
ఇసుక అక్రమ రవాణా చేయొద్దు
కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్/రఘునాథపల్లి: ఇసుకను అక్రమంగా రవాణా చేయొద్దు.. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. బుధవా రం జనగామ మండల పరిధి యశ్వంతాపూర్ వాగును డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి సందర్శించారు. ఇసుక, వాగుల్లోని ఒండ్రుమట్టి తరలింపును అరికట్టేందుకు దారుల్లో ట్రెంచ్‌లు తవ్వి ట్రాక్టర్లు వెళ్లకుండా కట్టడి చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ హుస్సెన్, డీటీ జగన్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్టును డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్‌బాషా తనిఖీ చేశా రు. చెక్‌పోస్టు వద్ద అనుచరిస్తున్న విదానాలను ఎస్సై నరేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇసుక అక్రమ రవాణా చేయకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎర్త్ కుండీల్లో నీరు నింపాలి
చిల్పూరు: వేసవి సమీపిస్తున్నందున ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ కుండీల్లో నీరు నింపాలి.. అలా చేస్తే లోవోల్టేజీని తట్టుకుంటుందని విద్యుత్ డీఈ రాంబాబు అన్నారు. కొండాపూర్ డిస్ట్రిబ్యూషన్‌లోని మట్టి గుంతల్లో సిబ్బంది నీరు నింపడాన్ని బుధవారం రాజవరం ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరుగుతున్నందున విద్యుత్ ఉప కేంద్రాల్లో సరఫరా, వినియోగం పెరిగి పవర్ ట్రాన్స్ ఫార్మర్లకు(పీటీఆర్) సాంకేతిక సమస్య రాకుండా ఉండేందుకు ఎర్త్ కుండీల్లో రోజూ నీరు నింపాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎల్‌ఎం కృష్ణంరాజు, జీపీ సిబ్బంది ఉన్నారు.
‘ఏబీవీ’ కళాశాలలో నూతన డిగ్రీ కోర్సులు
జనగామ రూరల్: పట్టణంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ సాధించింది. దీంతో బీఏ, బీకాం, బీఎస్సీ(లైఫ్ సైన్స్, బీఎస్సీ(ఫిసికల్ సైన్స్)తో పాటు 2025–26 విద్యాసంవత్సరం నుంచి బీబీఏ(జనరల్) బీకాం(ఈ కామర్స్) బీఎస్సీ(ఫార్మసీ), కంప్యూటర్ సైన్స్ కొత్త కోర్సులు(డేటా సైన్స్, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్) ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.నర్సయ్య అన్నారు. బుధవారం కోర్సుల వివరాలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని నచ్చిన కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశం పొందవచ్చని సూచించారు.
తెలుగు విశ్వవిద్యాలయానికిసోమనాథుడి పేరు పెట్టాలి
పాలకుర్తి టౌన్: స్వయంభూ సోమేశ్వర స్వామి నిలయం, మహాకవి పాల్కురికి సోమనాథుడి జన్మస్థలం అయని పాలకుర్తి క్షేత్రాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని సాయితీ వేత్త, ఎంప్లాయీస్ వాయిస్ సంపాదకులు క్యామ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులతో సోమేశ్వర స్వామిని దర్శించుకు న్న అనంతరం పాల్కురికి సోమనాథుడి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట ప్రఖ్యాత నర్తకి అడుసుమల్లి సుజాత, సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి సీఐ గట్ల మహేందర్‌రెడ్డి ఉన్నారు.
పోలింగ్ స్టేషన్‌ను
సందర్శించిన డీసీపీ
జనగామ రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పరిధి గిర్నిగడ్డ పాఠశాలలోని పోలింగ్ సెంటర్‌ను బుధవా రం డీపీసీ రాజమహేంద్రనాయక్ సందర్శించా రు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూ చించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి న వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ దామోదర్‌రెడ్డి ఉన్నారు.

ఇసుక అక్రమ రవాణా చేయొద్దు

ఇసుక అక్రమ రవాణా చేయొద్దు
Comments
Please login to add a commentAdd a comment