
డీజిల్ షెడ్‌లో రైల్వే హెల్త్ క్యాంప్
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో బుధవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. రైల్వే ఆస్పత్రి డీఎంఓ డాక్టర్ ధీరజ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో డాక్టర్లు నరేందర్‌హిర్వాని, ఉత్తమ్, ప్రవళిక, వైద్య సిబ్బంది 180 మంది రైల్వే ఎంప్లాయీస్‌కు పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. నేడు(గురువారం) కూడా కార్మికుల కోసం హెల్త్ చెకప్ క్యాంపును నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ బ్రాంచ్ చైర్మన్ ఎస్‌కె. జానిమియా, ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, సత్యనారాయణ, శివప్రసాద్, మాషుజాని, రాజయ్య, శ్రీధర్, రైల్వే వైద్య సిబ్బంది కవిత, రమాదేవి, ప్రసాద్, మల్లేష్, గోపి, కార్మికులు పాల్గొన్నారు.
వైద్యశిబిరానికి అపూర్వ స్పందన
ఖిలా వరంగల్ : వరంగల్ 32వ డివిజన్ బీఆర్ నగర్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ పద్మాక్షి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యఅతిథిగా లయన్‌క్లబ్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకట్‌రెడ్డి, డాక్టర్ సిరికొండ భాస్కర్‌రావు, ధరణికొటి వీణావాణి హాజరై వైద్యశిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం వైద్యులు ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment