
తాగునీటి ఇబ్బందులు రావొద్దు
లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదవాలి
రేగొండ: ప్రతీవిద్యార్థి లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళిబద్ధంగా చదవాలని కలెక్టర్ రాహుల్‌శ ర్మ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన తనిఖీ చేసి, మాట్లాడారు. వి ద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివి ఉత్తమ ఫలి తాలు సాధించేలా ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అనంతరం పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్మి స్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే రైతువేదికలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మనోరమ, గృహనిర్మాణ పీడీ లోకిలాల్, డీఆర్డీఓ నరేష్, గృహ నిర్మాణ శాఖ ఏఈ రాయలింగు ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, విద్యుత్, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ రాహుల్‌శర్మ బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా మంచినీటి సరఫరా పరిస్థితిని ఎంపీడీఓలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుల ఉంటే వెంటనే చేయాలని ఆదేశించారు. గ్రామ, పట్ట ణాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూ చించారు. విద్యుత్ సమస్య వస్తే 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలన్నారు. మంచినీటి సమస్య వ స్తే ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేయాలని తెలి పారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 26న కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవాలయంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో మహాశివరాత్రి వేడుకలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచా యతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్, మత్స్య, విద్యుత్, ఆబ్కారీ, సింగరేణి, ఆర్టీసీ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు నడపాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. మహాశివరాత్రి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మల్చూర్ నా యక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, డీపీఓ నారాయణరావు, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, మత్స్యశాఖ అధికారి అవినాశ్, దేవస్థానం ఈఓ మహేష్ పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో కలెక్టర్ రాహుల్‌శర్మ
Comments
Please login to add a commentAdd a comment