
రోడ్డుపైనే పార్కింగ్..
వ్యాపార, వాణిజ్య సంస్థలకు అడ్డగోలు అనుమతులు
● రహదారిపైనే వ్యాపారాలు
● అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్
● తరుచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలు..
జిల్లా కేంద్రానికి కనెక్టివిటీగా సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, నల్లగొండ, సిద్ధిపేట జిల్లా సరిహద్దులు ఉంటా యి. వాణిజ్యం, వ్యాపార పరంగా ఆరు జిల్లాల నుంచి వ్యాపారులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి నిత్యం వస్తుంటారు. అలాగే కలెక్టరేట్, జిల్లా పరిషత్, ఎల్‌ఐసీ, వ్యవసాయ మార్కెట్, ఉన్నత చదువుల కోసం వందలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో రాకపోకలు సాగిస్తారు. దీంతో ట్రాఫిక్ గతం కంటే ఐదు రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్‌రోడ్డు, సిద్ధిపేటరోడ్డు, రైల్వేస్టేషన్, నెహ్రూపార్కు, స్వర్ణకళామందిర్ రోడ్లు ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు రద్దీగా ఉంటా యి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు రోడ్ల విస్తరణ చేపట్టగా.. చాలా మంది యజమానులు కోట్లాది రూపాయల విలువైన స్థలాలను కోల్పోయారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండడానికి రోడ్లను వెడల్పు చేస్తే.. ఆ ప్రదేశాన్ని ఫుట్‌పాత్ వ్యాపారాలు, పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. బార్లు, వైన్స్, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు, షాపింగ్ మాల్స్ ఎదుట పార్కింగ్‌కు స్థలం లేక వచ్చే కస్టమర్లు కార్లు, బైక్‌లను రోడ్డుపైనే నిలపాల్సి వస్తున్నది. కొన్ని వాణిజ్య సంస్థలకు సెల్లార్లు ఉన్నా పార్కింగ్‌కు ఉపయోగించకుండా, వ్యాపారాల నిర్వహణకు అద్దెకు ఇస్తున్నారు.
జనగామ: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. షాపింగ్ మాల్స్, మార్డులు, వాణిజ్య సంస్థలకు పార్కింగ్ స్థలం లేకుండానే మున్సిపల్ నుంచి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. భవనాల నిర్మాణ సమయంలో సెల్లార్లు ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిని గోదాంలకు ఉపయోగించడం లేదా అద్దెకు ఇస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. జనగామ జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత వ్యాపార, వాణిజ్య పరంగా దినదినాభివృద్ధి చెందుతూ రవాణా, ప్రజల రాకపోకలతో ఎప్పడూ రద్దీగా ఉంటోంది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ వ్యాపారాలు పెరిగాయి. వాహనాల పార్కింగ్ కోసం రోడ్లను ఆక్రమిస్తుండడంతో ప్రమాదాలకు కారణమవుతోంది.
సెల్లార్లు అద్దెకు.. రోడ్డుపైనే వాహనాలు

రోడ్డుపైనే పార్కింగ్..

రోడ్డుపైనే పార్కింగ్..
Comments
Please login to add a commentAdd a comment