపాల్ డి.కృష్ణకుమారి శాలువాలతో స న్మానించిసర్టిఫికెట్స్ అందజేశారు. అధ్యాపకులు, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
చెన్నకేశవస్వామి కల్యాణం
మడికొండ : కాజీపేట మండలంలోని మడికొండలో గల శ్రీ శివకేశవ ఆలయంలో బుధవారం వైభవంగా చెన్నకేశవ స్వామి కల్యాణం జరిపించారు. ఉదయం నుంచి అర్చకులు వంశీకృష్ణచార్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వైభవంగా శ్రీదేవి, భూదేవి, శ్రీలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశవస్వామి కల్యాణతంతును చేపట్టారు. తౌటిరెడ్డి విద్యాసాగర్‌రెడ్డి, దొంతుల శంకర్ లింగం,ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, పింగిళి రఘునాథరావు, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment