
కాలనీలో సౌకర్యాలు కరువు
కాజీపేట అర్బన్ : కాజీపేట మండలం న్యూశాయంపేటలోని సుర్జీత్‌నగర్‌కాలనీలో స్థానికులు సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో కాలనీవాసులు అసౌకర్యాల నడుమ దుర్భారజీవితం కొనసాగిస్తున్నారు. 20ఏళ్ల క్రితం ప్రభుత్వ భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న గుడిసెల్లో సుమారు 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. కాగా అనేక పోరాటాలతో 2015లో 300 మందికి, 2024లో 58 జీఓ ప్రకారం 300 మందికి పట్టాలిచ్చారు. అయితే కాలనీలో కనీస వసతులు కల్పించడంలో అధికారులు అలసత్వం వహిస్తుండడంతో దుర్భార జీవితాన్ని గడుపుతున్నారు.
సీసీ రోడ్లు, డ్రెయినేజీలు కరువు
సుర్జీత్‌నగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల ఏర్పాటులో అధికారులు అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో మురుగునీరు ఇళ్లలోకి పారుతూ దుర్వాసనతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
డ్రెయినేజీ ఏర్పాటు చేయాలి
కాలనీ నుంచి బయట అడుగుపెట్టాలంటే ఇబ్బందిగా ఉంది, వెంటనే అధికారుల స్పందించి సీసీ రోడ్లు,సైడ్ డ్రెయినేజీల నిర్మాణం చేపట్టి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడాలి. వర్షాకాలంలో సరైన రోడ్లు లేక బురదలో ప్రయాణం చేయడం ఇబ్బందిగా ఉంది. మురుగు నీటి దుర్వాసనతో దోమలు స్వైరవిహారం చేస్తు జ్వరాలబారిన పడుతున్నాం. – రజిత, సుర్జీత్‌నగర్ కాలనీ
ఇళ్లు నిర్మించి ఇవ్వాలి..
సుర్జీత్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 500 కుటుంబాల్లో 300 మందికి పట్టాలిచ్చారు. మిగతా 200 కుటుంబీకులకు సైతం పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. సొంత భూమిలేక 20ఏండ్లుగా కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేదలను ఆదుకోవాలి.
– కారు ఉపేందర్, సుర్జీత్‌నగర్ కాలనీ వ్యవస్థాపకుడు
●
సుర్జీత్‌నగర్‌కాలనీలో
సమస్యల తిష్ట
సీసీ రోడ్లు, డ్రెయిజీలు లేక
స్థానికుల ఇబ్బందులు

కాలనీలో సౌకర్యాలు కరువు

కాలనీలో సౌకర్యాలు కరువు
Comments
Please login to add a commentAdd a comment