
అధికారుల హాస్టల్ నిద్ర
కరుణాపురం ఎంజేపీలో విద్యార్థులతో కలిసి నిద్రిస్తున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా
ఎంజేపీలో రాత్రి బస చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా
జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల వసతి గృహాల్లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్‌కుమార్, రోహిత్‌సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అలాగే రాత్రి అక్కడే బస చేశారు. వసతులను పరిశీలించడంతో పాటు విద్యార్థుల ప్రతిభాపాటవాలను పరీక్షించారు. కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాల, కళాశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్.. అంతకు ముందు విద్యార్థులకు పాఠాలు బోధించారు. అలాగే వారితో కలిసి భోజనం చేసి సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.. పదవ తరగతి ఫలితాలు దిక్సూచి అని పేర్కొన్నారు.
– జనగామ
– వివరాలు 9లోu
Comments
Please login to add a commentAdd a comment