రోజూ రెండు కప్పుల టీ, మరో రెండు కప్పుల కాఫీ తాగేవారిలో మతిమరపు సమస్య అంత తేలిగ్గా రాదని అంటున్నారు చైనా పరిశోధకులు. టీ, కాఫీలను చాలా పరిమితంగా అంటే రోజూ రెండు కప్పులకు మించకుండా తాగేవారిలో కేవలం మతిమరపు (డిమెన్షియా) నివారితం కావడమే కాదు... పక్షవాతం వచ్చే అవకాశాలూ తక్కువే అంటున్నారు ఈ పరిశోధన నిర్వహించిన పరిశోధకులు.
టీ కాఫీలు తాగని వారితో పోల్చినప్పుడు... రోజూ రెండు కప్పుల చొప్పున టీ, కాఫీ తాగేవారిలో మతిమరపు రావడమన్నది దాదాపు 28 శాతం తక్కువని పేర్కొంటున్నారు చైనాకు చెందిన టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనవేత్తలు డాక్టర్ యువాన్ ఝాంగ్, ఆయన బృందం. దాదాపు 5,00,000 మందిపై పదేళ్ల పాటు వారు బ్రిటన్‌లో సుదీర్ఘ పరిశోధన చేశారు.
కాఫీ, టీల మీద ఇలా పరిశోధనలు జరగడం మొదటిసారి కాదు. గతంలోనూ జరిగాయి. ఈ ఫలితాల మీద కొన్ని భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రయుఖ న్యూట్రిషనల్ సైన్సెస్ నిపుణురాలు డాక్టర్ కార్లోట్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘మతిమరపు నివారణకు కేవలం కాఫీ, టీలు మాత్రమే కారణం కాకపోవచ్చు. ఇతర అంశాలూ కారణమయ్యే అవకాశాలూ లేక΄ోలేద’’న్న అభి్ప్రాయం వ్యక్తం చేశారు.
ఇంకొందరు అధ్యయనవేత్తలు సైతం ఈ పరిశోధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, టీలలో మెదడు, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పదార్థాలుంటాయి. వాటిని పరిమితికి మించి తీసుకుంటే కలిగే ప్రమాదాల గురించి వారు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గతంలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు ఆరు కప్పులకు మించి కాఫీ/టీ తాగేవారిలో 53% మందికి డిమెన్షియా వస్తుందని తెలిసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ‘‘కేవలం రెండే’’ అన్న పరిమితికి గట్టిగా కట్టుబడి ఉండాలంటున్నారు. ఈ పరిశోధన పలితాలు ప్రముఖ మెడికల్ జర్నల్ ప్లాలస్ మెడిసిన్’ (PLos Medicine)లో ప్రచురితమయ్యాయి.
(చదవండి: కిస్‌మిస్‌ని నీళ్లల్లో నానబెట్టే ఎందుకు తినాలో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment