
ఆకాశవాణి కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రాన్ని ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇంజనీరింగ్) బానోత్ హరిసింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రోతలకు నాణ్యమైన ప్రసారాలను అందించేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ విషయంలో ఆదిలాబాద్ ఆకాశవాణి ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం పేరును గొప్పగా నిలపాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ కేంద్రానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును కొనసాగించాలని సూచించారు. ఈ కేంద్రం అభివృద్ధికి తనవంతుగా తోడ్పాటును అందిస్తానన్నారు. అనంతరం జైనథ్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆయ న వెంట ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ శ్రీనివాస్, కేంద్రం ముఖ్య కార్యక్రమ అధికారి రామేశ్వర్ కేంద్రే, వెంకటేశులు, పోతురాజు, శశికాంత్, గిరీశ్‌కుమార్, వెంకటయ్య, విజయ కుమారి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment