
బైక్ అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి మృతి
పుంగనూరు : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం పుంగనూరు– ముళబాగిల్ రహదారిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు .. మండలంలోని వనమలదిన్నె పంచాయతీ బసివినాయునిపల్లెకు చెందిన ఆదినారాయణ కుమారుడు సంతోష్ (17) పుంగనూరు బసవరాజ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితుడితో కలసి ద్విచక్ర వాహనంపై పుంగనూరు –ముళబాగిల్ రహదారిలో ఉన్న కత్తార్లపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడటంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఫుట్‌బాల్ సమాఖ్యకు
పీడీ ఎంపిక
పలమనేరు : పట్టణానికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీగా పనిచేస్తున్న విక్రమ్‌రాజ్ ఆల్ ఇండియా ఫుట్‌బాల్ సమాఖ్యకు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన ఎంపికల్లో జిల్లా నుంచి ఈయన మాత్రమే ఎంపిక అయ్యారు.

బైక్ అదుపుతప్పి ఇంటర్ విద్యార్థి మృతి
Comments
Please login to add a commentAdd a comment