
● ప్రశ్నించిన మహిళకు నరకం చూపెట్టిన క్లీనర్, డ్రైవర్
చికెన్‌షాపు నిర్వాహకుడిపై దాడి
పుంగనూరు : పట్టణంలో చికెన్‌షాపు నిర్వహిస్తున్న అహ్మద్‌బాషా(45)పై మంగళవారం రాత్రి దాడి చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని చింతలవీధిలో నివాసం ఉన్న అహ్మద్‌బాషా మసీదు వద్ద చికెన్‌షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతడిపై భార్యకు పలు అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అహ్మద్‌బాషా చికెన్‌షాపులో ఉండగా భార్య తస్లిమా, కుమారుడు మహమ్మద్ ఫయాజ్, మరికొంత మంది వచ్చి దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌బాషాను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీతారామాపురంలో చైన్ స్నాచింగ్
వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం సీతారామాపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పట్టపగలే బరితెగించిన చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో ఉన్న బంగారం గొలుసును తెంపుకుని పరారయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. పుత్తూరుకు వెళ్లడానికి ఓ మహిళ ఆటో కోసం సీతారామాపురం ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఓ బంక్ వద్ద వేచి ఉండగా ఇంతలో ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి బంక్‌కు కొద్ది దూరంలో నిలుపగా అందులో నుంచి ఓ వ్యక్తి దిగి బంక్ వద్దకు వచ్చి కూల్ డ్రింక్ కావాలని అడిగాడు. ఇంతలో అంగడి యజమాని కూల్ డ్రింక్ కోసం ప్రిజ్ వద్దకు వెళ్లగానే అక్కడ ఆటో కోసం వేచి ఉన్న మహిళ మెడలో ఉన్న బంగారం గొలుసును లాక్కొని పరారరైనట్లు ఎస్‌ఐ ధర్మారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
బస్సులో అయిదు సవర్ల బంగారం చోరీ
చిత్తూరు అర్బన్ : బ్యాగులు బస్సులో ఉంచి ప్రయాణిస్తుండగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై క్లీనర్, డ్రైవర్‌ను నిలదీయడంతో చిత్తూరులో దిగాల్సిన మహిళా ప్రయాణికురాలిని, బస్సుల్లో ఎక్కించుకొని బెంగళూరులో దించారు. చిత్తూరులో జరిగిన ఈ ఘటనపై తాలూక పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మల్లికార్జున కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన రమాదేవికి ఇద్దరు పిల్లలు. రెండో కుమార్తె విజయవాడలోని పెనగలూరులో నివాసం ఉంటోంది. ఈనెల 1వ తేదీన కుమార్తె వద్దకు వెళ్లిన రమాదేవి, 10వ తేదీన విజయవాడ నుంచి ఓ ప్రైవేటు బస్సులో చిత్తూరుకు టికెట్ బుక్ చేసుకున్నారు. తన బ్యాగులో అయిదు సవర్ల బంగారు నగలను ఉంచి, బస్సు డిక్కీలో ఉంచగా.. క్లీనర్ తాళాలు వేశాడు. బస్సు చిత్తూరుకు రాగా, బ్యాగుల కోసం చూడగా.. ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. దీనిపై క్లీనర్, డ్రైవర్లను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బాధితురాలు గట్టిగా అడిగేసరికి, బస్సు ఎక్కమని చెప్పి, ఆమెను బెంగళూరుకు తీసుకెళ్లి దించేసి.. నీ వల్ల అయ్యింది చేసుకో అంటూ డ్రైవర్లు వెళ్లిపోయారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బస్సు డ్రైవర్లు కరీముల్లా, రాజేష్‌తో పాటు క్లీనర్ శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

● ప్రశ్నించిన మహిళకు నరకం చూపెట్టిన క్లీనర్, డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment