ఆర్థిక ఒడిదుడుకులు | - | Sakshi
Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఆర్థిక ఒడిదుడుకులు

Published Thu, Feb 20 2025 1:42 PM | Last Updated on Thu, Feb 20 2025 1:42 PM

ఆర్థిక ఒడిదుడుకులు

ఆర్థిక ఒడిదుడుకులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో వెనుకబాటు కనిపిస్తోంది. జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధి వృద్ధిరేటు రాష్ట్రంలోనే వెనుకబడి ఉంది. వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ) 14వ స్థానంలో ఉండగా.. వరంగల్‌ రూరల్‌ 22, (వరంగల్‌), మహబూబాబాద్‌ 23 స్థానాల్లో నిలిచాయి. 2021–22సంవత్సరానికి ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో వృద్ధి సాధించలేదు. తలసరి ఆదాయం విషయానికి వస్తే జయశంకర్‌ భూపాలపల్లి 15వ స్థానంలో నిలిచింది. జాతీయ ధరల సూచీ ప్రకారం దీనిని గణిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు జిల్లాలు తలసరి ఆదాయంలో తెలంగాణలోని మిగతా జిల్లాలతో వెనకబడి ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్‌–2024’లో ఈ వివరాలు వెల్లడించారు.

పడుతూ లేస్తూ 14, 15 స్థానాల్లోనే..

ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ఉండగా.. 2022–23 సంవత్సరానికి ఆర్థిక వృద్ధిలో రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోటీ పడలేకపోయాయి. జిల్లా స్థూల దేశీయోత్పత్తిలో 14వ స్థానంలో హనుమకొండ, తలసరి ఆదాయంలో 15వ స్థానంలో జేఎస్‌ భూపాలపల్లి జిల్లాలు నిలిచాయి. మిగతా నాలుగు జిల్లాలు ఆ తర్వాతి స్థానాలకే పరిమితమయ్యాయి. జీడీడీపీలో వరంగల్‌ 22, మహబూబాబాద్‌ 23, జనగామ 29, జేఎస్‌ భూపాలపల్లి 31 స్థానాల్లో నిలవగా.. రూ.7,583 కోట్లతో ములుగు జిల్లా అన్నింటికన్న చివరన నిలిచింది. జిల్లాల ఆర్థికాభివృద్ధికి సూచికగా జీడీడీపీని పరిగణించగా అభివృద్ధి అంతా రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతం కాగా, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో కొద్దిగా మెరుగ్గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గ్రేటర్‌ వరంగల్‌ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కారణంగా ఆర్థికవృద్ధిలో టాప్‌–2లో నిలిచినట్లు చెబుతున్నారు.

పట్నవాసం వద్దు, పల్లె నివాసమే బెస్ట్‌....

ఉమ్మడి వరంగల్‌లో 38,20,369 మంది జనాభా ఉంది. ఇందులో 28,28,036 మంది పల్లెల్లో, 9,92,333 మంది పట్టణాల్లో జీవనం గడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు నివాసం పట్టణం/నగరాలైన హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డిల తర్వాత స్థానంలో హనుమకొండ నిలిచింది. ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ మినహా ఐదు జిల్లాల్లో జనం ఊళ్లల్లోనే ఉంటున్నారు. హనుమకొండ జిల్లాలో మాత్రమే 10,62,247 మంది జనాభాలో 5,63,629 (53.1 శాతం) మంది పట్నంలో ఉంటుండగా, 4,98,618 (46.9 శాతం) మంది గ్రామాల్లో ఉంటున్నారు. వరంగల్‌ జిల్లాలో 7,37,148లకు 69.2 శాతం మంది పల్లెటూళ్లలో, 30.8 శాతం మంది పట్టణ వాసం చేస్తున్నారు. జనగామలో 5,34,991 జనాభాకు 4,63,634 (86.7 శాతం) మంది గ్రామాల్లో, 71,357 (13.3శాతం) పట్టణాల్లో, జేఎస్‌ భూపాలపల్లిలో 4,16,763లకు 3,74,376 ( 89.8 శాతం) గ్రామాల్లో, 42,387 (10.2 శాతం) పట్టణాల్లో ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అదే విధంగా మహబూబాబాద్‌ జిల్లాలో 7,74,549 మందికి 6,98,173 (90.1 శాతం), పల్లెలు, తండాల్లో, 76,376 (9.9 శాతం) మందే పట్టణాల్లో ఉంటుండగా.. ములుగు జిల్లాలో 2,94,671లకు 96.1 శాతం మంది పల్లెటూళ్లలో ఉంటుండగా.. కేవలం 11,493 (3.9 శాతం)మంది పట్నవాసం చేస్తున్నారు.

జిల్లాల వారీగా మొత్తం జనాభా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలా..

జిల్లా మొత్తం గ్రామీణం పట్టణ/నగరం

జనాభా జనాభా జనాభా

హనుమకొండ 10,62,247 4,98,618 5,63,629

వరంగల్‌ 7,37,148 5,10,057 2,27,091

జనగామ 5,34,991 4,63,634 71,357

జేఎస్‌.భూపాలపల్లి 4,16,763 3,74,376 42,387

మహబూబాబాద్‌ 7,74,549 6,98,173 76,376

ములుగు 2,94,671 2,83,178 11,493

మొత్తం 38,20,369 28,28,036 9,92,333

జిల్లాల వారీగా జీడీడీపీ (రూ.కోట్లలో)

జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23

వరంగల్‌ అర్బన్‌ 17,684 16,181 19,877 23,868

వరంగల్‌ రూరల్‌ 12,903 13,901 16,509 18,677

జనగామ 10,939 10,353 11,672 13,875

మహబూబాబాద్‌ 12,244 13,092 16,317 18,245

జేఎస్‌.భూపాలపల్లి 12,157 10,298 11,848 11,481

ములుగు 5,695 5,382 6,147 7,583

జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో)

జిల్లా 2019–20 2020–21 2021–22 2022–23

వరంగల్‌ అర్బన్‌ 1,40,994 1,26,594 1,55,055 1,86,618

వరంగల్‌ రూరల్‌ 1,55,802 1,65,549 1,95,115 2,20,877

జనగామ 1,79,229 1,66,392 1,86,244 2,21,424

మహబూబాబాద్‌ 1,37,562 1,44,479 1,79,057 2,00,309

జేఎస్‌.భూపాలపల్లి 2,42,945 2,03,564 2,34,132 2,28,655

ములుగు 1,68,702 1,55,821 1,75,527 2,15,772

తలసరి ఆదాయంలో భూపాలపల్లే బెటర్‌..

2022–23లో రంగారెడ్డి జిల్లా రూ.9,54,949 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. రూ.2,28,655తో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా 15వ స్థానంలో నిలిచింది. అయితే 2021–22 ఇది రూ.2,34,132లు కాగా ఈసారి రూ.5,477 తగ్గినా.. మిగతా జిల్లాలతో పోలిస్తే ఎక్కువై 15వ స్థానంలో ఉంది. వరంగల్‌ రూరల్‌ (వరంగల్‌) గతంలో రూ.1,94,317తో 16వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,20,174 లకు పెరిగినా 18వ స్థానంలో నిలిచింది. అలాగే రూ.1,86,278లున్న జనగామ ఈసారి రూ.2,21,424లతో 16, రూ.1,79,222లతో 20వ స్థానంలో ఉన్న మహబూబాబాద్‌ రూ.2,00,309లతో 25, రూ.1,77,316లతో 21లో ఉన్న ములుగు రూ.2,15,772లతో 19 స్థానాల్లో నిలవగా, రూ.1,56,086లతో చివరి స్థానంలో నిలిచిన వరంగల్‌ అర్భన్‌ (హనుమకొండ) ఈసారి రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉంది.

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి జిల్లా వెనుకబాటు

రూ.7,583 కోట్లతో ఆఖరున ములుగు

జేఎస్‌ భూపాలపల్లిలో తగ్గి...

ఐదు జిల్లాల్లో పెరిగిన ‘తలసరి’

తలసరి ఆదాయంలో

15వ స్థానంలో జేఎస్‌ భూపాలపల్లి

హనుమకొండ జిల్లాలో అర్బన్‌ జనాభా.. మిగతా ఐదు జిల్లాల్లో పల్లెవాసమే

‘రాష్ట్ర గణాంకాల నివేదిక– అట్లాస్‌–2024’లో వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment

test ad block for node

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement