వైద్యులు అందుబాటులో ఉండాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు
బచ్చన్నపేట : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్‌రావు అన్నారు. బుధవారం స్థానిక ఆస్పత్రిని సందర్శించి రోగుల గదులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందడానికి ప్రజలు ఎక్కువగా వస్తున్నారని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. వేసవి సమీపిస్తున్నందున ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు, ఈజీఎస్ పనుల వద్ద కూలీలకు అందజేయాలని తెలిపారు. ఎండలో బయటకు వెళ్లకూడదని, తప్పనిసరి అయి తే తలకు పాగా, టోపీ ధరించాలని సూచించారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తితే అందుబాటులోని ఆస్రత్రిలో చూపించుకోవాలని సూచించారు. మండల వైద్యాధికారి సృజన, డాక్టర్లు శ్రీనివాస్, అరుణ, దీప్తి, పీహెచ్‌ఎన్ అన్నాంబిక, సీహెచ్‌ఓ జంగమ్మ, హెడ్ నర్సు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment